వాతావరణం మార్పులతో అన్నిచోట్లా దాదాపు వర్షాలు పడుతున్నాయి. సీజనల్ వ్యాధులు దగ్గు, జలుబు, జ్వరం.. చాలామందికి వస్తున్నాయి. అయితే దానికి కావాల్సిన మందులతో పాటు ఈ వంటకాన్ని మీ ఆహారంలో తీసుకోండి. ఇది మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా నోటికి రుచికరంగానూ ఉంటుంది! అదే ధనియా రసం. ఇంకెందుకు ఆలస్యం. త్వరగా చేసేసుకోండి. వేడివేడి అన్నంలో కలుపుకొని లాగించేయండి.
కావాలిసిన పదార్థాలు
ధనియాలు, మిరియాలు, నానబెట్టిన చింతపండు, పోపు దినుసులు, టమాట, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, నూనె
తయారీ విధానం
ముందు ధనియాలు, మిరియాలు, వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు స్టవ్‌పై పాన్ పెట్టి అందులో నూనె పోయాలి. అది కాగిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాట వేసి వేగనివ్వాలి. అనంతరం దంచిపెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి. ఎండుమిర్చిని కూడా దానికి జత చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం, అందులోనే ఉప్పు-పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దానిని కొంచెంసేపు మరిగించిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి, ఓ బౌల్లోకి తీసుకుంటే సరి. ఎంతో రుచికరమైన 'ధనియా రసం' రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: