చేపలతో ఫ్రై, పులుసు, బిర్యానీ లాంటి వంటకాలు ప్రయత్నించి ఉంటారు. అయితే.. ఈ సారి కొత్తగా 'గోవా చేపల కూర'ను చేసుకోండి. అదెలాగంటారా? ఇదిగో తయారీ విధానం మీకోసం..
కావల్సినవి:
- చేప - అరకేజీ
- కొబ్బరి తురుము - ముప్పావు కప్పు
- ఉల్లిపాయలు - మూడు
- కారం - మూడు టేబుల్‌స్పూన్లు
- ధనియాల పొడి - అర టేబుల్ స్పూను
- పసుపు - టేబుల్ స్పూను
- మెంతులు - పావు చెంచా
- కరివేపాకు రెబ్బ- ఒకటి
- చింతపండు రసం - పావుకప్పు
- ఉప్పు - తగినంత
- నూనె - మూడు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి కొబ్బరి తురుము, కారం చేర్చాలి. అందులోనే ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, కరివేపాకు రెబ్బలు వేయాలి. కొబ్బరి బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. పూర్తిగా చల్లారనిచ్చి చింతపండు రసం చేర్చి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే పసుపు, సరిపడా ఉప్పు వేసి, మిశ్రమం చిక్కగా అయ్యాక చేప ముక్కల్ని కలపాలి. అవి ఉడికేందుకు సరిపడా నీళ్లు చేర్చి, మంట తగ్గించి మూత పెట్టేయాలి. అంతే చేపల కూర సిద్ధం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.
ఇదీ చదవండి: సగ్గుబియ్యంతో లడ్డూ, దోశ!