ఏ కుటుంబంలోనైనా చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినేది బిర్యానీ. వెజ్, చికెన్, మటన్, రొయ్యలు, చేపలు.. ఇలా ప్రతి దాంతో బిర్యానీ చేసుకోవచ్చు. కానీ 'చికెన్ ఫ్రై పీస్'తో బిర్యానీ (chicken fry piece biryani recipe) ఎపుడైనా ట్రై చేశారా!. తింటే మాత్రం.. 'వహ్వా' అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వంటకం తయారీ విధానాన్ని చూసేయండి.
కావల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సరిపడా ఉప్పు, ఎగ్, గరంమసాలా, ధనియాలపొడి, మైదాపిండి, వెనీగర్, అనాసపువ్వు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బగార పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, బాస్మతీ బియ్యం.
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్లో కడిగిన చికెన్ ముక్కలు (chicken fry piece biryani recipe) తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సరిపడా ఉప్పు, ఎగ్, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం మైదాపిండి, వెనీగర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేడి చేసుకుని, అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలని వేసి ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని, అందులో నూనె వేడి చేసుకుని అనాసపువ్వు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బగార పువ్వు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి.
అనంతరం అందులో నీళ్లు, నిమ్మరసం వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత అందులో ముందుగానే నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసుకుని మూత పెట్టుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకుంటే పులావ్ రెడీ అవుతుంది. సర్వ్ చేసుకునేప్పుడు చికెన్ ఫ్రై పీస్తో సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Shahi Chicken Biriyani recipe: సూపర్ టేస్ట్‌తో షాహీ బిర్యానీ