Chicken Recipes : సండే వచ్చిందంటే.. నాన్‌వెజ్ ప్రియులకు పండగ అన్నట్లే. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్.. అంటూ ఏదో ఒకరకం వండుకుంటారు. అయితే.. చికెన్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇసారి కొత్తగా ట్రై చేయండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
దహీ మసాలా కర్రీ:
Chicken Dahi Masala Curry:
కావలసిన పదార్థాలు:
- చికెన్: అరకేజీ
- పెరుగు: కప్పు
- అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
- పచ్చిమిర్చి ముద్ద: చెంచా
- జీలకర్రపొడి: టేబుల్‌స్పూన్
- మిరియాలపొడి: చెంచా
- గరంమసాలా: అరచెంచా
- పసుపు: అరచెంచా
- ఉప్పు: తగినంత
- నెయ్యి: పావుకప్పు
- టొమాటోలు: రెండు
- ఉల్లిపాయలు: రెండు
- జీడిపప్పు ముద్ద: రెండు చెంచాలు
- పచ్చిమిర్చి: మూడు
- గోరువెచ్చని నీళ్లు: కప్పు
- కసూరీమేథీ: చెంచా
- కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.
పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి- పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!
తయారీ విధానం:
- ఓ గిన్నెలో పెరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్రపొడి, మిరియాలపొడి, గరంమసాలా, పసుపు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, చికెన్ ముక్కలు వేసి అన్నింటినీ కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు, టమాట తరుగు వేయించాలి.
- తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి ఓసారి వేయించి స్టౌని సిమ్‌లో పెట్టాలి.
- అయిదు నిమిషాల తర్వాత జీడిపప్పు ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, మరికొంచెం ఉప్పు, గోరువెచ్చని నీళ్లు పోసి మూత పెట్టాలి.
- చికెన్ ఉడికాక కొత్తిమీర తరుగు, కసూరీమేథీ వేసి దింపేయాలి. అంతే నోరూరే దహీ మసాలా కర్రీ రెడీ..
నోరూరించే పులావ్- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!
సుక్కా చికెన్ మసాలా:
Sukka Chicken Masala:
కావలసినవి:
- చికెన్: అరకేజీ
- ఉల్లిపాయలు: ఆరు (సన్నగా తరగాలి)
- అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
- పసుపు: అరచెంచా
- ఉప్పు: తగినంత
- నూనె: పావుకప్పు
- నిమ్మరసం: టేబుల్‌స్పూను
- దాల్చినచెక్క: చిన్న ముక్క
- లవంగాలు: ఆరు
- యాలకులు: రెండు
- జీడిపప్పు: పన్నెండు (నానబెట్టుకుని పేస్టులా చేసుకోవాలి).
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!
మసాలాకోసం:
- ధనియాలు: టేబుల్‌స్పూను
- జీలకర్ర: చెంచా
- మిరియాలు: అరచెంచా
- సోంపు: చెంచా
- ఎండుమిర్చి: 5
- కరివేపాకు రెబ్బలు: మూడు
- ఎండు కొబ్బరిపొడి: టేబుల్‌స్పూను.
How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!
తయారీ విధానం:
- ముందుగా బాణలిలో మసాలా పదార్థాలను(ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, ఎండు కొబ్బరిపొడి) వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించుకోవాలి.
- ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి పచ్చి వాసన పోయేవరకు చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి.
- పది నిమిషాలయ్యాక చేసి రెడీగా పెట్టుకున్న మసాలా, జీడిపప్పు ముద్ద, అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్ ఉడికి కూర దగ్గరకు అయ్యాక నిమ్మరసం వేసి దింపేయాలి.
How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!
How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!