ETV Bharat / priya

chicken 555 biryani: నోరూరించే చికెన్ 555 చేసేద్దామా?

author img

By

Published : Oct 3, 2021, 9:42 AM IST

Updated : Oct 3, 2021, 9:48 AM IST

ఆదివారం వస్తే చాలు.. బిర్యానీయో, చికెన్‌ కర్రీయో లేనిదే భోజనం కానివ్వరు చాలామంది. బిర్యానీ సరే.. చికెన్‌ని (chicken 555 biryani) ఎప్పుడూ ఒకే విధంగా వండుకోవాలని లేదు కదా.. ఈసారి ఇలానూ ప్రయత్నించి చూడండి.

chicken 555
చికెన్ 555

సన్​డే.. అందరికీ ఫన్​డే కదా!. ఈ రోజుని ప్రతిఒక్కరు స్పెషల్​గా (special biryani recipe ) గడపాలనుకుంటారు. పసందైన నాన్​వెజ్​తో భోజనం ముగించాలనుకుంటారు. ఎప్పుడు ఒకేలా బిర్యానీ (chicken 555 biryani) చేసుకోకుండా ఈసారి కొత్తగా ప్రయత్నించండి.

చికెన్‌ కాలీమిర్చ్‌

కావలసినవి

చికెన్‌ ముక్కలు: అరకేజీ, ఉల్లిపాయ ముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: రెండు, జీడికప్పు: అరకప్పు, నూనె: అరకప్పు, లవంగాలు, యాలకులు: నాలుగు చొప్పున, దాల్చినచెక్క: చిన్న ముక్క, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, గిలకొట్టిన పెరుగు: పావుకప్పు,

ధనియాలపొడి: రెండుచెంచాలు, ఉప్పు: తగినంత, జీలకర్రపొడి: అరచెంచా, మిరియాలపొడి: నాలుగు చెంచాలు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, తేనె: చెంచా, కసూరీమేథీ: టేబుల్‌స్పూను, తాజా క్రీమ్‌: పావుకప్పు, గరంమసాలా: అరచెంచా.

chicken kalimirch
చికెన్ కాలీమిర్చ్

తయారుచేసే విధానం

ముందుగా ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పును ఓ గిన్నెలోకి తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి స్టౌమీద పెట్టాలి. పది నిమిషాలయ్యాక దింపేసి నీళ్లు వంపేసి, వాటన్నింటినీ మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ముందుగా చేసుకున్న జీడిపప్పు ముద్ద వేయాలి. పది నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి, చికెన్‌ ముక్కలు వేయాలి. ఇందులో పెరుగు, ధనియాలపొడి, గరంమసాలా, జీలకర్రపొడి, తగినంత ఉప్పు వేసి... కప్పు నీళ్లు, మూడు చెంచాల మిరియాలపొడీ వేసి కలిపి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికాక నిమ్మరసం, తేనె, కసూరీమేథీ, మిగిలిన మిరియాలపొడి, క్రీమ్‌ వేసి ఓసారి కలిపి దింపేయాలి.

చికెన్‌ టిక్కా మసాలా

chicken tikka masala
చికెన్ టిక్కా మసాలా

కావలసినవి

టిక్కా కోసం - చికెన్‌: ముప్పావుకేజీ, పెరుగు: కప్పు, కారం, గరంమసాలా: చెంచా చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, జీలకర్రపొడి: ఒకటిన్నర చెంచా, కసూరీమేథీ: ముప్పావుచెంచా, నిమ్మరసం: టేబుల్‌స్పూను, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు. గ్రేవీకోసం: టొమాటోలు: అయిదు, ఉల్లిపాయ ముక్కలు: ముప్పావుకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: అరటేబుల్‌స్పూను, జీలకర్ర: చెంచా, పచ్చిమిర్చి: రెండు, యాలకులు: నాలుగైదు, దాల్చినచెక్క: రెండు అంగుళాలముక్క, లవంగాలు: ఎనిమిది, టొమాటో ప్యూరీ: అరకప్పు, క్యాప్సికమ్‌: ఒకటి (ముక్కల్లా కోయాలి), క్రీమ్‌: అరకప్పు, జీలకర్రపొడి, ధనియాలపొడి: చెంచా చొప్పున, పసుపు: అరచెంచా, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: ముప్పావుచెంచా, తేనె: రెండు చెంచాలు, నూనె: ముప్పావుకప్పు, వెన్న: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, కసూరీమేథీ: చెంచా.

తయారుచేసే విధానం

ముందుగా చికెన్‌తోపాటు టిక్కాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ కలిపి ఓ రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టేయాలి. మర్నాడు ముందుగా వేడిచేసి పెట్టుకున్న ఒవెన్‌లో ఈ చికెన్‌ని ఉంచి... ఇరవైఅయిదు నిమిషాలు బేక్‌చేసుకుని తీసుకోవాలి. లేదంటే ఈ ముక్కల్ని స్టౌమీద గ్రిల్‌పాన్‌పైన కాల్చుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె, వెన్న వేసి... యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు వేయించాలి. అర నిమిషం అయ్యాక జీలకర్ర, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద వేయాలి. నిమిషం తరువాత టొమాటో ముక్కలు వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. టొమాటో ముక్కలూ వేగాక క్యాప్సికం ముక్కలు, ధనియాలపొడి, కారం, పసుపు, టొమాటో ప్యూరీ, జీలకర్రపొడి వేసి ఓసారి కలిపి ముప్పావుకప్పు నీళ్లు పోయాలి. ఇది గ్రేవీలా అయ్యాక చికెన్‌ముక్కలు, క్రీమ్‌, తేనె, గరంమసాలా వేసి, ఓసారి కలిపి మూత పెట్టాలి. అయిదు నిమిషాల తరువాత కసూరీమేథీ వేసి దింపేస్తే సరి.

చికెన్‌ 555

కావలసినవి

chicken 555
చికెన్ 555

మారినేషన్‌ కోసం - చికెన్‌: అరకేజీ, తందూరీ మసాలా: రెండు టేబుల్‌స్పూన్లు (బజార్లో దొరుకుతుంది), చాట్‌మసాలా, ధనియాలపొడి, పసుపు: అరచెంచా చొప్పున, కారం: చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, నిమ్మరసం: రెండుటేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, మైదా: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: రెండు కప్పులు. గ్రేవీ కోసం- ఉల్లిపాయ ముక్కలు: కప్పు, టొమాటో ప్యూరీ: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తరుగు: చెంచా, వెల్లుల్లిరెబ్బలు: ఆరు(సన్నగా తరగాలి), పుదీనా ఆకులు: అరకప్పు, చక్కెర: అరచెంచా, కారం: చెంచా, కసూరీమేథీ: చెంచా, ఉప్పు: తగినంత, వెన్న: పావుకప్పు, క్రీమ్‌: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: కట్ట, జీలకర్ర: చెంచా.

తయారుచేసే విధానం

చికెన్‌ని పెద్ద ముక్కల్లా కోసుకోవాలి. వీటిపైన నూనె తప్ప మారినేషన్‌ కోసం పెట్టుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంటయ్యాక స్టౌమీద పాన్‌ పెట్టి... నూనె వేయాలి. అది వేడయ్యాక చికెన్‌ ముక్కల్ని రెండుచొప్పున వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. స్టౌమీద మరో కడాయి పెట్టి వెన్న వేసి, జీలకర్ర, పుదీనా ఆకులు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. ఉల్లిపాయముక్కలు ఎర్రగా వేగాక చక్కెర, సరిపడా ఉప్పు, టొమాటోప్యూరీ, కసూరీమేథీ, కారం వేసి కాసిని నీళ్లు పోయాలి. ఇది గ్రేవీలా అవుతున్నప్పుడు క్రీమ్‌ వేయాలి. రెండు నిమిషాల తరువాత చికెన్‌ముక్కలు వేసి బాగా కలిపి... కొత్తిమీర వేసి దింపేయాలి.

ఇదీ చదవండి:Mixed Vegetable Biryani: పసందైన మిక్స్​డ్​ వెజ్​ బిర్యానీ

Last Updated : Oct 3, 2021, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.