క్యారెట్, కొబ్బరి రెండూ నిండు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు. మరి వాటితో నోరూరించే పూర్ణాలు చేసుకుందాం రండి..
కావలసినవి
మైదాపిండి: కప్పు, బియ్యప్పిండి: కప్పు, క్యారెట్ తురుము: కప్పు, నెయ్యి: 2 టీస్పూన్లు, పచ్చికొబ్బరి తురుము: అరకప్పు, యాలకులపొడి: టీస్పూను, పంచదార: అరకప్పు, వంటసోడా: చిటికెడు, ఉప్పు: కొద్దిగా, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
- ఓ గిన్నెలో మైదాపిండి, బియ్యప్పిండి, వంటసోడా, ఉప్పు, నీళ్లు పోసి పలుచగా దోసెల పిండిలా కలపాలి.
- పాన్‌లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. పచ్చికొబ్బరిని కూడా వేసి వేగాక అందులోనే పంచదార, యాలకులపొడి వేసి వేయించాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక దించి చల్లారనివ్వాలి. తరవాత చిన్న ఉండల్లా చేసి పక్కన ఉంచుకుని మైదాపిండి మిశ్రమంలో ముంచి పూర్ణాల్లా వేయించి తీయాలి.
ఇదీ చదవండి: 'చిక్కుడు- చికెన్ పలావ్' సింపుల్ రెసిపీ!