ETV Bharat / priya

Just Cook : వ్యాపకమే వ్యాపారమైంది.. కస్టమర్ల మనసు దోచుకుంది... - ready to cook

ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే ఆ యువతులిద్దరివి వృత్తిపరంగా వేర్వేరు రంగాలు. కానీ అభిరుచుల విషయానికొస్తే మాత్రం ఇద్దరూ ఇష్టపడేది వంటలే. కుకింగ్​పై ఎక్కువగా మక్కువ చూపే ఈ స్నేహితురాళ్లు.. ఈజీగా వండ గలిగే రెసిపీలపై ప్రయోగాలు చేసేవారు. అవి సక్సెస్ అయి.. సూపర్బ్ టేస్టీగా ఉన్నాయని అందరూ మెచ్చుకోవడంతో తమ హాబీనే.. బిజినెస్​గా మార్చుకుందామనుకున్నారు. అనుకున్నదే తడవుగా "జస్ట్ కుక్"(Just Cook) అనే పేరుతో తమ వ్యాపార ప్రయాణం మొదలుపెట్టారు.. పుణెకు చెందిన ఈ అమ్మాయిలు...

వ్యాపకమే వ్యాపారమైంది.. కస్టమర్ల మనసు దోచుకుంది...

author img

By

Published : Aug 2, 2021, 1:53 PM IST

‘జస్ట్‌ కుక్‌(Just Cook)’... ఇది ఇద్దరి యువతులకొచ్చిన ఆలోచన. చదువు, కెరీర్‌ పరంగా ఇరువురిదీ వేరే రంగాలైనా.. అభిరుచి ఈ స్నేహితురాళ్లను ఒకే మార్గంలో నడిపించింది. రసాయనరహితంగా రెడీమేడ్‌ ఫుడ్‌ తయారుచేసి అతి కొద్దికాలంలోనే వినియోగదారుల మనసులనూ దోచుకుంటున్నారు పుణెకు చెందిన ఈ మిత్రద్వయం. వారి స్ఫూర్తి కథనం ఇది.

ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆకాంక్ష సత్నాలికా, ఛార్టెడ్‌ అక్కౌంటెంట్‌ ఖుష్బూ ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. కలిసిన ప్రతిసారీ ఇద్దరి మధ్య వంటల గురించి ప్రస్తావన వచ్చేది. కలిసి రకరకాల ప్రయోగాలు చేసేవారు. మన సంప్రదాయ వంటకాలు ఎంత రుచిగా ఉన్నా...వండేందుకు మాత్రం ఎక్కువ సమయం పడుతుందన్న చర్చ ఇద్దరి మధ్య తరచూ వస్తూ ఉండేది. దాంతో అప్పటికప్పుడు సులువుగా చేసుకోగలిగే రుచికరమైన అల్పాహారాలు ఏమున్నాయా అని...ఎన్నో ప్రయోగాలు చేశారు. అలా చేసినవాటిని ‘రెడీ టు కుక్‌’ అంటూ అందరికీ ఇచ్చి వండమనేవారు. అవి బాగున్నాయని కితాబు రావడంతో...‘జస్ట్‌ కుక్‌’ పేరుతో వ్యాపార ప్రయాణం మొదలుపెట్టారు.

ఆన్‌లైన్‌లో..

గతేడాది కొవిడ్‌ మొదలైనప్పుడే ఆకాంక్ష, ఖుష్బూ ‘జస్ట్‌ కుక్‌(Just Cook)’ను ప్రారంభించారు. లాక్‌డౌన్‌ కావడంతో వీరు తయారుచేసే ఉత్పత్తులకు ఆన్‌లైన్‌లో గిరాకీ పెరిగింది. మొదట ఇడ్లీ, దోశ పిండిని మిక్సీల్లో కాకుండా రుబ్బురోలులో తయారుచేయడంతో ప్రత్యేక రుచి వచ్చేది అని చెబుతోంది ఆకాంక్ష. ‘మొదట మా ప్రయోగాలన్నీ ల్యాబ్‌కు పంపించి పరీక్షించేవాళ్లం. అలాగే ఎన్ని రోజులు నిల్వ ఉంటాయనేది కూడా అధ్యయనం చేశాం. కొన్ని రోజులు ఇరుగుపొరుగువాళ్లకి ఉచితంగా ఇచ్చేవాళ్లం. వారి అభిప్రాయాలను సేకరించి...ఎన్నో ప్రయోగాలు చేసి మార్కెట్‌లోకి తెచ్చాం’ అని చెబుతోంది ఆకాంక్ష.

ఉత్పత్తులను పెంచి ..

‘ఇడ్లీ, దోసెతో పాటు ఖమాన్‌ ఢోక్లా మిక్స్‌, సాంబార్‌ మిక్స్‌..., పలు రకాల చట్నీలు మేం తయారుచేస్తున్నాం. ఇప్పుడు 15 సూపర్‌మార్కెట్లతో పాటు సూపర్‌డైలీ, బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ సైట్ల ద్వారానూ జస్ట్‌ కుక్‌ ఉత్పత్తులు లభ్యమయ్యేలా చేయగలిగాం. రూ.10లక్షలు పెట్టుబడితో దీన్ని ప్రారంభించాం. రెండేళ్లలో దీని అభివృద్ధికి తగినట్లుగా ఏంజల్‌ ఇన్వెస్టర్స్‌ రూ.2 కోట్లు అందించారు’ అంటోంది ఖుష్బూ. తమ కెరీర్‌లను వదిలి, వాణిజ్యవేత్తలుగా మారిన ఈ మిత్రద్వయం ప్రయాణం మాత్రం అంత తేలికగా జరగలేదు. మొదట్లో వీరి ఉత్పత్తులను దుకాణాలు తీసుకోవడానికి వెనుకడుగు వేశాయి. అలాగే ఆన్‌లైన్‌లో వ్యాపారం పెరిగే సమయానికి కొవిడ్‌ వ్యాప్తి పెరగడంతో సిబ్బంది రాకపోవడంతోపాటు, ఉత్పత్తులను తరలించడంలోనూ ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. వాటన్నింటినీ దాటి తమ లక్ష్యంవైపు అడుగులేసి విజయాన్ని సాధించారు. తమలాంటి మరికొందరికి మార్గాన్ని చూపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.