ETV Bharat / priya

వాడేసిన వంట నూనెను వాడుకోండిలా! - వంట నూనె

వాడేసిన నూనెను ఏం చేస్తారు?.. అంటే పడేస్తాము అనే సమాధానం వస్తుంది. కానీ ఆ నూనెతో ఎన్నో లాభాలున్నాయని మీకు తెలుసా? మరి చదివేయండి..

oil
నూనె
author img

By

Published : Aug 6, 2021, 12:30 PM IST

పూరీలో, గారెలో మరేవైనా పిండి వంటలు చేసినప్పుడు కొద్దిగా నూనె మిగిలిపోతుంది. దీన్ని మళ్లీ మళ్లీ వాడితేనేమో ఆరోగ్యం పాడవుతుందని చెప్పి చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ ఆ నూనెతో ఎన్నో ఉపయోగాలున్నాయి.

  • ఈ నూనెను వడకట్టి ఓ సీసాలో పోసి పెట్టుకోండి. గొళ్లెం, బోల్టులు, తాళాల్లో రెండు మూడు చుక్కలు వేయడమో, లేదా ఈ నూనెతో తుడవడమో చేస్తే అవి బిగుతుగా మారవు. సులువుగా వదులవుతాయి. వాటిని వాడేటప్పుడు శబ్దాలు రావు. తుప్పు పట్టవు కూడా.
  • కరెంటు పోయినప్పుడు మట్టి ప్రమిదల్లో ఈ నూనె పోసి దీపాలు వెలిగించుకోవచ్చు. క్యాండిల్స్‌ కొనక్కర్లేదు.
  • ఈ కాలంలో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి. ఇలాంటప్పుడు కాగితానికి ఈ నూనె రాసి పురుగులు వచ్చే చోట వేలాడదీస్తే దానికి అతుక్కుంటాయి. తెల్లారాక ఆ కాగితాన్ని పారేస్తే సరి.
  • ఈ నూనెలో కొద్దిగా వెనిగర్‌ కలిపి కలప ఫర్నిచర్‌ను తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
  • లెదర్‌తో చేసిన బ్యాగులు, ఇతర వస్తువులను ఈ నూనెతో తుడిస్తే మరింత మృదువుగా మారడమే కాకుండా కాంతులీనుతాయి.
  • గోడలపై పెయింట్‌ మరకలను పొగొట్టాలంటే ఈ నూనెలో పాత వస్త్రాన్ని ముంచి రుద్దితే సరి.
  • ఈ నూనెను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి కాసేపయ్యాక షాంపూ, కండిషనర్‌తో శుభ్రం చేసుకుంటే జుట్టు పట్టులా మారుతుంది.
  • కొత్తగా తెచ్చిన ఇనుము, ఇత్తడి లాంటి సామగ్రికి ఈ నూనె రాసి తోమితే చక్కగా శుభ్రపడతాయి.

ఇదీ చూడండి:- నోరూరించే హైదరాబాద్‌ సబ్జీ దమ్‌కీ బిర్యానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.