ETV Bharat / opinion

విద్యుత్ రంగ సంస్కరణలతో ఎవరికి మేలు? - విద్యుత్ రంగంలో సంస్కరణలు

విద్యుత్‌ చట్ట సవరణలను దేశ విద్యుత్‌ రంగంలోని ఉద్యోగులు, రైతులు, ప్రజాసంఘాలు, అనేక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్‌ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందువల్ల జాతి విశాల ప్రయోజనాల దృష్ట్యా మరింత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్రాలతోపాటు పార్లమెంటు ఉభయసభలలోనూ విస్తారంగా చర్చించిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడం మేలు!

power sector
విద్యుత్
author img

By

Published : Sep 25, 2020, 6:41 AM IST

మనిషి ప్రాథమిక అవసరాల్లో విద్యుత్తు అత్యంత కీలకం. ప్రస్తుతం మానవాళి జీవన గమనాన్నే శాసిస్తున్న వనరు ఇది. మూడు లక్షల 71వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మన దేశం- ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. తలసరి వినియోగం ప్రాతిపదికన 1,181 యూనిట్లతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా ముందుంది. అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్తు నిత్యావసరంగా మారిన నేపథ్యంలో- దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఏమాత్రం ఇబ్బంది కలిగించినా ప్రతిఘటన ఎదురవుతుంది.

కాలం చెల్లిన మూడు విద్యుత్‌ చట్టాలను తొలగించి, వాటి స్థానంలో 2003లో సమగ్ర విద్యుత్‌ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి మొన్న ఏప్రిల్‌లో కొన్ని సవరణలు జోడించిన కేంద్ర ప్రభుత్వం సంబంధిత బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది. తాజాగా విద్యుత్‌ పంపిణీ సంస్థల అమ్మకానికి టెండరు ప్రమాణాలు తయారుచేసి వాటిపై విస్తృత బహిరంగ చర్చ జరిపి సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

కొత్త ప్రమాణాలు

వాస్తవానికి, పాత చట్టాల్లోనే ప్రైవేటీకరణకు వెసులుబాటు ఉంది. అహ్మదాబాద్‌, కోల్‌కతా, ముంబై మహానగరాల్లో కొనసాగుతున్న టాటా వంటి ప్రైవేటు పంపిణీ సంస్థలు ఈ తరహాలో ఏర్పాటైనవే. 2003 చట్టం తరవాత దిల్లీ నగరం, ఒడిషాల్లో లైసెన్సులు పొంది నిర్వహణ చేపట్టిన ప్రైవేటు పంపిణీ సంస్థ- ఒడిషాలో బాధ్యతలను నిభాయించలేక వైదొలగింది. అత్యధిక ఆదాయం వచ్చే నగరాల్లో మాత్రమే ప్రైవేటు సంస్థలు కొనసాగుతున్నాయి. తాజాగా వెలువడిన టెండర్‌ ప్రమాణాలను పరిశీలిస్తే ఎక్కువ జనసాంద్రతగల పట్టణాలూ నగరాల్లో వందశాతం- గ్రామీణ, విద్యుత్‌ బిల్లులో రాయితీ అవసరం ఉన్న ప్రాంతాల్లో 74 శాతం ప్రైవేటు భాగస్వామ్యానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తపరచింది.

అంతేకాక సగటు ఆదాయం కన్నా ఎక్కువ ఖరీదుతో కొనే పాత విద్యుత్‌ ఒప్పందాలు; ఇప్పటికే ఉన్న నష్టాలు, అప్పులతో కొత్తగా వచ్చే ప్రైవేటు సంస్థలకు సంబంధం ఉండబోదు. అదేగాక 2003 చట్టంలోనే ‘ఫ్రాంచైజీలు’ ఏర్పాటు చేసుకునే వారికి వెసులుబాటు ఉంది. ‘ప్రాంచైజీ’ అంటే ఒక పంపిణీ సంస్థ తరఫున దాని పరిధిలోని కొంత భూభాగంలో విద్యుత్‌ పంపిణీ చేయడానికి అనుమతి పొందే ఒక సంస్థ. ఈ తరహాలో ఏర్పాటైనవే బిహార్‌లోని గయ, సమస్తిపూర్‌, భాగల్పూర్‌; మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, సాగర్‌, ఉజ్జయిని; మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, నాగపూర్‌, జల్గావ్‌, భివాండీ; ఝార్ఖండ్‌లోని రాంచీ, జెంషెడ్‌పూర్‌లలోని వ్యవస్థలు. అనంతరం (భివాండీ మినహా) ఈ ప్రాంతాల్లో నిర్వహణ సాధ్యంకాక సంబంధిత ఫ్రాంచైజీలన్నీ ఒప్పందం నుంచి వైదొలగాయి. వాటిలో ఏఈఎస్‌ వంటి విదేశీ సంస్థలు సైతం ఉండటం గమనార్హం.

కొందరికే పరిమితం..

సమాంతర లైసెన్సింగ్‌ విధానం అంటే- టెలికాం రంగం తరహాలో ఎవరైనా సమాంతరంగా లైన్లు, సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని, విద్యుత్తును పంపిణీ చేసుకోవడానికి అనువుగా చట్టాన్ని సవరిస్తూ బిల్లు తెచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం 2014, 2018ల్లో ప్రయత్నించింది. కానీ, రాజకీయంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయా సందర్భాల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ తరహాలోనే ఎప్పటినుంచో ముంబయి మహానగరంలో రిలయన్స్‌, టాటా వంటి ప్రైవేటు సంస్థలు విద్యుత్తు పంపిణీ చేస్తున్నాయి.

వీటి కార్యకలాపాలు ప్రధానంగా అత్యధికంగా విద్యుత్తును వినియోగించి, బిల్లులు చెల్లించగల సామర్థ్యం ఉన్నవారికే పరిమితమయ్యాయి. మురికివాడల్లో పేదలకు స్థానికంగా అక్కడి ప్రభుత్వాలనుంచి రాయితీ అందుతోంది. ఈ విధానం అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడంతో- దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు విద్యుత్తు సేవా ప్రమాణాలను పెంచనున్నారన్న నెపంతో ఏకంగా పంపిణీ సంస్థల మొత్తం లైన్లను, సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌ఫార్మర్‌లను సాంకేతిక కమిటీ నిర్ణయించిన నికర ధరకు విక్రయించేదిశగా అడుగులు పడుతున్నాయి. సంస్థల భూములకు నామమాత్రపు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. రాష్ట్రాల్లో ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఏర్పాటు కాబోయే అత్యున్నత కమిటీ- ఈ ప్రైవేటు సంస్థలు నిలదొక్కుకునేందుకు తగిన తోడ్పాటు అందించాల్సి ఉంటుంది.

ఇదిగాక, సవరణ బిల్లు- 2020లో పంపిణీ సంస్థను రెండు ముక్కలుగా అంటే పంపిణీ, సరఫరా సంస్థలుగా విడదీసేందుకు వెసులుబాటు కల్పించింది. విద్యుత్‌ లైన్లను, సబ్‌ స్టేషన్లను పంపిణీ సంస్థ నిర్వహిస్తుంది. నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించే బాధ్యత పంపిణీ సంస్థలపై ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు మాత్రం సబ్‌-లైసెన్సీలతో సరఫరా కంపెనీలను ఏర్పాటు చేసుకొని- లైన్లు వాడుకున్నందుకు పంపిణీ సంస్థలకు అద్దె చెల్లించి, వినియోగదారులకు విద్యుత్తును విక్రయించుకోవచ్ఛు అంటే ఆ ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ఎటువంటి పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేసుకోవచ్చు. ఈ విధానంతో ప్రభుత్వ సగటు విద్యుత్‌ కొనుగోలు ధరకన్నా అధికంగా చెల్లించే వ్యాపార, పారిశ్రామిక వర్గాలను ప్రైవేటు సరఫరా సంస్థలు చేజిక్కించుకుంటాయి.

పేదలకు శరాఘాతం!

దీనివల్ల కేవలం రాయితీతో విద్యుత్‌ అందించే అల్పాదాయ వర్గాలు, వ్యవసాయ వినియోగదారులు మాత్రమే పంపిణీ సంస్థలకు మిగులుతారు. విద్యుత్‌ చట్టం 2003లో ఒక మెగావాట్‌ పైబడి వాడుకునే వినియోగదారులు, ‘ఓపెన్‌ యాక్సెస్‌’ పద్ధతిలో పంపిణీ సంస్థల లైన్లకు అద్దె చెల్లించి తమకు నచ్చిన ఉత్పత్తి కేంద్రంనుంచి వినియోగించుకునే వెసులుబాటు ఇప్పటికే ఉంది. కాబట్టి ఈ సవరణ ఆమోదం పొంది, అమలు మొదలైతే ప్రభుత్వ పంపిణీ సంస్థలు మరింత నష్టాల్లో కూరుకుపోవడమేగాక కొంత కాలానికి కనుమరుగయ్యే ప్రమాదమూ కొట్టిపారేయలేనిది. అత్యంత కీలక విద్యుత్‌ రంగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. ఇది దేశ ప్రజలకు శ్రేయస్కరం కాదు.

విద్యుత్‌ చట్టానికి ప్రతిపాదించిన సవరణలు ఇంకా పార్లమెంటులో చర్చకు నోచుకోలేదు. కానీ, ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ ఝార్ఖండ్‌, అసోం వంటి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రైవేటీకరణ లేదా విక్రయం కోసం టెండర్లు సిద్ధం చేశారు. ప్రతిపాదిత చట్ట సవరణలను సాధ్యమైనంత సత్వరం అమలు చేయాలన్న ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తున్న చర్యలివి. విద్యుత్‌ చట్ట సవరణలను దేశ విద్యుత్‌ రంగంలోని ఉద్యోగులు, రైతులు, ప్రజాసంఘాలు, అనేక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్‌ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందువల్ల జాతి విశాల ప్రయోజనాల దృష్ట్యా మరింత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్రాలతోపాటు పార్లమెంటు ఉభయసభలలోనూ సవిస్తారంగా చర్చించిన మీదట అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడం మేలు!

(రచయిత- ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఇంధన రంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.