ETV Bharat / opinion

సాఫీగా సాగేందుకు సాంకేతిక అండ

author img

By

Published : Jan 10, 2021, 6:48 AM IST

రానున్న రెండేళ్లలో దేశంలో ఉన్న వసూలు కేంద్రాలన్నీ(టోల్‌ప్లాజా) ఎత్తేసి, ఉపగ్రహాల సాయంతో రుసుము వసూళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు ఇటీవల 'అసోచామ్‌' సదస్సులో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. జీపీఎస్‌ ఆధారంగా వాహనదారు బ్యాంకు ఖాతా నుంచి రహదారి రుసుమును మినహాయించుకునే వ్యవస్థ రానుంది. పాత వాహనాల్లో జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, దుబాయి వంటి చోట్ల రహదారి రుసుము వసూళ్లన్నీ దాదాపుగా మానవ ప్రమేయం లేకుండానే సాగుతున్నాయి.

benefits from the fast tag toll system
సాఫీగా సాగేందుకు సాంకేతిక అండ

జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షల వాహనాలు రహదారి సుంకం/రుసుము చెల్లించేందుకు వసూలు కేంద్రాల (టోల్‌ప్లాజా) వద్ద ఆగడం ఓ ప్రహసనం. సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండగల వేళల్లో వసూలు కేంద్రాలకు అటూఇటూ వాహనాలు కిలోమీటర్ల దూరం బారులు తీరుతున్న దృశ్యాలూ కనిపిస్తుంటాయి. దీనివల్ల రుసుము చెల్లించేందుకు పట్టే సమయం, చమురు వినియోగం వంటి వ్యయాలతో దేశవ్యాప్తంగా ఏటా రూ.60 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు భారత రవాణా సంస్థ, ఐఐఎం-కలకత్తా 2013లోనే సర్వే చేసి తేల్చాయి.

ఫాస్టాగ్​తో చమురు, సమయం ఆదా

దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలెక్ట్రానిక్‌ పద్ధతిలో రుసుము వసూళ్ల కోసం 2017లో ప్రత్యేకంగా 'ఫాస్టాగ్‌' పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇందులో ముందస్తుగానే డబ్బులు చెల్లించేవారికి 'రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరిజ్ఞానం(ఆర్‌ఎఫ్‌ఐడీ)'తో కూడిన ఓ స్టిక్కర్‌ను ఇస్తారు. దీన్ని వాహనానికి అతికిస్తే, వసూలు కేంద్రంలో ఫాస్టాగ్‌ ఆధారిత సెన్సర్‌ దూరం నుంచే గుర్తించి ఆగకుండా వెళ్లడానికి దారి ఇస్తుంది. తరవాత వాహనదారు ఖాతా నుంచి రుసుము దానంతటదే వసూలవుతుంది. వాహనం ఆగకుండా వెళ్లడం వల్ల సమయం, చమురు కూడా ఆదా అవుతాయి. ఫాస్టాగ్‌ తీసుకోవడానికి 2020 డిసెంబర్‌ 31 చివరి గడువని కేంద్రప్రభుత్వం ప్రకటించినా, చాలామంది తీసుకోకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు అవకాశం కల్పించింది.

ఫాస్టాగ్‌ తప్పనిసరి

దేశంలో 1.35 లక్షల కిలోమీటర్ల నిడివి గల జాతీయ రహదారులున్నాయి. వీటిపై వెళ్లే నాలుగు చక్రాలు, అంతకంటే పెద్ద వాహనాలు అయిదు కోట్లదాకా ఉన్నట్లు అంచనా. ఈ వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించినందుకు రుసుము చెల్లించేందుకు దేశవ్యాప్తంగా 562 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2019 చివరి నాటికి కోటి వాహనాల యజమానులు కూడా ఫాస్టాగ్‌ తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పనిసరి అని ప్రచారం చేస్తూ, అది వినియోగదారులకు చేరువయ్యేందుకు పలు చర్యలు చేపట్టింది.

ఇంకా 30 పైగా వాహనాలకి ఫాస్టాగ్​ లేదు

24 బ్యాంకులతోపాటు అమెజాన్‌, పేటీఎం లాంటి డిజిటల్‌ వాలెట్ల ద్వారా కూడా ఫాస్టాగ్‌ తీసుకునేందుకు, దాన్ని రీఛార్జి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ చర్యలన్నీ ఫలించి గత ఏడాదిలో ఫాస్టాగ్‌ తీసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. 2019తో పోలిస్తే 2020లో ఇది 400 శాతం పెరిగింది. అయినప్పటికీ రుసుము చెల్లించాల్సిన వాహనాల్లో 30 శాతానికిపైగా ఫాస్టాగ్‌ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కఠినచర్యలు చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే నాలుగు చక్రాలు, అంతకంటే పెద్ద వాహనాలు కొత్తవి కొనేటప్పుడే ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించింది. ఇకపై వాహనం ఫిట్‌నెస్‌ పరీక్షకు వెళ్లినా, బీమా తీసుకొనే సందర్భంలో ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయబోతోంది.

ఉపగ్రహాల ద్వారా టోల్​ వసూల్​

రానున్న రెండేళ్లలో దేశంలో ఉన్న వసూలు కేంద్రాలన్నీ ఎత్తేసి, ఉపగ్రహాల సాయంతో రుసుము వసూళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు ఇటీవల ‘అసోచామ్‌’ సదస్సులో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. జీపీఎస్‌ ఆధారంగా వాహనదారు బ్యాంకు ఖాతా నుంచి రహదారి రుసుమును మినహాయించుకునే వ్యవస్థ రానుంది. ఇప్పుడు వస్తున్న అన్ని వాణిజ్య వాహనాల్లో ‘వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌’ ఉన్నందువల్ల వసూలు సులువుగా జరిగిపోతుంది. పాత వాహనాల్లో సైతం జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

1959 నుంచే ప్రయత్నాలు

రుసుము వసూలు కేంద్రాల వద్ద ఆగకుండా వెళ్లేందుకు వీలుగా 'ఎలెక్ట్రానిక్‌ టోల్‌ సిస్టమ్‌ (ఈటీసీ)' ఏర్పాటుకు పలు దేశాలు 1959 నుంచే ప్రయత్నించాయి. ప్రతి వాహనానికీ ట్రాన్స్‌పాండర్లు అమర్చడం ఇబ్బందికరంగా మారింది. దీంతో 2001లో జపాన్‌ ఈటీసీని ప్రవేశపెట్టి విజయం సాధించింది. నార్వే వంటి దేశాలు మరింత ముందడుగు వేశాయి. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, దుబాయి వంటి చోట్ల రహదారి రుసుము వసూళ్లన్నీ దాదాపుగా మానవ ప్రమేయం లేకుండానే సాగుతున్నాయి.

సామాన్యులకూ లాభమే!

ప్రస్తుతం ఫాస్టాగ్‌ పద్ధతి అమలులో ఉండగా, మరో రెండేళ్లలో ఉపగ్రహ పద్ధతిలో రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఎలెక్ట్రానిక్‌ పద్ధతిలోనే రుసుము వసూలైతే ఏటా 87వేల కోట్ల రూపాయల ఆదా అవుతుందని భారత రవాణా సంస్థ, ఐఐఎం-కలకత్తా నివేదించాయి. వసూలు కేంద్రాల నిర్వహణ వ్యయమూ తగ్గుతుంది. దేశవ్యాప్త అనుమతి కలిగిన ఒక రవాణా వాహనం ఏడాదికి నాలుగు నుంచి అయిదు లక్షల రూపాయలు రహదారి రుసుముగా చెల్లించాల్సి వస్తోందని; చమురు ధరల పెరుగుదల, నిర్వహణ నష్టాలతో ఆర్థికంగా కుదేలైన తమకు రుసుము చెల్లింపు భారంగా మారుతున్నట్లు యజమానులు వాపోతున్నారు. ఈ దశలో ఆధునిక పద్ధతుల వల్ల- వసూలు కేంద్రాల నిర్వహణ వ్యయంలో ఆదా అయ్యే మొత్తాన్ని రహదారి రుసుము తగ్గించేందుకు వినియోగించాలని రవాణా రంగ నిపుణులూ సూచిస్తున్నారు. రవాణా వ్యయాలు తగ్గితే, వస్తువుల రేట్లూ దిగివచ్చి సామాన్య ప్రజలకు ధరాభారం నుంచి ఉపశమనం దక్కుతుంది.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

ఇదీ చూడండి: డేటా షేరింగ్‌పై 'వాట్సాప్‌' వివరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.