ETV Bharat / opinion

వన్నెతగ్గిన గురుపీఠాలు-వీసీల నియామకాల్లో పెడధోరణులు - వీసీల నియామకాల్లో ముఖ్యమంత్రుల హస్తం

విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల జోక్యం మితిమీరిపోతోందన్న అపవాదు ఉంది. ఉన్నత విద్యాసంస్థల్లో సేవలందిచాల్సిన ఉపకులపతులు రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా మారుతున్నారు. నాయకుల అనుకూలురు, బంధువులు వీసీలుగా నియామకం అవుతుండటంతో మానవ వనరుల అభివృద్ధి అటకెక్కుతోంది. వీసీల నియామకాల్లో ఉన్నత విలువలు పాటించి ప్రభుత్వాలు చిత్తశుద్ధిని నిలుపుకుంటేనే దేశ భవితవ్యానికి బంగారు బాటలు పడతాయి.

vice chancellor recruitments to universities became controversial now a days which was a conventional thing before
వన్నెతరిగిన గురుపీఠాలు-వీసీల నియామకాల్లో పెడధోరణులు
author img

By

Published : Mar 13, 2021, 7:28 AM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి(వీసీ)గా ఆచార్య ఎ.ఎల్‌.నారాయణ ఉన్న సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1962లో విశాఖపట్నం సందర్శించారు. ముఖ్యమంత్రిని కలవడానికి వీసీ విమానాశ్రయానికి వెళ్ళారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి తనవైపు రావడం గమనించిన ముఖ్యమంత్రి వెంటనే తన కుర్చీలో నుంచి లేచి ఆయన దగ్గరకు వెళ్ళి మధ్యలోనే ఆపారు. 'మీరు ఇలా నన్ను కలవడానికి రావడం దౌత్య మర్యాదల (ప్రొటోకాల్‌) ప్రకారం విరుద్ధం. మిమ్మల్ని కలవడానికి మేమే విశ్వవిద్యాలయ కులపతి (గవర్నర్‌) అనుమతి తీసుకోవాలి' అన్నారు.
మరో సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పుడు- ప్రముఖ రచయిత, ఆలోచనాపరుడైన ఆచార్య కె.ఆర్‌.శ్రీనివాస అయ్యంగార్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి బాధ్యతల స్వీకరణకు ఆహ్వానించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఉపకులపతి నియామకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉండాలని- అప్పుడే ఉన్నత విద్యకు తగిన న్యాయం చేకూరుతుందని వ్యాఖ్యానించారు.

ఉపకులపతి పదవి ఎంత ఉన్నతమైందో, గౌరవప్రదమైందో ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి. మేధావులు, విద్యావేత్తలకు ఉపకులపతి పదవులు కట్టబెట్టడంద్వారా- విద్యార్థుల సామర్థ్యాన్నే కాకుండా, సమాజంలో మానవీయ విలువలనూ పెంచవచ్చుననేది నిర్వివాదాంశం.

రాజకీయాలకు అతీతంగా..

కొన్ని దశాబ్దాల క్రితం విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల్లో ప్రభుత్వాలు ఎన్నో విలువలను అనుసరించేవి. అధికారంలో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా విద్యావేత్తలను ఆదరించేవారు. రాజనీతిజ్ఞతతో వ్యవహరించేవారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన విద్యావేత్తలనే ఉపకులపతులుగా నియమించేవారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉపకులపతి హోదాలో అడుగు పెట్టినవారు సైతం తమ సొంత ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి- పదవిని విద్యాప్రమాణాల పెంపుదలకే వినియోగించేవారు. తమ హయాములో విశ్వవిద్యాలయ ఘనతను, ప్రతిష్ఠను మరింత పెంచే దిశగా కృషి చేసేవారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉప కులపతుల నియామకాల్లో పలు పెడధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియమాకాలు రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సుల మీదే ఆధారపడి ఉంటున్నాయి. కుల, మత సమీకరణలూ సర్వసాధారణమవుతున్నాయి. ఈ ధోరణులు ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినవి కాదు. దేశవ్యాప్తంగా ఉపకులపతుల నియామకాలు పలురకాల సమీకరణలతో కూడుకొని ఉంటున్నాయి. ఇది ముమ్మాటికీ జాతీయస్థాయి సమస్య.

అడ్డదారిలో వీసీలుగా..

ఉపకులపతులుగా నియమితులైన తరవాత కొందరు విశ్వవిద్యాలయాల ప్రగతిని అభివృద్ధిని విస్మరిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే దిశగా ఆలోచనలు, కార్యక్రమాలు చేపట్టడం లేదు. మరికొందరు దౌత్య మర్యాదలను గాలికి వదిలేసి, తమ స్థాయిని దిగజార్చుకొని- రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. సొంత ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిచ్చే సంస్కృతి పెరిగింది. అలాంటివారి సారథ్యంలో విశ్వవిద్యాలయాల పరువు ప్రతిష్ఠలు ఏ విధంగా మంట కలుస్తాయో సులభంగానే ఊహించవచ్చు. ప్రతిభాపాటవాలు లేకపోయినా అడ్డదారిలో వీసీ పదవులను పొందేవారివల్ల విద్యార్థులకు తప్పుడు సంకేతాలు అందే ప్రమాదం ఉందని మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే విద్యావ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందనేది చేదువాస్తవం.

విస్తృత ప్రయోజనాలకు పెద్దపీట..
ఆధునిక శాస్త్ర-సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో ప్రస్తుత భావి అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇందుకోసం ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన విధానాలను గణనీయంగా మార్చాల్సి ఉంది. పాఠ్యాంశాల తయారీ, బోధన, పరిశోధనల్లో గుణాత్మక మార్పులు చేసి- విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచాలి. సమకాలీన పరిశోధనలకు దీటుగా విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించాలి. విశ్వవిద్యాలయాల్లో సుపరిపాలనకు ప్రోదిచేయాలి. ఈ బాధ్యతలన్నీ ఉపకులపతులపైనే అధికంగా ఆధారపడి ఉంటాయి. విశ్వవిద్యాలయ నిర్వహణకు కావలసిన నిధులు సమకూర్చడానికి నిరంతరం వివిధ కోణాల్లో కృషి చేయవలసిన బాధ్యత సైతం వారిమీద ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని సమాజ విస్తృత శ్రేయస్సును, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఖ్యాతి గడించిన మేధావులు, విద్యావేత్తలను విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా నియమించాలి. అలాగైతేనే- సమాజంలో విలువలు పెరిగి, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి బంగారు బాటలు పడతాయి!

- ఆచార్య నందిపాటి సుబ్బారావు
ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు

ఇవీ చదవండి: మాతృభాషలో బోధనతోనే నేర్పరితనం

జన్యు బిల్లు.. వ్యక్తి స్వేచ్ఛకు చిల్లు!

మానవ హక్కులపై దాడి- నిరసనలపై ఉక్కు పాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.