ETV Bharat / opinion

ట్రంప్- ట్విట్టర్​ వార్​లో గెలిచింది ఎవరు? - trump twitter war

ఎన్నికల సమరంలో ట్రంప్‌.. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తోపాటు సామాజిక మాధ్యమాల నుంచీ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల విశ్వసనీయత, వాటి విధాన నిర్ణయాలపై ట్రంప్‌ ఏడాది నుంచి గుర్రుగా ఉన్నారు. ట్విట్టర్‌పై ఆయన పలుమార్లు మండిపడ్డారు. ట్విట్టర్‌ కూడా దీనికి దీటుగానే స్పందించింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో సమాధానమివ్వడం నిత్యం వార్తల్లో నిలిచింది.

trump social media
ట్రంప్- ట్విట్టర్​ వార్
author img

By

Published : Nov 10, 2020, 7:53 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్‌ పాలన ముగిసింది. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు. హోరాహోరీ ఎన్నికల సమరంలో ట్రంప్‌- డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తోపాటు సామాజిక మాధ్యమాల నుంచీ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల విశ్వసనీయత, వాటి విధాన నిర్ణయాలపై ట్రంప్‌ ఏడాది నుంచి గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా మైక్రోబ్లాగింగ్‌ సర్వీస్‌ ట్విటర్‌పై ఆయన పలుమార్లు మండిపడ్డారు. ట్విట్టర్‌ కూడా దీనికి దీటుగానే స్పందించింది.

నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో సమాధానమివ్వడం నిత్యం వార్తల్లో నిలిచింది. ఆఖరికి ఎన్నికల ఫలితాల వేళా ట్విటర్‌ ట్రంప్‌ను ఓ పట్టాన వదల్లేదు. 'మనమే గెలవబోతున్నాం... అయితే వారు (డెమొక్రాట్లు) దాన్ని దోచుకోబోతున్నారు' అని ట్రంప్‌ ఓట్ల లెక్కింపు మొదలైన రోజున రిపబ్లికన్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌ను వెంటనే కొట్టిపారేసింది. ట్రంప్‌, ట్విట్టర్‌ పోరులో గెలిచింది ఎవరనే విషయం పక్కనపెడితే ఎన్నికల్లో పెరుగుతున్న సామాజిక మాధ్యమాల ప్రభావానికి ఇదో ప్రబలమైన ఉదాహరణగా నిలిచింది.

'ఫ్యాక్ట్‌ చెక్‌'తో ఉక్కిరిబిక్కిరి

అవాస్తవ సమాచార (ఫేక్‌ న్యూస్‌) వ్యాప్తిని అడ్డుకోవడానికి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమ సంస్థలన్నీ ప్రత్యేకమైన విధానాలను రూపొందించుకున్నాయి. అందులో భాగంగా ట్విట్టర్‌ అవాస్తవ సమాచారంతో కూడిన ట్వీట్లకు 'ఫ్యాక్ట్‌ చెక్‌' లోగో తగిలిస్తుంది. అంటే 'అందులో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధరించుకోండి' అని చెప్పడం. ఈ లోగోతో కూడిన ట్వీట్లను రీట్వీట్‌ చేయడం చాలావరకూ తగ్గుతుంది. తన వాగ్ధాటినే నమ్ముకుని రెండోసారి అధ్యక్ష ఎన్నికల సమరాంగణంలోకి దిగిన ట్రంప్‌ను ట్విట్టర్‌ ఇదే అస్త్రంతో కట్టిపడేసింది.

మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ కావాల్సిందేనంటూ ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సర్వేలో 66శాతం నెటిజన్లు కోరారు. ఆ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించిన ట్రంప్‌ మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్ల వల్ల మోసం జరిగే అవకాశం ఉందంటూ వెంటనే ట్వీట్‌ చేశారు. ట్విటర్‌ దానికి ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ ట్యాగ్‌ వేసింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్‌ తలదూరుస్తోందంటూ ట్రంప్‌ ఇంతెత్తున లేచారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్‌కు గట్టి సమాధానం చెప్పిందీ సామాజిక మాధ్యమ సంస్థ.

15 సందేశాలకు..

ఎన్నికల వేళ మూడు రోజుల్లో ట్రంప్‌ 44 ట్వీట్లు, రీట్వీట్లు చేస్తే- 15 సందేశాలకు ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ లోగో పెట్టడం గమనార్హం. ఓట్ల లెక్కింపు పూర్తయి బైడెన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించాక సైతం ట్రంప్‌- మొత్తం ఎన్నికల ప్రక్రియనే తప్పుపడుతూ వరసగా ట్వీట్లు చేశారు. ఈవీఎమ్‌లు అవినీతిమయమయ్యాయని, ఈ ఎన్నికలు చోరీకి గురయ్యాయని ఆయన ఆరోపణలు కొనసాగించారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఈ ట్వీట్లన్నీ వివాదాస్పదంగా ఉన్నాయంటూ ట్విట్టర్‌ వాటిని ట్యాగ్‌ చేసింది.

ట్విట్టర్‌ చరిత్రలో ఓ దేశాధ్యక్షుడి స్థాయి వ్యక్తి సందేశాలకు ఇలా స్పందించడం ఇదే తొలిసారి. ట్రంప్‌ ప్రచారం, ప్రకటనల నిజానిజాల నిర్ధారణ విషయంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తొలుత అంత ఆసక్తి కనబరచలేదు. ఇకపై ఫేస్‌బుక్‌ కూడా ట్రంప్‌ పోస్ట్‌లను ట్విటర్‌ మాదిరిగానే ఆమూలాగ్రం పరిశీలించనుంది. ట్విట్టర్‌ మాత్రం అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ ట్రంప్‌ను గట్టి పట్టే పట్టింది. ఎన్నికల్లో తాము ఏం చేయాలో నిర్ణయించాలని ట్విట్టర్‌ భావిస్తోందని ట్రంప్‌తోపాటు రిపబ్లికన్‌ పార్టీ నాయకులు ఆ సంస్థపై విరుచుకుపడ్డారు. కానీ ట్విట్టర్‌ వెనక్కి తగ్గలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగానైతే విజయం తమదేనంటూ ట్రంప్‌ చేసిన ట్వీట్లకు- ఆ సమాచారం సరిగ్గాలేదని, సరిచూసుకోండని ట్విట్టర్‌ వినియోగదారులను అప్రమత్తం చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడినే నేరుగా ఢీకొట్టినట్లయింది.

ఆ 'గౌరవం' కోల్పోయినట్లే!

ఎవరైనా తప్పుడు సమాచారాన్ని ట్వీట్‌ చేస్తే ట్విట్టరే దాన్ని తొలగిస్తుంది. అయితే వార్తల్లో నిలిచే దేశాధ్యక్ష స్థాయి వ్యక్తులకు ఈ నిబంధన వర్తించదు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పరాజయం పాలైతే వార్తల్లో నిలిచే వ్యక్తిగా ఆయనకు ఉన్న సౌలభ్యాన్ని తొలగిస్తామని ట్విట్టర్‌ అధికారి ఒకరు ముందే ప్రకటించారు. జనవరిలోనే ఇది జరిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే ట్రంప్‌ కూడా సాధారణ ట్విట్టర్‌ వినియోగదారుల మాదిరిగానే ఆ సంస్థ నిబంధనలకు లోబడి ట్వీట్లు చేయాల్సి ఉంటుంది. కాదని ఇప్పటిమాదిరే ఆరోపణలు కొనసాగిస్తే ట్విట్టర్‌ ఆయన ఖాతాను తాత్కాలికంగా తొలగించవచ్చు కూడా.

ఎన్నికల ఫలితాలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను సస్పెండ్‌ చేయాలంటూ ఇప్పటికే డెమొక్రటిక్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ట్రంప్‌ ఏ మాత్రం దూకుడుగా ముందుకెళ్లినా ఆయన ట్విట్టర్‌ ఖాతాకు తెరపడినట్లే. అవాస్తవాలను ప్రచారం చేయడం, హింసను ప్రేరేపించే పోస్టులు, కామెంట్లు ఏవైనా చేస్తే ట్రంప్‌ ఖాతాను మూసేయడానికి ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ సహా సామాజిక మాధ్యమాలన్నీ దాదాపు సిద్ధమైపోయినట్లే. రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించాలన్న కలను నెరవేర్చుకోవడానికి ఈ ఎన్నికల తరవాతా క్రియాశీలకంగా ఉండాలని బలంగా వాంఛిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఇది అగ్నిపరీక్షే.

(రచయిత - శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.