ETV Bharat / opinion

లాభసాటి సేద్యం- ఎలా సాధ్యం? - రైతులకు గిట్టుబాటు ధర దక్కడం కొత్త చట్టాలతో సాధ్యమేనా

రైతుసంఘాలతో పాటు కొన్ని రాష్ట్రాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కేంద్రం వ్యవసాయానికి సంబంధించి రెండు బిల్లులను పార్లమెంటులో అమోదింపజేసుకుంది. రైతులకు మద్దతు ధర ఇప్పించే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. అందుకు భరోసా మాత్రం ఇవ్వడం లేదు. కొత్త చట్టంలో ఉన్న లోపాలతో మద్దతు ధరకు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Flaws in new agricultural law
కొత్త వ్వయసాయ బిల్లులతో రైతులకు లాభమా నష్టమా
author img

By

Published : Sep 21, 2020, 8:50 AM IST

వచ్చే నెల ఒకటి నుంచి దేశంలో పంటల కొనుగోలుకు కొత్త మార్కెటింగ్‌ ఏడాది ప్రారంభం కాబోతోంది. ఏటా అక్టోబరు నుంచి మరుసటి సెప్టెంబరు దాకా 'మార్కెటింగ్‌ ఏడాది'గా దేశంలో ప్రభుత్వం, వ్యాపారులు పరిగణించడం ఆనవాయితీ. పంటల కొనుగోలుకు కీలక వేదికలైన ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లకు పాతరేస్తూ- కొత్త చట్టాలు తెచ్చేందుకు పార్లమెంటులో బిల్లులను కేంద్రం తాజాగా ఆమోదించింది. రైతుసంఘాలతో పాటు కొన్ని రాష్ట్రాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కేంద్రం పట్టించుకోలేదు. రైతుల ఆదాయం పెంచాలన్న సద్దుదేశమే తమదని ప్రకటించింది. వీటివల్ల మద్దతు ధర వస్తుందనే పూచీకత్తు చట్టాల్లో లేకపోవడం ప్రధాన లోపం. పంటల క్రయవిక్రయాలకు సంబంధించిన చట్టాలు తెచ్చినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రగతి పేరిట తిరోగమనం

వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా, అధికారిక నివేదికలు భిన్నంగా ఉంటున్నాయి. ఉదాహరణకు గత అయిదేళ్లలో తొలిసారి 2019-20లో వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారోత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. 2018-19లో రూ.1.30 లక్షల కోట్ల ఎగుమతులైతే నిరుడు అంతకన్నా రూ.15 వేల కోట్లు తగ్గాయి. ఏకంగా 49 లక్షల టన్నుల మేర తగ్గుదల నమోదైంది. బియ్యం ఎగుమతులు 25 లక్షల టన్నులు తగ్గాయని ‘వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల మండలి (అపెడా)’ నివేదిక ఎండగట్టింది.

దిగుబడులు ఇనుమడించాయన్న ప్రచారంలో నిజముంటే ఎందుకు ఎగుమతులు పెంచలేకపోతున్నాం, చిల్లర మార్కెట్‌లో ధరలెందుకు తగ్గించలేకపోతున్నామనే ప్రశ్నలకు సమాధానం లేదు. మొత్తం 130 కోట్లమంది ఆకలి తీర్చేంతగా పంటలు పండటం లేదు. ప్రజలకు వార్షిక తలసరి బియ్యం లభ్యత 1961లో 73.4 కిలోలుంటే 2019లో 69.1 కిలోలకు తగ్గిందని కేంద్ర వ్యవసాయశాఖ నివేదికే చెబుతోంది. లభ్యత లేనందువల్లే కిలో బియ్యం ధర రూ.50 దాటింది. పోషకాహారం తినమని పాలకులు చెబుతుంటారు. పప్పులు మాత్రం లభ్యం కావు. 1956లో పప్పుధాన్యాల సగటు వార్షిక లభ్యత 25.7 కిలోలు. 2019లో అది 17.5 కిలోలకు పడిపోయింది. కోటిన్నర టన్నుల వంటనూనెల దిగుమతికి ఏటా రూ.70 వేలకోట్ల విదేశ మారక ద్రవ్యం ధారపోస్తున్నాం.

నిల్వలపై ఆంక్షలు ఎత్తివేస్తూ..

ప్రభుత్వాల నియంత్రణ ఉన్న మార్కెట్లలోనే ఆహారోత్పత్తుల లభ్యత దిగజారుతుంటే, నిల్వలపై ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్రం కొత్త చట్టాన్ని తెచ్చింది. మార్కెట్లతో పనిలేదంటూ రైతులు ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చంటూ మరో చట్టం తెచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తి తన ఇంటివద్దనే మార్కెట్‌ పెట్టుకుని, పంటలు కొని నిల్వ చేసుకోవచ్ఛు పొలాలకెళ్లి పంటలు కొనేయవచ్ఛు ప్రైవేటుసంస్థలు, వ్యక్తులు రైతులతో ఒప్పందాలు చేసుకుని పంటలు పండించడానికి మరో చట్టాన్ని కాంట్రాక్టు వ్యవసాయం పేరిట తెచ్చింది. ఈ మూడు చట్టాలతో దేశంలో పంటల క్రయవిక్రయ స్వేచ్ఛనిస్తున్నట్లు తెలిపింది. కానీ, రైతులకు మద్దతు ధర అంశంపై స్పష్టత కరవైంది.

రైతులు ఏళ్ల తరబడి అడుగుతోంది గిట్టుబాటు ధరనే. కేంద్రం ఇప్పుడు తెచ్చిన స్వేచ్ఛావాణిజ్య చట్టం బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ఎప్పటినుంచో అమలులో ఉంది. మార్కెటింగ్‌ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తూ వ్యవసాయ మార్కెట్లను పక్కాగా నిర్వహిస్తున్నాయి. అక్కడకు రైతులు తెచ్చే పంటలను వ్యాపారులు కొనేందుకు సదుపాయాలు కల్పించాయి. ఇందుకు పంట విలువలో ఒక శాతం సొమ్మును ‘మార్కెట్‌ రుసుం’(సెస్‌) కింద వ్యాపారుల నుంచి సిబ్బంది వసూలు చేస్తున్నారు. కొత్త చట్టాలతో వ్యవసాయ మార్కెట్లకు ఇక గుర్తింపు ఉండదు. వ్యాపారులు నేరుగా పొలాలకు వెళ్ళి పంటలను కొంటే ఎంత ధర ఇస్తున్నారనేది ఎవరికి చెబుతారు? మార్కెట్లలో కొన్నప్పుడే వ్యాపారులు నానారకాలుగా రైతులను మోసగిస్తుంటారు. రైతులు ధర్నాలకు దిగుతుంటారు. ఇకపై వ్యాపారి మోసం చేస్తే చెప్పుకొనే దిక్కు ఉండదు. ఈ పద్ధతి వల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్లు ఏటా సగటున రూ.200 కోట్ల చొప్పున ఆదాయం కోల్పోతాయని అంచనా.

మార్కెటింగ్‌ వ్యవస్థ క్రమేణా కుప్పకూలడం ఖాయం. అది కనుమరుగయ్యాక ప్రైవేటు మార్కెట్లు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకుంటాయా? అదే నిజమైతే రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టం లేని బిహార్‌లో పంటలకు వ్యాపారులు గిట్టుబాటు ధరలు ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడా మద్దతుధర రావడం లేదని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో బిహార్‌లో జరుగుతున్నదే దేశమంతా పునరావృతమైతే ఎలాగని రైతుసంఘాలు మండిపడటంలో ఔచిత్యముంది.

no Guarantee to farmers for support price
ఆహార ధాన్యాల లభ్యత వివరాలు

మౌలిక సదుపాయాలతోనే గిట్టుబాటు

పంట దిగుబడులు పెంచడానికి, రైతులకు పెట్టుబడులు సమకూర్చడానికి- వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమచేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నిజానికి రైతులు అడుగుతున్న గిట్టుబాటు ధర ఇచ్చి వారి పంటను కొని ఆ సొమ్మును వారి బ్యాంకు ఖాతాలో భద్రంగా వేస్తే ఎంతో సంతోషిస్తారు. దేశంలో 24 రకాల పంటలకు కేంద్రం ఏటా కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది.

కానీ, పక్కా వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థలున్నా మద్దతు ధర ఇప్పించే పూచీకత్తు లేకపోవడం పెద్దలోపం. కొత్త చట్టాలతో దేశంలో ఎక్కడైనా రైతులు పంట అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అధిక సంఖ్యలో గల చిన్న కమతాల రైతులకు దేశంలో ఎక్కడికైనా పంటను తరలించి అమ్ముకునే సత్తా ఉంటుందా, రవాణా వ్యయం ఎంతవుతుంది, వెళ్లాక సరైన ధర ఇవ్వకపోతే... రవాణా ఖర్చులైనా రాకపోతే ఏం చేయాలి? కిలో టొమాటోకు ఒక్క రూపాయైనా రాక, రోడ్లపై పారబోసిన దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో చూశాం. పంటలకు గిట్టుబాటు ధర రావాలంటే వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, శుద్ధిప్లాంటు, నిల్వలకు శీతలగిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాలు చాలా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల్లో గిట్టుబాటు ధర దక్కడం వెనక రహస్యమిదే.

మద్దతు ధర బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి..

ఒక రాష్ట్రంలో పండిన పంటలో 40శాతం మద్దతు ధరకు కొనడానికి రెండేళ్ల క్రితం వరకు కేంద్రం నిధులిచ్చేది. ఈ పరిమితిని నిరుడు 25శాతానికి తగ్గించింది. కొత్త చట్టాలతో పంటలను కొనే బాధ్యతంతా ప్రైవేటు సంస్థలదే అన్నట్లు స్వేచ్ఛావాణిజ్యానికి కేంద్రం అవకాశమిచ్చింది. లాభాల కోసం వెంపర్లాడే సంస్థలు చిన్న కమతాల రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వాలు కొంత పంటను నేరుగా రైతుల నుంచి కొనాలి. అప్పుడే పోటీ ఏర్పడి వ్యాపారులు ధర పెంచుతారు.

  • రచయిత- మంగమూరి శ్రీనివాస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.