ETV Bharat / opinion

అవినీతి పునాది.. అక్రమాల కాంక్రీట్‌తో ఆకాశ హర్మ్యాలు! - సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మించిన సముదాయం కూల్చి వేత కేసు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నొయిడాలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మించిన ఆ సముదాయంలో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. ఆ మొత్తం నలభై అంతస్తుల్నీ కూల్చేయాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టు సుమారు ఏడేళ్లక్రితమే తీర్పిచ్చింది. దానిపై నిర్మాణ సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఇన్నేళ్ల తరవాత ఇప్పుడు సుప్రీం ధర్మాసనం సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. నిబంధనల్ని తుంగలో తొక్కి, తమను ఎవరు మాత్రం ఏం చేయగలరన్న దుర్భ్రమతో అడ్డగోలుగా కట్టిన జంట సౌధాలను నిపుణుల పర్యవేక్షణలో సొంతఖర్చులతో నిర్మాణ సంస్థే మూడు నెలల్లోగా కూల్చాలన్నది ధర్మాసనం తాజా తీర్పు సారాంశం.

twin towers Supreme Court order in Noida case
సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ కేసు
author img

By

Published : Sep 5, 2021, 5:50 AM IST

తలెత్తి చూస్తే, ఆ జంట సౌధాల చిట్టచివరి అంతస్తులు మామూలు కంటికి స్పష్టంగా గోచరించవు. ఎందుకంటే, వాటిలోని ఒక్కోదానిలోనూ ఉన్నవి నలభై అంతస్తులు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నొయిడాలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మించిన ఆ సముదాయంలో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. ఆ మొత్తం నలభై అంతస్తుల్నీ కూల్చేయాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టు సుమారు ఏడేళ్లక్రితమే తీర్పిచ్చింది. దానిపై నిర్మాణ సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఇన్నేళ్ల తరవాత ఇప్పుడు సుప్రీం ధర్మాసనం సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. నిబంధనల్ని తుంగలో తొక్కి, తమను ఎవరు మాత్రం ఏం చేయగలరన్న దుర్భ్రమతో అడ్డగోలుగా కట్టిన జంట సౌధాలను నిపుణుల పర్యవేక్షణలో సొంతఖర్చులతో నిర్మాణ సంస్థే మూడు నెలల్లోగా కూల్చాలన్నది ధర్మాసనం తాజా తీర్పు సారాంశం. విచ్చలవిడిగా జోరెత్తుతున్న అక్రమ నిర్మాణాలకు బాధ్యులైనవాళ్ల భరతం పట్టడంతోపాటు- ఇళ్ల కొనుగోలుదారులు నష్టపోకుండా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతనూ న్యాయపాలిక ప్రస్తావించడం సముచితంగా ఉంది. రాత్రికి రాత్రే అంతటి భారీ నిర్మాణాలు పుట్టుకు రావు. నెలల తరబడి నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నా కళ్లు మూసుకుని అవినీతి మత్తులో జోగిన అధికార యంత్రాంగం మాటేమిటి?

‘ఎమెరాల్డ్‌ కోర్ట్‌’ పేరిట సూపర్‌టెక్‌ సంస్థ ఆ ప్రాంగణంలో అంతకుముందే కొన్ని బహుళ అంతస్తుల సముదాయాల్ని నిర్మించింది. వారందరికీ రంగురంగుల ఆకర్షణీయ కరపత్రాల్లో ఖాళీగా చూపించిన బహిరంగ ఆవరణ ప్రాంతంలో ఆ జంట సౌధాలు మొలుచుకురావడంతో భగ్గుమన్న నివాసదారుల సంక్షేమ సంఘం సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరతీసింది. అనుమతులు ప్రసాదించేవారు తమ జేబులో మనుషులేనన్న దిలాసాతో నిర్మాణ సంస్థ యథేచ్ఛగా నియమోల్లంఘనలకు తెగబడింది. రెండు సౌధాల మధ్య కనీస దూరం పాటించడం లేదన్న అగ్నిమాపక శాఖ అధికారి లేఖను నొయిడా అధికారులు పట్టించుకోనే లేదు. తొలుత బులిపించే కబుర్లు చెప్పి ఆకట్టుకుని, ఆపై ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నిర్మాణదారులకు ఇప్పుడీ తీర్పు మింగుడు పడనిది. నలభై అంతస్తుల్నీ కూల్చేయాలి. సంక్షేమ సంఘానికి రెండు కోట్ల రూపాయలు చెల్లించాలి. ఫ్లాట్ల కోసం ముందస్తు చెలింపులు చేసిన తేదీనుంచి కొనుగోలుదారులకు మొత్తం సొమ్మును 12శాతం వడ్డీతో కక్కాలి. దేశంలో ఎక్కడ ఏమూల అక్రమ నిర్మాణాల బాగోతాలు వెలుగుచూసినా- ఇలా కొరడా ఝళిపించే పటిష్ఠ చర్యలకు ధర్మాసనం విశిష్ట తీర్పు అంటుకట్టాలి.
జూన్‌ 2005 నాటి అసలు ప్లాన్‌ ప్రకారం అక్కడ 14 సౌధాలు, 550 ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంది. 2006 డిసెంబరు నాటికి మార్పులు చేసిన ప్రణాళికలో ఫ్లాట్ల సంఖ్యను 689కి పెంచారు. 2009 నవంబరుకల్లా చెరో 24 అంతస్తులతో జంట సౌధాల యోచనను జతపరచారు. 2012 మార్చ్‌ నెలనాటికి 40 అంతస్తులకు పెంచేశారు. ఇదంతా ఒక్క నిర్మాణ సంస్థ తలచుకుంటేనే అయ్యేది కాదు. రాజకీయ నేతాగణం ఆశీస్సులతో అధికార యంత్రాంగం చేతులమీదుగా చకచకా సాగిపోయిన ఉమ్మడి నేరమిది! సుప్రీంకోర్టు సరికొత్త తీర్పు వెల్లడైన దరిమిలా- యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సూపర్‌టెక్‌ కేసుపై సమగ్ర విచారణకు, అవసరమైన చర్యలకు ఆదేశాలు జారీచేశారు. 2004 సంవత్సరంలో ప్రాజెక్ట్‌ మొదలైనప్పటినుంచి 2017లో తమ ప్రభుత్వం ఏర్పడేవరకు నిర్మాణ సంస్థతో అంటకాగి నిబంధనల ఉల్లంఘనలకు శక్తివంచన లేకుండా తోడ్పాటు అందించిన వాళ్లందరినీ బోనెక్కిస్తామని యోగి చెబుతున్నారు. 2003-2007 మధ్య అక్కడ చక్రం తిప్పింది ములాయంసింగ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాది సర్కారు, ఆపై 2012వరకు మాయావతి, 2017 మార్చ్‌ వరకు అఖిలేశ్‌ ఏలుబడి సాగించారు. ఇప్పుడు యోగి లాగిన తీగతో ఎక్కడెక్కడ ఏమేమి డొంకలు కదులుతాయో చూడాలి!

ప్రాంతాలవారీగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాక జనసంఖ్య ప్రాతిపదికన తాగునీరు, రహదారులు, మురుగునీటి పారుదల, విద్యుత్తు తదితర సదుపాయాలు ఏర్పరచాలి. స్థానిక వనరులను బట్టి ఎక్కడ ఎందరి నివాసాలకు అనుమతులు ఇవ్వాలో నిర్ణయించి జాగ్రత్తగా అమలుపరచాలి. ఆ మౌలిక ప్రణాళికకు తూట్లు పొడుస్తూ ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే దౌర్భాగ్యం తరతమ భేదాలతో దేశమంతటా దాపురించింది. దేశ రాజధానిలో ఎడాపెడా అక్రమ నిర్మాణాల ఉద్ధృతిని 1999లోనే వీకే మల్హోత్రా కమిటీ నివేదిక కళ్లకు కట్టింది. ఒకటిన్నర దశాబ్దాల క్రితమే మహారాష్ట్ర ఠానే జిల్లాలోని ఉల్హాస్‌ నగర్‌ పట్టణంలో 42వేల భవంతులకు గాను 32వేలు అక్రమ నిర్మాణాలేనన్న లెక్కలు నిర్ఘాంతపరచాయి. ఇక్కడ, అక్కడ అనేముంది- ఇండియాలో నగరీకరణ ప్రణాళికలకు అవినీతి, అసమర్థతలు గొడ్డలిపెట్టుగా మారాయన్న విఖ్యాత ఆర్కిటెక్ట్‌ బెన్నిజర్‌ సూటి వ్యాఖ్య అక్షరసత్యం. ప్రణాళికాబద్ధ నగరీకరణ కాగితాల్లోనే నీరోడుతోంది. పట్టపగ్గాలు లేని అక్రమ నిర్మాణాల పుణ్యమా అని చెరువులు, నాలాలు పూడుకుపోయి వర్షాకాలంలో నగరాలు తరచూ వరద ముంపు పాలబడి ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్నాయి. అవినీతి పునాదిపై వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు పెను సామాజిక సంక్షోభానికి దారి తీస్తుండటం- సమకాలీన చరిత్ర. ప్రార్థనా మందిరాల పేరిట అక్రమ నిర్మాణాలు సాగించే ధోరణుల్ని తెలంగాణ హైకోర్టు నిరుడు తూర్పారపట్టింది. అడ్డగోలుగా కడుతున్న అంతస్తులు అధికార సిబ్బంది కంటపడవా అని రెండేళ్లనాడే నిగ్గదీసింది. పట్టణ ప్రణాళిక విభాగంలోని తప్పుడు అధికారులపై కఠిన చర్యలు తీసుకోనంత కాలం అక్రమ నిర్మాణాలది అంతులేని కథేనని దిల్లీ హైకోర్టు ఏనాడో చెప్పింది. ఇకమీదటా అలసత్వం ఆత్మహత్యాసదృశం. తినమరిగిన అవినీతి మోతుబరులకు కొలువుల నుంచి ఉద్వాసన పలికి, క్రిమినల్‌ కేసులు పెట్టి శిక్షిస్తేనే గాని- అక్రమార్కుల జాడ్యం కుదరదు. ఏమంటారు?

- బాలు

ఇదీ చూడండి: Terror attacks: రాజధానిలో ఉగ్ర దాడులకు కుట్ర..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.