ETV Bharat / opinion

భారత్‌ గ'ఘన' ప్రస్థానం- అంతరిక్ష ఉత్సవాల్లో ప్రపంచ దేశాలు - ఇస్రో తాజా వార్తలు

అంతరిక్ష పరిజ్ఞానాన్ని సామాన్యుల చెంతకు చేర్చాలని ఇస్రో ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏటా అక్టోబరులో దేశవ్యాప్తంగా వారం రోజులపాటు అంతరిక్ష వారోత్సవాలు జరుపుతోంది. ఈ దఫా కరోనా సవాళ్లను అధిగమించి వర్చువల్​గా ఉత్సవాలు నిర్వహిస్తోంది.

The Indian Space Research Organization
భారత్‌ గ'ఘన' ప్రస్థానం- అంతరిక్ష వారోత్సవాల్లో ప్రపంచ దేశాలు
author img

By

Published : Oct 9, 2020, 7:03 AM IST

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రపంచ దేశాలకు పోటీగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పటికే తక్కువ ఖర్చుతో మంగళయాన్‌ ప్రయోగం చేపట్టి విజయవంతం చేసింది. అలాగే ఏ దేశానికీ సాధ్యం కాకపోయినా- చంద్రుడి దక్షిణ ధ్రువ కక్ష్యలోకి రోవర్‌ను పంపేందుకు ప్రయత్నాలు చేసి 98 శాతం విజయవంతమైంది. దాంతోపాటు ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది!

ఇదీ జర్నీ...

1969 ఆగస్టు 15న బెంగళూరు కేంద్రంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆవిర్భవించింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ల చొరవతో ఇస్రోకు రూపకల్పన జరిగింది. అనంతర కాలంలో ప్రొఫెసర్‌ సతీశ్‌ ధావన్‌; క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వంటి మేధావుల పాత్ర ఎంతో ఉంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పాటై 50 ఏళ్లు దాటింది. అంతరిక్ష పరిజ్ఞానాన్ని సామాన్యుల చెంతకు చేర్చాలని ఇస్రో ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏటా అక్ట్టోబరులో దేశవ్యాప్తంగా వారం రోజులపాటు అంతరిక్ష వారోత్సవాలు జరుపుతోంది. ఈ దఫా కరోనా సవాళ్లను అధిగమించి ఆన్‌లైన్‌ మాధ్యమాల సాయంతోనే.. వెబినార్ల ద్వారా అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తోంది.
భారత్‌, రష్యా, చైనా, అమెరికా, జపాన్‌ తదితర దేశాలు అంతరిక్ష ప్రయోగాల్లో పోటీ పడుతున్నాయి. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో- అంతరిక్ష విజ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఐక్యరాజ్య సమితి తలపెట్టింది. ఇందుకుగాను ప్రపంచ అంతరిక్ష వారోత్సవ సంరంభాన్ని ప్రారంభించింది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా అక్టోబరు 4 నుంచి పది వరకు వారం రోజులపాటు ఈ ఉత్సవాలను సుమారు 70దేశాల్లో జరుగుతున్నాయి. అక్టోబరులోనే ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు కారణం లేకపోలేదు. రష్యా(ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌) 1957 అక్టోబరు 4న స్పుత్నిక్‌-1 అనే మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది.

ఆ తరవాత పదేళ్లకు 1967 అక్టోబరు 10న అంతరిక్ష విజయాలను శాంతియుత మానవ ప్రయోజనాల కోసమే వినియోగించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.

ఈ రెండింటికి ఓ ప్రత్యేకత ఉండటం వల్ల ఆ తేదీల్లోనే ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించేలా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచ అంతరిక్ష వారోత్సవ సంస్థ 'ఉపగ్రహాల జీవితకాలం పొడిగింపు' అనే నినాదంతో ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంనుంచి 1980 జులైలో పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎస్‌ఎల్‌వీ-3 వాహకనౌక ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ కార్యక్రమానికి అబ్దుల్‌ కలాం సంచాలకులుగా వ్యవహరించారు. అబ్దుల్‌ కలాం 1970-1990 మధ్యకాలంలో ఎస్‌ఎల్‌వీ-3, పీఎస్‌ఎల్‌వీ లాంటి విజయవంతమైన ప్రాజెక్టులకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

ఇస్రో క్రయోజనిక్‌ ఇంజిన్లను రూపొందించి జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలను విజయవంతంగా నింగిలోకి పంపి సత్తా చాటుకొంది. తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అవలీలగా పీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. దాంతో వివిధ దేశాలు ఇస్రో ద్వారా ఉపగ్రహాలను పంపేందుకు క్యూ కడుతున్నాయి.

2022నాటికి అంతరిక్షంలోకి మనుషులను పంపడమే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది. ఆ మేరకు గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు రూ.10వేల కోట్ల బడ్జెట్‌ మంజూరయింది. బెంగళూరులో గగన్‌యాన్‌ ప్రాజెక్టు కార్యాలయాన్ని నిరుడు ప్రారంభించారు. చంద్రయాన్‌-3 ప్రయోగం ఈ ఏడాది చివరికి పూర్తికావాలి. కరోనా కారణంగా దాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేశారు.

తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద చిన్న సైజున్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగాలకు అనువుగా రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని త్వరగా పూర్తిచేసి- వచ్చే ఏడాది అక్కడినుంచి ప్రయోగాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాణిజ్యపరంగానూ 'ఇస్రో' ముందడుగు వేస్తోంది.

ఇప్పటివరకూ 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేస్తోంది. 2005-06లో రూ.414 కోట్లుగా ఉన్న రాబడి- 2007-08 నాటికి రూ.940 కోట్లకు చేరింది. ప్రస్తుతం అయిదువేల కోట్ల రూపాయలకుపైగా ఆదాయం సాధించాలన్న ప్రణాళికలకు 'ఇస్రో' రూపకల్పన చేసింది.

ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌ విలువ ఏటా రూ.250కోట్ల డాలర్లు (దాదాపు రూ.13,500 కోట్లు) నమోదవుతోంది. ఇందులో సింహభాగం దక్కించుకోవాలని 'ఇస్రో' కృషి చేస్తోంది. దీనికోసం అమెరికా, రష్యా, ఫ్రాన్సులతో పోటీ పడుతూ మరింత ముందుకు సాగుతోంది.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.