ETV Bharat / opinion

మేలిమి బోధనే భవితకు మదుపు

పాఠశాల విద్య పటిష్ఠీకరణే లక్ష్యమంటూ స్టార్స్​ పేరిట సరికొత్త ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో పాఠాలు చెబుతున్నవారిలో మూడోవంతు మంది నిర్ధారిత అర్హతలు కరవైనవారే. అటువంటప్పుడు ఏ కొన్ని రాష్ట్రాలకో పరిమితమయ్యే నూతన ప్రాజెక్టులవల్ల పాఠశాల విద్య తలరాత బాగుపడుతుందా? అత్యున్నత ఉపాధ్యాయ విద్య సమకూర్చేందుకు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విశిష్ట సంస్థ కొలువు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

teaching
మేలిమి బోధనే భవితకు మదుపు
author img

By

Published : Oct 16, 2020, 8:56 AM IST

నాణ్యమైన బోధనే భవితకు చుక్కానిగా సూత్రీకరిస్తూ పాఠశాల విద్య పటిష్ఠీకరణే లక్ష్యమంటూ ప్రపంచబ్యాంకు ఆర్థిక తోడ్పాటుతో 'స్టార్స్‌' పేరిట సరికొత్త ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి, పరిశోధనలకు గొప్ప ఊపునిచ్చేలా సైన్స్‌ ప్రాజెక్టులకు ఆసరాగా నిలుస్తుందంటూ రూ.250కోట్లతో గత సంవత్సరం ఫిబ్రవరిలో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ శ్రీకారం చుట్టిన 'స్టార్స్‌' పరిధి, ప్రయోజనం వేరు. ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యాన్ని విద్యావ్యవస్థకు మప్పి, బోర్డు పరీక్షలను మెరుగుపరచి, ఉపాధ్యాయులకు శిక్షణ విధివిధానాలను పరిపుష్టీకరించడం తాజా కసరత్తు మౌలిక ధ్యేయమని జావడేకర్‌ చెబుతున్నారు.

కొన్ని రాష్ట్రాలకే పరిమితం..

మొత్తం అంచనా వ్యయం రూ.5718కోట్లలో రూ.3700కోట్ల మేర ప్రపంచబ్యాంకు సాయం సమకూరనున్న ఈ ప్రాజెక్టును హిమాచల్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ, ఒడిశాలలో కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పట్టాలకు ఎక్కించనుంది. పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పే ఉద్దేశంతో గుజరాత్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, అసోంలలో ఇప్పటికే అమలుపరుస్తున్న అటువంటి పథకానికే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులు అందిస్తోంది. షగున్‌, దీక్ష వంటి ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ సాయంతో తోటి రాష్ట్రాల అనుభవాలనుంచి తక్కినవి లబ్ధి పొందగల వీలుందని కేంద్ర అమాత్యులు వెల్లడిస్తున్నా- జాతీయ స్థాయిలో పాఠశాల విద్య బలోపేతానికి ఇదా అనుసరణీయ మార్గం? దేశవ్యాప్తంగా బోధన విధులు నిర్వర్తిస్తున్నవారిలో పదకొండు లక్షలమందికి సరైన శిక్షణ కొరవడిందని లోగడ కేంద్రమంత్రి చెప్పిందే. బిహార్‌, పశ్చిమ్‌బంగ వంటిచోట్ల ప్రాథమిక, మాధ్యమిక తరగతులకు పాఠాలు చెబుతున్నవారిలో మూడోవంతు మంది నిర్ధారిత అర్హతలు కరవైనవారే. అటువంటప్పుడు ఏ కొన్ని రాష్ట్రాలకో పరిమితమయ్యే నూతన ప్రాజెక్టులవల్ల పాఠశాల విద్య తలరాత బాగుపడుతుందా?

ఎక్కడి గొంగడి అక్కడే..

కొవిడ్‌ మహా సంక్షోభం మూలాన ఈ ఏడాది విద్యాసంస్థలు మూతపడి సరైన బోధన అవకాశాలు మూసుకుపోయి అభ్యసన నష్టాలు, భావి ఆర్జన సామర్థ్యాలకు వాటిల్లిన విఘాతాల రూపేణా ఒక్క ఇండియాయే ఎకాయెకి రూ.30లక్షల కోట్లదాకా కోల్పోనుందని ప్రపంచ బ్యాంకు ఇటీవల లెక్కకట్టింది. తీవ్ర అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఒక్క సంవత్సరకాలంలోనే దేశం అంతగా కొల్లబోతే, ఇన్నేళ్లుగా నాణ్యమైన బోధన సిబ్బంది కొరవడి మరెన్ని రెట్ల భూరి నష్టం దాపురించిందో నిగ్గు తేల్చగలవారేరీ? దేశంలో ఉపాధ్యాయ విద్యావిధానం ఏ తీరుగా వికసించాలో కొఠారీ కమిషన్‌, ఛటోపాధ్యాయ కమిటీ, యశ్‌పాల్‌ సంఘం వంటివి విశదీకరించినా- దశాబ్దాల తరబడి ప్రభుత్వాల్లో దీటైన స్పందన కానరాకుండా పోయింది. పాఠశాలల్లో ఉత్తమ బోధన నిమిత్తం ఉపాధ్యాయులు శిక్షణ పొంది తీరాల్సిందేనంటూ విద్యాహక్కు చట్టాన్ని సరిదిద్దిన మూడేళ్ల తరవాతా ఎక్కడి గొంగడి అక్కడే!

స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అవసరం..

గత సంవత్సరం 'నిష్ఠ' పేరిట రెండంచెల శిక్షణ బృందాల దన్నుతో దేశవ్యాప్తంగా సుమారు 42 లక్షలమంది ఉపాధ్యాయులకు మెలకువలు మప్పే యత్నమూ చతికిలపడింది. ఈ దశలో పాక్షిక మరమ్మతులు కొరగావు. సమున్నత విద్యాప్రమాణాలకు నెలవులుగా వెలుగొందుతున్న విదేశాల అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చి యుద్ధప్రాతిపదికన సమగ్ర దిద్దుబాటు చర్యలకు కేంద్రం సంకల్పించాలి. అపార ప్రజ్ఞావంతుల్ని గుర్తించి బోధనరంగంలోకి ఆహ్వానించి నిరంతర శిక్షణ, ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్న దక్షిణకొరియా, ఫిన్లాండ్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ ప్రభృత దేశాలు సృజనశక్తుల ఆవిష్కరణలో ముందుంటున్నాయి. ఏ దేశంలోనైనా అత్యుత్తమ ఇంజినీర్లు, వైద్యులు, న్యాయవాదులు, ఇతరత్రా వృత్తి నిపుణుల్ని అవతరింపజేయగలిగేది మేలిమి ఉపాధ్యాయులు, అధ్యాపకులే. అత్యున్నత ఉపాధ్యాయ విద్య సమకూర్చేందుకు ఐఐటీలు, ఐఐఎమ్‌ల స్థాయిలో ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విశిష్ట సంస్థనొకదాన్ని దేశంలో కొలువు తీరిస్తేనేగాని- తక్కిన కంతల్నీ పూడ్చే బృహత్‌ యత్నం గాడిన పడదు!

ఇదీ చూడండి: 'స్టార్స్'​ పథకానికి కేంద్ర కేబినెట్​ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.