ETV Bharat / opinion

ఉన్నత ఆదర్శానికి సాంకేతిక దన్ను

నిరుపేదలైనా సరే.. ఎంతో కొంత భూమి కలిగి ఉంటే ఆ భరోసాయే వేరు. 1950ల్లోనే భూమి లేని వారి ఇబ్బందులను గుర్తించారు ఆచార్య వినేబాభావే అనే మహానుభావుడు. అతని ఆలోచనల్లోంచి పుట్టిందే భూదాన మహా ఉద్యమం. ఆయన పిలుపునందుకుని స్వచ్ఛందంగా భూమిని దానంగా ఇచ్చారు మరెందరో దయాహృదయులు. అటువంటి వారిలో ముందు వరసలో ఉంటారు వెదిరె రామచంద్రా రెడ్డి వంటి ఉన్నతులు. అయితే నేటి ప్రభుత్వాలు పేదలకు భూమిని పంచి ఇచ్చే క్రతువును సక్రమంగా కొనసాగిస్తున్నాయా అంటే టక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. భూదాన ఉద్యమానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చరిత్ర, ప్రస్తుత పరిస్థుతులపై ప్రత్యేక కథనం..

Bhoodan Movement
భూదాన ఉద్యమం
author img

By

Published : Apr 18, 2021, 8:31 AM IST

Updated : Apr 18, 2021, 11:22 AM IST

'మీ ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకుని నా భూమిని దానం చేస్తున్నాను. కానీ, సమస్య పరిష్కారానికి ఇది దోహద పడదనుకుంటాను. ప్రతి ఒక్కరూ హృదయ పరివర్తనం చెంది భూదానం చేయడం అసాధ్యం కదా!'- ఆచార్య వినేబాభావే ముందు బిహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ వ్యక్తి వెలిబుచ్చిన సందేహమిది. 'మీరు గతంలో కాంగ్రెస్‌ అనుయాయి. ఇప్పుడు సామ్యవాది. మరి ఇతరులు మారరని మీరెలా చెప్పగలరు?' అన్నది ఆచార్యుల సమాధానం! మానవ హృదయ పరివర్తనంపై అచంచల విశ్వాసంతోనే భూదాన యజ్ఞానికి బాపూజీ ప్రియశిష్యుడు నడుంకట్టారు. ఏడు దశాబ్దాల క్రితం ఇదే రోజు (1951 ఏప్రిల్‌ 18) హైదరాబాద్‌ సమీపంలోని పోచంపల్లి గ్రామంలో భూమి లేని పేదలకు పంచడానికి ఆచార్య వినోబాభావేకు వెదిరె రాంచంద్రారెడ్డి వంద ఎకరాలను దానం చేశారు. అలా ఓ చిన్న పల్లెలో పురుడు పోసుకున్న భూదాన ఉద్యమం ఆ తరవాత దేశవ్యాప్తమైంది. భూమి కోసం హింసాత్మక ఉద్యమాలు సాగుతున్న కాలంలో మహాత్ముడి అహింసా మార్గంలో భూ సంస్కరణలకు పోచంపల్లిలో పునాది పడింది. ఈ డెబ్భై ఏళ్లలో భూదాన ఉద్యమం సాధించిందేమిటి? ఎన్ని పేద కుటుంబాలకు మేలుచేసింది? భూదాన ఉద్యమ సప్తతి ఉత్సవాల (డెబ్భై ఏళ్ల సంబరాలు) సందర్భంగా ఆ స్ఫూర్తిని మననం చేసుకుంటూ, ఆ వెలుగులో భవిష్యత్తు కార్యాచరణకు బాటలు వేసుకోవాలి.

అలా మొదలైంది..

హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో 1951 ఏప్రిల్‌లో జరిగిన సర్వోదయ సమావేశానికి ఆచార్య వినోబాభావే వచ్చారు. అది ముగిశాక పాదయాత్ర ప్రారంభించి ఏప్రిల్‌ 17న పోచంపల్లికి చేరుకుని, గ్రామస్థులతో సమావేశమయ్యారు. తమకు కొద్దో గొప్పో భూమి ఉంటే జీవనోపాధి లభిస్తుందన్న పేదల మాటలు ఆయనలో ఆలోచన రేకెత్తించాయి. 'ఈ పేదలకు భూమి ఇప్పించడానికి మనమేమి చేయగలం' అని మరుసటిరోజు గ్రామస్థులను అడిగారు వినోబా. తన భూమిలోంచి వంద ఎకరాలను దానం చేయడానికి స్థానిక భూస్వామి వెదిరె రాంచంద్రారెడ్డి ముందుకొచ్చారు. అప్పటికప్పుడు దానపత్రం రాసి వినోబాభావేకు అందించగా, భూమి లేని పేదలకు పంపిణీ చేశారు. అలా ప్రారంభమైన ఉద్యమం.. రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. వినోబాభావే దేశమంతా 64 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి 48.67 లక్షల ఎకరాల భూమిని స్వీకరించారు. భూదానంలో ఝార్ఖండ్‌ (14.69 లక్షల ఎకరాలు), బిహార్‌ (6.48), ఒడిశా (6.38), రాజస్థాన్‌ (5.46), ఉత్తర్‌ ప్రదేశ్‌ (4.36), మధ్యప్రదేశ్‌ (4.10) తొలి వరసలో నిలిచాయి. అలా సమకూరిన భూమిలోంచి 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారు. అప్పట్లో దేశంలో ఉన్న ముప్పై కోట్ల ఎకరాల సాగుభూమిలో అయిదు కోట్ల ఎకరాలను దానంగా పుచ్చుకోవాలని భావించినా, అరకోటి ఎకరాలే లభించాయి.

భూదాన ఉద్యమం ఆరంభమైన ఏడాదికే గ్రామదాన కార్యక్రమంగా రూపుదాల్చింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మంగ్రోత్‌ వాసులు తమ ఊరిలోని మొత్తం భూములను దానం చేసి, తొలి గ్రామదాతలయ్యారు. వ్యక్తిగత భూములను గ్రామసభకు గానీ, దాని ఆధ్వర్యంలోని సంఘానికి గానీ అప్పగించి, గ్రామస్థులందరూ కలిసి సహకార పద్ధతిలో సాగుచేసుకోవడమే 'గ్రామదానం', దీంతో 'భూమి' ఉమ్మడి ఆస్తి అవుతుంది. దేశవ్యాప్తంగా కొన్ని వేల గ్రామాలు తమ ఊళ్లలోని మొత్తం భూమిని దానంగా ఇచ్చాయి. గ్రామదానంతో ఆగకుండా తాలూకా, జిల్లా దానాలూ జరిగాయి. మహాత్మాగాంధీ శతజయంతి (1969 అక్టోబర్‌ 2) నాటికి దేశంలోని అన్ని పల్లెలను గ్రామదాన గ్రామాలుగా మార్చాలని వినోబా లక్ష్యంగా ఉండేది. వివిధ కారణాలతో అది సాధ్యపడలేదు. మొదట్లో భూ యజమానులు ఆరోవంతు భూమిని దానం చేయాలని కోరిన వినోబా, ఆ తరవాత కాలంలో ఇరవయ్యో వంతును ఇవ్వాలని అభ్యర్థించారు.

భూహక్కుల యజ్ఞం కావాలి!

దేశంలో భూమిలేని పేదలే ఉండకూడదనే మహదాశయంతో ప్రారంభమైన భూదాన యజ్ఞం ఉద్యమ లక్ష్యాల్లో పది శాతం లోపే సాధించగలిగింది. దానంగా వచ్చిన ఆ కాస్త భూమి కూడా ఎక్కువ మేరకు సాగుకు పనికిరానిది, సమస్యల్లో ఉన్నదే! ఉద్యమం ప్రారంభమైన రెండు దశాబ్దాలకు భూదానం ఆగిపోయింది. పరిమిత ఫలితాలే సాధించినా భూదాన ఉద్యమం ప్రభావం గణనీయమైనది. ఆశించిన లక్ష్యాలు నెరవేరకపోయినా నేటికీ ఆచరణీయ ఆదర్శాలను దేశానికి అందించిన మహోద్యమమిది. దీని స్ఫూర్తితో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భూహక్కుల యజ్ఞాన్ని ఆరంభించాలి. భూ యజమానులందరికీ తమ భూహక్కులు, హద్దులపై స్పష్టత, భద్రత ఆ గ్రామమే ఇచ్చే వ్యవస్థను రూపొందించాలి. గ్రామమే హక్కులకు హామీ ఇస్తున్నందుకుగాను ఎకరానికి ఒక గుంట లేదా రెండున్నర సెంట్ల భూమిని గ్రామసభకు ఇప్పించాలి. అలా వచ్చిన భూమిని గ్రామ ఉమ్మడి అవసరాలకు, పేదలకు పంచడానికి వినియోగించాలి. భూ యజమానికి, పేదలకు, గ్రామానికి- అందరికీ దీంతో మేలు జరుగుతుంది. ఇది సాధ్యపడాలంటే ప్రతి గుంట/సెంటు భూమిని సర్వే చేసి భద్రమైన రికార్డులు రూపొందించాలి. హక్కులకు హామీ ఇవ్వడం వల్ల భూమి విలువలు పెరుగుతాయి, వివాదాలు తగ్గుతాయి. ఈ లాభాలతో పోల్చుకుంటే భూ యజమాని తన భూమిలోంచి గ్రామసభకు ఇచ్చేది చాలా తక్కువ. భూదాన ఉద్యమ ప్రేరణతో ప్రజల కోసం భూమి బ్యాంకులను నిర్వహించడం, సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, భూమి విలువను పెంచుతూ వినియోగంలో మరింత లాభాలు ఆర్జించే విధానాలను రూపకల్పనకు ప్రభుత్వాలు నడుంబిగించాలి.

తెలుగు ప్రజల దాతృత్వం

''తెలుగు ప్రజలు ఆనాడు దాదాపు రెండు లక్షల ఎకరాల భూమిని వినోబాకు అప్పగించారు. నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్లు, కడప జిల్లాల నుంచి ఎక్కువ భూమి దానంగా వచ్చింది. భూదాన స్వీకరణకు, వచ్చిన భూమిని పేదలకు పంచడానికి నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1965లో భూదాన, గ్రామదాన చట్టాన్ని రూపొందించింది. దీని కింద ఏర్పడిన భూదాన బోర్డుదే ఈ భూముల నిర్వహణ బాధ్యత! కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన తరవాత తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసింది.''

-ఎం.సునీల్ కుమార్, రచయిత-భూ చట్టాల నిపుణులు, నల్సార్​ న్యాయ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు

ఇవీ చదవండి: జగమెరిగిన వైద్య శిఖామణి... కాకర్ల సుబ్బారావు!

మరణంలోనూ వీడని హిందూ-ముస్లిం​ స్నేహం

Last Updated : Apr 18, 2021, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.