ETV Bharat / opinion

Fish farming: మత్స్యరంగంలో అపార అవకాశాలు! - ఆక్వాకల్చర్‌

దేశంలో మత్స్య రంగంలో(Fisheries Department) అపార అవకాశాలున్నాయి. దాదాపు 3 కోట్ల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం అభివృద్ధికి వివిధ కేంద్ర పథకాలు విస్తృత బాటలు పరుస్తున్నాయి. నేడు (జులై 10) జాతీయ మత్స్య రైతుల దినోత్సవం(National fish farmers day 2021) సందర్భంగా ఈ రంగంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు మీకోసం.

fish farming
చేపల పెంపకం
author img

By

Published : Jul 10, 2021, 8:27 AM IST

మత్స్య ఉత్పత్తులు కోట్ల మందికి ఉపాధి చూపడమే కాకుండా, వేల కోట్ల రూపాయల విదేశి మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి. దేశంలో మత్స్య రంగం 2.80 కోట్ల మత్స్యకారులు, చేపల పెంపకందారులకు(Fish farming) ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది. చేపలు, రొయ్యలకు మేత తయారీ సంస్థలు, మత్స్య ఉత్పత్తుల శుద్ధి, ఎగుమతి పరిశ్రమలు, రవాణా రంగంలోని కార్మికులు, విక్రయదారులు మొత్తంగా 14.5 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు గణాంకాలు చెబుతున్నాయి. 2019-20లో మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రూ.46 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. చేపల ఉత్పత్తిలో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఆక్వాకల్చర్‌ ద్వారా చేపల ఉత్పత్తిలో మనది ప్రపంచంలో రెండో స్థానం. నాణ్యమైన చేపలు, రొయ్యల కోసం అమెరికా, చైనా సహా ఎన్నో దేశాలు మనవైపు చూస్తుండటం ఈ రంగంలో మన స్థాయిని చాటడమే కాకుండా, ఈ రంగం అభివృద్ధిలో దేశానికున్న అవకాశాలనూ వెల్లడిస్తోంది.

fish farming
జాతీయ మత్స్య రైతుల దినోత్సవం

కొత్త ఊపు

మత్స్యరంగ అభివృద్ధికి 2015 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నీలి విప్లవం పేరిట ఓ పథకాన్ని ప్రారంభించింది. 2018-19లో రూ.7,522 కోట్లతో ప్రారంభించిన మత్స్యరంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్‌ఐడీఫ్‌) దేశంలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు సముద్ర, లోతట్టు ప్రాంతాల్లో మత్స్య రంగానికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు తోడ్పడుతోంది. మత్స్యకారులు, చేపల రైతులకు పెట్టుబడి అవసరాలను తీర్చడంలో సహాయ పడటానికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల సౌకర్యాల్నీ ప్రభుత్వం వర్తింపజేసింది. చేపల పెంపకం, వాటి విక్రయం తదితర అంశాల్లో మత్స్యకారులను సంఘటిత పరచేందుకు దేశవ్యాప్తంగా మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి.

గతేడాది రూ.20,050 కోట్లతో 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)'కు శ్రీకారం చుట్టారు. ఇందులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా కూడా ఉంటుంది. దేశంలో మత్స్యరంగంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద పథకం. ఇందులో రూ.12,340 కోట్లను మత్స్యకారుల సంక్షేమ పథకాలకు, మరో రూ.7,710 కోట్లను ఈ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించారు. మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం, మత్స్యకారులు, చేపల రైతుల సంక్షేమం, ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, వ్యాపార సౌలభ్యాన్ని పెంచడం, ఆవిష్కరణలను, అంకుర సంస్థలను ప్రోత్సహించడం, ఆక్వాకల్చర్‌లో నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి అనువైన ఏర్పాట్లు చేయడం ఈ పథకంలో కీలకాంశాలు. ఈ పథకం 2020-21 నుంచి 2024-25 వరకు అయిదేళ్లపాటు అమలులో ఉంటుంది.

అదనంగా 55లక్షల మందికి ఉపాధి..

2018-19 నాటికి 137 లక్షల మెట్రిక్‌ టన్నులున్న చేపల ఉత్పత్తిని 2024-25 నాటికి 220 లక్షల మెట్రిక్‌ టన్నులకు, మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ఆదాయాన్ని రూ.46,589 కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయలకు పెంచాలన్నది లక్ష్యం. ఆక్వాకల్చర్‌లో ప్రస్తుత జాతీయ సగటు ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులు. దీన్ని అయిదు టన్నులదాకా పెంచాలని పీఎంఎంఎస్‌వై నిర్దేశించింది. అంతేకాదు- ఈ రంగంలో సుమారు 55 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న భారీ లక్ష్యం కూడా దీని ముందుంది.

fish farming
చేపల పెంపకం

తెలుగు రాష్ట్రాల చొరవ..

సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం రూ.16,350 కోట్లుగా ఉన్న చేపలు, రొయ్యల ఎగుమతి 2030 నాటికి రూ.37,575 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో ఆక్వా కల్చర్‌లో ఆంధ్రప్రదేశ్‌దే మొదటిస్థానం. చేపలు, రొయ్యల సాగులో ఏపీ వాటా దాదాపు 37 శాతం. తరవాతి స్థానంలో పశ్చిమ్‌ బంగ, గుజరాత్‌ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం చేపలు, రొయ్యల సాగులో స్వయంసమృద్ధి కోసం నాలుగైదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా సాగుతోంది. తీరప్రాంతం లేకున్నా లోతట్టు నీటివనరులు ఎక్కువగా ఉండటం వల్ల వాటిలోనే చేపలు, రొయ్యల పెంపకం చేపట్టింది. రొయ్యలు, చేప పిల్లల ఉచిత పంపిణీ, రాయితీపై సామగ్రి అందించడం వంటి కార్యాచరణతో అడుగులు వేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు గోవా వంటి రాష్ట్రాల్లోనూ లోతట్టు ప్రాంతాల్లో చేపల పెంపకం, శీతల మత్స్య జాతుల పెంపకాన్ని చేపట్టాలని పీఎంఎంఎస్‌వై నిర్దేశించింది. ఈ దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సి ఉంది.

దేశమంతటా విస్తరించాలి..

లోతట్టు ఆక్వాకల్చర్‌లో ఉత్పాదకతను పెంచడం, చేపలు, రొయ్యల పెట్టుబడి, రవాణా, విక్రయాల్లో వచ్చే నష్టాలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం, వినియోగానికి నోచుకోని భూముల్లో ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడం, దేశీయంగా చేపల తలసరి వినియోగాన్ని అయిదారు కిలోల నుంచి 12 కిలోలదాకా పెంచడం వంటి బృహత్తర లక్ష్యాలతో అమలులోకి వచ్చిన పీఎంఎంఎస్‌వై వాటిని సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరం. ఇప్పటికే ఈ పథకంలో ఏడాది గడిచిపోయింది. ఆక్వాకల్చర్‌లో ముందున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, పశ్చిమ్‌ బంగ, ఒడిశా వంటి రాష్ట్రాలే పీఎంఎంఎస్‌వై అమలులోనూ చొరవ చూపుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లోనూ చేపల పెంపకానికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెడితే- చౌకగా ప్రజలకు పోషకాహారం అందడం సహా ఉపాధికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. కొవిడ్‌తో గత సంవత్సరం ఆటంకాలు ఏర్పడినా- మత్స్య ఎగుమతుల్లో ఆశాజనకమైన పరిస్థితి ఉండటం, వృద్ధి రేటు పెరగడం ఈ రంగంపై మరిన్ని ఆశలు పెట్టుకోవచ్చన్న సంకేతాలు అందిస్తోంది. అరకోటి మందికి పైగా అదనంగా ఉపాధి కల్పించే వనరుగా దీన్ని తీర్చిదిద్దాలన్న పీఎంఎస్‌ఎస్‌వై లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వాలు సమష్టిగా అడుగులు వేయాలి. ఈ రంగం మౌలిక వసతులు, మార్కెటింగ్‌లో అడ్డంకులను అధిగమించి పురోభివృద్ధి చెందితే- ఉపాధికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ గట్టి ఊతంగా నిలుస్తుంది.

అభివృద్ధికి అవకాశాలెన్నో..

దేశంలోని 7,517 కి.మీ. తీరప్రాంతం కోట్ల మంది మత్స్యకారులకు ఉపాధి చూపుతోంది. జలాశయాలు, చెరువులు వంటి లోతట్టు నీటి వనరుల్లో చేపల సాగు లక్షల మందికి జీవనాధారంగా ఉంది. ఇదికాక చేపలు, రొయ్యలు వంటి మత్స్యజాతుల సాగు దేశంలో కొన్నేళ్లుగా వేగం పుంజుకుంది. దేశంలో మత్స్యరంగం 2014-15 నుంచి 2019-20 వరకు సగటున ఎనిమిది శాతానికి పైగా వార్షిక వృద్ధిరేటు సాధించింది. ఆక్వా సాగులో ఇది 10 శాతాన్ని దాటింది. భారత్‌లో గత అయిదేళ్లలో చేపల ఉత్పత్తి సగటు వార్షిక వృద్ధి 7.53 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలన్నీ మత్స్యరంగ అభివృద్ధికి ఉన్న అవకాశాల్ని కళ్లకు కడుతున్నాయి.

- శిశిర

ఇదీ చూడండి: అంతరిక్షంలోకి 'స్క్విడ్' చేపలు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.