ETV Bharat / opinion

బంగ్లా 'చైనా కార్డు' ప్రయోగం- తెరపైకి 'తీస్తా' జలాలు

ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటన చేపట్టారు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. కరోనా కట్టడిలో సహకారంపైనే ప్రధానంగా దృష్టిసారించినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ.. పర్యటన ముఖ్య ఉద్దేశం మాత్రం మరోటి ఉందంటున్నారు విశ్లేషకులు. ఇటీవల బంగ్లాదేశ్ తెరపైకి తీసుకొచ్చిన తీస్తా జల నిర్వహణ ప్రాజెక్టుకు చైనా ఆర్థిక సహకారం అందించడం వల్లే భారత్ హడావుడిగా ఈ పర్యటన చేపట్టినట్లు చెబుతున్నారు.

Teesta in the shadows of India-Bangladesh vaccine talks?
బంగ్లా 'చైనా కార్డు' ప్రయోగం- తెరపైకి 'తీస్తా' జలాలు
author img

By

Published : Aug 20, 2020, 4:40 PM IST

భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్నారు. వ్యాక్సిన్​ కోసం జరుగుతున్న ప్రాథమిక ట్రయల్స్​లో బంగ్లాకు తగిన ప్రాధాన్యమిస్తామని ష్రింగ్లా హామీ ఇచ్చారు. కరోనా కట్టడి, కొవిడ్ తదనంతర ఆర్థిక వ్యవస్థపై చర్చించినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ.. పర్యటన ముఖ్య అజెండా మరొకటి ఉందని పరిశీలకులు అభిప్రాయపడతున్నారు. తీస్తా నది నిర్వహణ కోసం బంగ్లాదేశ్​కు చైనా సుమారు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడం కూడా ఈ పర్యటనకు కారణమని స్పష్టం చేస్తున్నారు.

"ఈ పర్యటనలో అజెండా తీస్తా జల వివాదం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో తమకు ఆందోళనలు ఉన్నాయని భారత్​ వారికి చెప్పే ఉంటుంది."

-భారత్-బంగ్లా వ్యవహారాల నిపుణులు

ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్​లో ఉన్న టీకాను ప్రాధాన్య క్రమంలో బంగ్లాదేశ్​కు అందిస్తామని పర్యటనలో భాగంగా ష్రింగ్లా ఆ దేశానికి హామీ ఇచ్చారు. భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

"వ్యాక్సిన్ అభివృద్ధి అయిన తర్వాత మిత్రులు, భాగస్వామ్య దేశాలు, పొరుగుదేశాలకు తప్పకుండా అందిస్తాం. ఇందులో మరో మాట లేదు. మాకు బంగ్లాదేశ్ ఎప్పటికీ ముఖ్యమైన దేశమే."

-ష్రింగ్లా

మరోవైపు తమ దేశంలో వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తే భారత్​కు సహకరించేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మసూద్ బిన్ మోమెన్ తెలిపారు.

"వ్యాక్సిన్ కేవలం భారత్​ కోసమే తయారు చేయడం లేదని వారు(భారత అధికారులు) చెప్పారు. బంగ్లాదేశ్​కు కూడా తొలి దశలోనే అందిస్తామని హామీ ఇచ్చారు."

-మసూద్ బిన్ మోమెన్, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి

ష్రింగ్లా పర్యటనలో కొవిడ్ వ్యాక్సిన్​పైనే ప్రధానంగా దృష్టిసారించినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఈ ఆకస్మిక పర్యటన ముఖ్య ఉద్దేశం మాత్రం బంగ్లాపై చైనా ప్రభావమేనని తెలుస్తోంది.

తెరపైకి 'తీస్తా'

చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ బంగ్లాదేశ్​లో నిర్వహించేందుకు ఆ దేశ వైద్య పరిశోధనా సంస్థ తొలుత అనుమతులు ఇచ్చింది. తర్వాత ఈ అనుమతులను నిలిపివేసింది. అయితే తాజాగా తీస్తా నదీ జలాల నిర్వహణ కోసం బంగ్లాకు సుమారు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని చైనా మంజూరు చేయడం భారత్​కు కొత్త తలనొప్పిగా మారింది. ఒక దక్షిణాసియా దేశంలో నదీ జలాల నిర్వహణ అంశంలో చైనా తలదూర్చడం ఇదే తొలిసారి.

కుదిరినట్లే కుదిరి..

భారతదేశానికి అత్యంత సన్నిహిత పొరుగుదేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. బంగ్లాతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ తీస్తా నదీ జలాల వివాదం మాత్రం ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా నలిగిపోతోంది. 2011లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తీస్తా నదీ జలాల విషయంలో ఇరుపక్షాల మధ్య ఒప్పందం దాదాపుగా కుదిరిపోయింది. కానీ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించడం వల్ల చివరి నిమిషంలో ఒప్పందం నిలిచిపోయింది.

హిమాలయాల్లో ఉద్భవించే ఈ తీస్తా నది.. భారత్​లోని సిక్కిం, బంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్​లో ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్​లోని కొన్ని మైదాన ప్రాంతాలకు ఈ నదీ జలాలే ఆధారం. శీతాకాలంలోని రెండు నెలలు మాత్రం నది పొడిగా ఉంటుంది.

'పంపిణీ సమానంగా ఉండాలి'

1996 గంగా నది ఒప్పందం ప్రకారమే తీస్తా జలాలను సమానంగా పంచుకోవాలని బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. ఫరక్కా బ్యారేజీలోని ఉపరితల జలాలను పంచుకునేందుకు ఈ ఒప్పందం జరిగింది. అయితే తీస్తా జలాలనూ ఇదే తరహాలో పంచుకోవాలన్న బంగ్లా ప్రతిపాదన ముందుకు సాగలేదు.

అంతర్​సరిహద్దు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత్​లోని రాష్ట్రాలకు విశేషాధికారాలు ఉన్నాయి. తీస్తా ఒప్పందంపై అప్పటి బంగాల్ ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. ఫలితంగా విదేశీ విధానం రూపకల్పనకు ఆటంకం ఏర్పడింది.

తాజా పరిణామాలు

ప్రస్తుతం బంగ్లాదేశ్ 'తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ' ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. గ్రేటర్ రంగ్​పుర్​ ప్రాంతంలో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు కోసం చైనా నుంచి 853 మిలియన్ డాలర్ల రుణాన్ని కోరింది. దీనికి బీజింగ్ అంగీకారం కూడా తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 983 మిలియన్ డాలర్లు. తీస్తా నదీ జలాలను నిల్వ చేసేందుకు భారీ జలాశయాలను నిర్మించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

"ఒకవేళ భారత్​ ఈ పరిణామాలు(తీస్తా ప్రాజెక్టుకు చైనా ఆర్థిక సాయం అందించడం) తన జాతి ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తే.. ప్రతి చర్యలను చేపట్టే అంశాన్ని దిల్లీ యంత్రాంగం పరిశీలించాలి."

-పరిశీలకులు

బంగ్లాదేశ్ రక్షణ ప్రాజెక్టుల్లోనూ చైనా దూకుడు సాగిస్తోంది. పెకువా, కాక్స్​ బజార్​లో బీఎన్​ఎస్ షేక్ హసీనా సబ్​మెరైన్ స్థావరం నిర్మాణం వేగవంతం చేసింది. బంగ్లాదేశ్​ నేవీకి రెండు సబ్​మెరైన్లను అందించేందుకు ప్రయత్నాలు పూర్తి చేస్తోంది.

"బంగ్లాదేశ్​పై చైనా ఆధిపత్యం పెరుగుతోంది. ఢాకా ఇప్పుడు చైనా కార్డును ప్రయోగిస్తోంది."

-సంబంధిత వర్గాలు

భారత్ పూర్తిగా వ్యతిరేకిస్తున్న బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ప్రతిపాదనను సైతం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమోదించారు. బంగాళాఖాతంలో సముద్ర జలాల నిర్వహణ కోసం చైనాకు సహకరించేందుకు బంగ్లాదేశ్ అనుమతించింది. ఇవన్నీ కూడా భారత్​కు కలవరపాటు కలిగించే అంశాలు.

(రచయిత-అరూణిం భుయాన్)

ఇదీ చదవండి- కరోనా కట్టడిలో సహకారంపై భారత్​-బంగ్లా చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.