ETV Bharat / opinion

'సమగ్ర రవాణా వ్యవస్థ అభివృద్ధికి కొత్త లాజిస్టిక్స్​ చట్టం'

దేశంలో వాణిజ్యం సాఫీగా జరగాలంటే సరకు రవాణా చాలా కీలకం. లాజిస్టిక్ వ్యవస్థ అసమర్థంగా ఉంటే రవాణా వ్యయాలు పెరిగిపోతాయి. ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించే పనిలో ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా జీడీపీలో ఈ వ్యయాలను 10 శాతం కన్నా తక్కువకు తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది.

Tackling India's nightmare: A new law to reduce cost, time of transportation
'సమగ్ర రవాణా వ్యవస్థ అభివృద్ధికి కొత్త లాజిస్టిక్స్​ చట్టం'
author img

By

Published : Jul 8, 2020, 3:48 PM IST

వాణిజ్య సరకు రవాణా సమయం, ఖర్చు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. లాజిస్టిక్ వ్యయాలను మూడింట ఒక వంతు మేర తగ్గించే విధంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ నూతన చట్టం రూపొందించే పనిలో నిమగ్నమైంది. జీడీపీలో 14-15 శాతంగా ఉన్న ఈ వ్యయాలను 10 శాతానికన్నా తక్కువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

నేషనల్ లాజిస్టిక్స్ లా ఎఫీషియెన్సీ అండ్ అడ్వాన్స్ ప్రెడిక్టబిలిటీ యాక్ట్ పేరుతో రూపొందుతున్న ఈ బిల్లు 1993 నాటి మల్టీమోడల్ ట్రాన్స్​పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ చట్టాన్ని భర్తీ చేస్తుంది. ప్రస్తుతం అసమర్థంగా, అధిక సమయం తీసుకునే వ్యవస్థ స్థానంలో ఇది సమర్థంగా పనిచేస్తుంది.

"లాజిస్టిక్ రంగం అంటే ఏంటో చట్టాల్లో ఎక్కడా స్పష్టంగా లేదు. కాబట్టి లాజిస్టిక్ రంగం, దానిలోని ప్రతి అంశాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉంది. డిజిటలైజేషన్ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూనే లాజిస్టిక్స్​ రంగంలోని ప్రతి అంశాన్ని ప్రతిపాదిత చట్టం స్పష్టంగా నిర్వచిస్తుంది."

-పవన్ అగర్వాల్, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి

దేశంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న లాజిస్టిక్ సమస్యను పరిష్కరించడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య మంత్రిత్వ శాఖ నేషనల్ లాజిస్టిక్ పాలసీ ముసాయిదాను విడుదల చేసింది.

"సమర్థమైన లాజిస్టిక్ వ్యవస్థ బలమైన ఆర్థిక వృద్ధికి తోడ్పడటం సహా వ్యాపారాలకు ఊతమిస్తుంది. పటిష్ఠమైన సరఫరా గొలుసు నెట్​వర్క్​ ఉంటే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా మొత్తం ఆర్థిక వ్యవస్థపై పరోక్షంగా సానుకూల ప్రభావం పడుతుంది. భౌగోళికంగా ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది."

-ముసాయిదాలోని ఓ భాగం

లాజిస్టిక్ వ్యయాలు, విద్యుత్ లభ్యత- వాటి ధరలపైనే పెట్టుబడిదారులు ప్రధానంగా దృష్టిసారిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నమ్మకమైన లాజిస్టిక్ వ్యవస్థ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపింది. ఎగుమతిలో పోటీతత్వాన్ని పెంచుతుందని స్పష్టం చేసింది.

లాజిస్టిక్ వ్యయాలను జీడీపీలో 13-14 శాతం నుంచి 9-10 శాతానికి తగ్గించాలని ప్రతిపాదిత నూతన చట్టం లక్ష్యంగా పెట్టుకుంది. ఐరోపాలో లాజిస్టిక్ వ్యయం ఆ ప్రాంత జీడీపీలో 10 శాతంగా ఉంటే జపాన్​లో 11 శాతంగా ఉంది. అమెరికాలో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది.

ప్రస్తుతం సమస్యలివే

రవాణా కోసం రహదారులపై అతిగా ఆధారపడటమే భారత్​లో లాజిస్టిక్ సమస్యలకు ప్రధాన కారణం. ఈ రంగం పూర్తిగా అసంఘటితంగా ఉంది. అంతేగాక అధిక వ్యయాలతో కూడుకొని ఉంది. దేశంలో 60 శాతం రవాణా రోడ్డు మార్గాల ద్వారానే సాగుతోంది. భారీ ట్రక్కులు, లారీలపైనే రోడ్డు రవాణా ఆధారపడి ఉంది. ఇవన్నీ డీజిల్​పై ఆధారపడి పనిచేస్తాయి. ఇందుకోసం ముడిచమురును అధికంగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. చివరకు పర్యావరణ కాలుష్యం కూడా అధికంగా సంభవిస్తోంది. అదే సమయంలో చౌక రవాణా మాధ్యమమైన రైల్వేలో సరకు రవాణా వాటా 30 శాతంగా ఉంది.

దీన్ని మార్చేందుకే

ఇప్పుడు భారత్​ సైతం అభివృద్ధి చెందిన దేశాల మార్గంలోనే పయనిస్తోంది. రోడ్డు రవాణాను 60 శాతం నుంచి 20-30 శాతానికి తగ్గించి.. రైల్వే ద్వారా సరకు రవాణాను 50-55 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ప్రస్తుతం 9 శాతంగా ఉన్న జలమార్గ రవాణాను 20-25 శాతానికి తీసుకురావాలని నిశ్చయించుకుంది.

సమన్వయం లేదు

భారత్​లో లాజిస్టిక్ వ్యవహారాల విషయంలో వివిధ మంత్రిత్వ శాఖలు విభిన్న పాత్ర పోషిస్తాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్, రైల్వే, పౌర విమానయానం, వాణిజ్య- పరిశ్రమలు, ఆర్థికం, హోం, తపాలా శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే లాజిస్టిక్ సజావుగా సాగుతుంది. అనుమతులు జారీ చేయడం నుంచి పన్నులు విధించడం వరకు సరఫరా గొలుసులో జరిగే ప్రక్రియలో ఈ మంత్రిత్వ శాఖలన్నీ పాలుపంచుకుంటాయి.

వీటికి తోడుగా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్లాంట్ అండ్ యానిమల్ క్వారంటైన్ సర్టిఫికేషన్ సర్వీసెస్ వంటి సంస్థలు సప్లై చైన్​ కోసం క్లియరెన్సులు ఇస్తాయి.

కానీ ఇతర దేశాలు మాత్రం ఇంటిగ్రేటెడ్ విధానాన్ని అవలంబించి విజయం సాధిస్తున్నాయి. జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, మలేసియా ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రధానమంత్రి అధ్యక్షతన అపెక్స్ కమిటీలు ఏర్పాటు చేసి వాటికి అవసరమైన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ అపెక్స్ కమిటీలు ప్రపంచంతో పోటీ పడే విధంగా లాజిస్టిక్ వ్యవస్థను తీర్చిదిద్దుతాయి.

భారత్​ ప్రణాళిక ఏంటి?

వస్తువుల రవాణా మాత్రమే కాకుండా ప్రపంచస్థాయి నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. మౌలిక సదుపాయాల రంగంలోని ఉప రంగాల జాబితాను రూపొందించింది. వీటికి 2017 నవంబర్​లో మౌలిక సదుపాయాల రంగం హోదా ఇచ్చింది. దీంతో ఆయా రంగాల్లోని సంస్థలకు రాయితీ రేటుతో దీర్ఘకాల నిధులను పొందడం సహా విదేశాల నుంచి నిధులు సేకరించే అవకాశం లభించింది.

త్వరగా పాడైపోయే ఉత్పత్తుల విషయానికొస్తే..

ప్రపంచంలో కూరగాయలు(178 మిలియన్ టన్నులు), పండ్లు(92 మిలియన్ టన్నులు) అత్యధికంగా పండిస్తున్న దేశం భారత్​. కానీ, సరైన కోల్ట్​ స్టోరేజీ, నాణ్యమైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా.. మూడింట ఒక వంతు పండ్ల ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఉదాహరణకు నియంత్రిత కోల్డ్ స్టోరేజీలో ఆపిల్ పండ్ల జీవితకాలం 9-10 నెలలు ఉంటే.. సాధారణ కోల్డ్ స్టోరేజీలో 3 నెలలు మాత్రమే ఉంటోంది.

ప్రస్తుత చట్టం వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలను 4- 5 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకమైన నిల్వ కేంద్రాలు అభివృద్ధి చేసి వేర్​హౌస్ రంగాన్ని సుదృఢం చేయడంపై దృష్టిసారిస్తుంది.

చౌక రవాణా విధానాలు

ఇనుమును 400-500 కి.మీల దూరం వరకు తరలించేందుకు గొట్టపు మార్గాల ద్వారా నీటితో కలిపి ఇనుప ధాతువును పంపించే (స్లర్రీ పైప్​లైన్) చౌకైన విధానాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇదే లోహాన్ని 400 నుంచి 1100 కి.మీల దూరం పంపాలనుకుంటే రైల్వే లైన్లు ఉత్తమమని ప్రతిపాదించింది. 1100 కిలోమీటర్లు మించిన దూరాలకు ఇనుమును తరలించాలంటే జల మార్గం అత్యంత చౌకగా ఉంటుందని స్పష్టం చేసింది. 400 కి.మీల లోపు దూరాలకు స్లర్రీ పైప్​లైన్​తో పోలిస్తే అంతర్గత జలమార్గాలు ఉత్తమమని తేల్చింది. ఇలా ప్రతి వస్తువు తరలించేందుకు ఉన్న ఉత్తమ మార్గాలు గుర్తించి, వాటి వివరాలు సేకరించింది.

మొత్తం వ్యవస్థ కావాలి

చౌకైన విధానాలను గుర్తించడమే కాకుండా మొత్తం లాజిస్టిక్ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఉదాహరణకు అమెరికాలో సిమెంట్ పరిశ్రమల చుట్టూ 350కి పైగా ఇంటిగ్రేటెడ్ రైల్వే టెర్మినళ్లు విస్తరించి ఉన్నాయి. సిమెంట్ బ్యాగులు, బల్క్​ సిమెంట్​ను నిల్వచేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఇవి కల్పిస్తాయి. డిమాండ్ ప్రకారం వివిధ రకాల సిమెంట్​లను కలిపి విలువ ఆధారిత సేవలను సైతం ఇవి అందిస్తాయి.

దీనిని నమూనాగా తీసుకొని డిమాండ్ ఉన్న చోట్ల 8-10 బల్క్ టెర్మినళ్లు నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 10- 12 ప్రాంతాల్లో బ్యాగ్ హ్యాండ్లింగ్ టెర్మినళ్లను నిర్మించేందుకు కసరత్తులు చేస్తోంది.

(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠి)

ఇదీ చదవండి- ప్రైవేటీకరణకు భారతీయ రైల్వే సిద్ధంగానే ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.