ETV Bharat / opinion

కూటముల కోలాటం.. రక్తికడుతున్న ఎన్నికల పోరు - congress

పెరుగుతున్న గ్యాస్‌, పెట్రో ధరలు, నిరుద్యోగం ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధాలు కానున్నాయి. అసోంలో కూటముల కోలాటంతో ఎన్నికల సంగ్రామం రక్తికడుతోంది. ఇప్పటికే కొన్ని మిత్రపక్షాలు చేజారడం, తాజాగా రాష్ట్రీయ జనతాదళ్‌ లాంటి పార్టీలూ భాజపాను నిలువరించేందుకు అసోం‌లో రంగప్రవేశం చేస్తుండటం వంటి పరిణామాలు కమలనాథులకు మింగుడుపడేవి కావు. ఈ అడ్డంకులను అధిగమించి మరోసారి అసోం‌లో అధికారాన్ని భాజపా చేపట్టగలదా? రాష్ట్రంలో మూడు దశల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు ప్రజలు.

SUB FEATURE
కూటముల కోలాటం.. అసోమ్‌లో రక్తికడుతున్న ఎన్నికల పోరు
author img

By

Published : Mar 6, 2021, 9:50 AM IST

Updated : Mar 6, 2021, 11:38 AM IST

దేశంలోని అయిదు అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో అందరిందృష్టీ పశ్చిమ్‌ బంగా మీదే ఉంది. కానీ కీలక మెలిక అసోంలో ఉంది. దశాబ్దాల తరబడి అసలు తమకు ప్రాతినిధ్యం లేని రాష్ట్రంలో దాదాపు 68 శాతం సీట్లతో ఎన్డీఏ అధికారం చేపట్టడం సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడో 1978-79 సంవత్సరాల మధ్య జనతాపార్టీ ప్రభుత్వం అసోం‌లో ఉండేది. తరవాత మళ్లీ 2016లోనే భాజపా అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. అసోం‌లో నెగ్గిన తరవాత ఈశాన్యప్రాంత ప్రజాస్వామ్య కూటమి (నార్త్‌ఈస్ట్‌ డెమొక్రాటిక్‌ ఎలయెన్స్‌-నెడా) పేరుతో ఒక కూటమిని ఏర్పాటుచేసి, దానికి హిమంత బిశ్వశర్మను కన్వీనర్‌గా నియమించారు. అప్పటినుంచి దాదాపు ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ స్వయంగానో, మిత్రపక్షాల సాయంతోనో క్రమంగా అధికారాన్ని భాజపా సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని మిత్రపక్షాలు చేజారడం, తాజాగా రాష్ట్రీయ జనతాదళ్‌ లాంటి పార్టీలూ భాజపాను నిలువరించేందుకు అసోం‌లో రంగప్రవేశం చేస్తుండటం వంటి పరిణామాలు కమలనాథులకు మింగుడుపడేవి కావు. ఈ అడ్డంకులను అధిగమించి మరోసారి అసోం‌లో అధికారాన్ని భాజపా చేపట్టగలదా?

SUB FEATURE
అసోం ఎన్నికలు

2016 అసోం‌ అసెంబ్లీ ఎన్నికలలో భాజపా సొంతంగా 60, మిత్రపక్షాలైన అసోం‌ గణపరిషత్‌ (ఏజీపీ), బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌)లతో కలిపి 86 స్థానాలు గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను తొమ్మిది చోట్ల భాజపా గెలిచింది. దశాబ్దాల పాటు అసోం‌లో రాజ్యమేలిన కాంగ్రెస్‌పార్టీని కేవలం మూడే స్థానాలకు పరిమితం చేసింది. ఇన్నాళ్లూ అక్కడ కేవలం జాతులకు సంబంధించిన విషయాలే ఎన్నికల ప్రధానాంశాలుగా ఉండగా దాన్ని కాస్తా హిందూ-ముస్లిం, భారతీయ-భారతీయేతర విషయాల మీదకు విజయవంతంగా మళ్లించగలిగింది. ఈసారి ఎన్నికల సమయానికి తమ మిత్రపక్షమైన అసోం‌ గణపరిషత్‌ క్రమంగా బలహీనపడటం వల్ల కొత్తగా యూపీపీఎల్‌తో భాజపా జట్టుకట్టింది. బోడో విద్యార్థి నాయకుడైన ప్రమోద్‌ బోడో ఈ పార్టీని స్థాపించారు. కొన్ని మిత్రపక్షాలు దూరం కావడం, మరికొన్ని చేరువ కావడం లాంటి పరిణామాల మధ్య భాజపా మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటే పర్వాలేదు గానీ, ఓడితే మాత్రం ఈశాన్య రాష్ట్రాల్లో తన పట్టు మొత్తాన్ని కోల్పోతుంది.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రగిల్చిన నిరసన మంటలు అసోం‌లో వ్యాపించినంతగా మరే రాష్ట్రంలోనూ లేవు. సహజంగా, ఈ వివాదంతో భాజపా పీకల్లోతు మునిగిపోవాల్సిందే! కానీ 2020లో జరిగిన బోడోలాండ్‌ ప్రాంతీయ మండలి (బీటీసీ) ఎన్నికల్లో కొత్త వ్యూహాన్ని అనుసరించింది. మిత్రపక్షమైన బీపీఎఫ్‌ను పక్కన పెట్టి ఐక్య ప్రజావిమోచన పార్టీ (యూపీపీఎల్‌)తో జట్టుకట్టి గట్టెక్కింది. 40 స్థానాలున్న బీటీసీలో బీపీఎఫ్‌ 17 స్థానాలు గెలిచి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. యూపీపీఎల్‌ 12 చోట్ల, భాజపా తొమ్మిది చోట్ల గెలవడం కారణంగా 21 స్థానాలతో ఎన్డీఏ అక్కడ పాగా వేసింది.

కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా అసోం‌లో ఇటీవలే రెండురోజులు పర్యటించి, గిరిజనులతో కలిసి ఝుముర్‌ నృత్యం చేసి తమ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన మహాకూటమిలో ఎంపీ బద్రుద్దీన్‌ అజ్మల్‌ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్‌, బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌) ఉన్నాయి. ఇతర పార్టీలకూ ద్వారాలు తెరిచే ఉంటాయని కూటమి నేతలు ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నాయకత్వం లేకపోవడం పెద్ద సమస్య. మూడుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరుణ్‌ గొగోయి మరణానంతరం ఆ పార్టీలో నాయకత్వలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా అసోం‌ జాతీయ పరిషత్‌ (ఏజేపీ), రైజొర్‌దళ్‌ కలిసి మరో కూటమిగా ఏర్పడ్డాయి. ఏజేపీకి లురిన్‌జ్యోతి గొగోయి, రైజొర్‌దళ్‌కు అఖిల్‌ గొగోయి నేతృత్వం వహిస్తున్నారు. అఖిల అసోం‌ విద్యార్థి సంఘం (ఆసు), అసోం‌ జాతీయవాదీ యువ ఛాత్ర పరిషత్‌ ఏజేపీకి మద్దతిస్తున్నాయి. రైతు సంఘాలతో కూడిన కేఎంఎస్‌ఎస్‌ అండ రైజొర్‌దళ్‌కు ఉంది. ఈ రెండు పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మహాకూటమికి, ఈ కొత్త కూటమికి మధ్య కొంతవరకు చీలే అవకాశం ఉంది.

- పి.రఘురామ్‌

ఇదీ చూడండి: మానవ హక్కులపై దాడి- నిరసనలపై ఉక్కు పాదం

Last Updated : Mar 6, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.