ETV Bharat / opinion

Dilip Kumar: 'వెండితెర విషాదం' కనుమరుగు!

భారతీయ సినిమాల్లో విషాద కథలకు తిరుగులేని హీరోగా 'ట్రాజెడీ కింగ్‌' అనిపించుకున్న నటుడు దిలీప్‌ కుమార్‌. సినీ వినీలాకాశంలో తళుకు తారలెన్ని ఉన్నా.. ధ్రువనక్షత్రంలా భాసించిన దిలీప్‌ కుమార్‌ నటకళావతంసుడు! వెండితెరపై విషాదాన్ని పండించడంలో సరిసాటి లేని మేటిగా అశేష జన నీరాజనాలందుకున్నదిలీప్‌ కుమార్‌ తన 98వ ఏట అమరుడై సినీ ప్రియుల గుండెల్లో విషాద వృష్టి కురిపించారు.

author img

By

Published : Jul 8, 2021, 7:47 AM IST

Dilip Kumar
దిలీప్​ కుమార్​

ఆయన ఓ దశలో విషాద కథలతో బేజారెత్తిపోయి కాస్త భిన్నత్వం కోరుకొని సరదా కథలవైపు మళ్లారు. అలాంటి ఓ కథ కొంత భాగం చిత్రీకరించాక డిస్ట్రిబ్యూటరుకు చూపించారు. ఆ రోజుల్లో ఇలా మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లకు చూపించే సంప్రదాయం ఉండేది. 'అబ్బే' అంటూ పెదవి విరిచిన ఆ డిస్ట్రిబ్యూటరు 'సర్లెండి.. సినిమా చివర్లో అయినా మీరు చనిపోతారు కదా!' అని అడిగాడట. ఇపుడు నిజంగానే అందరినీ విషాదంలో ముంచి, లోకం విడిచి వెళ్లిపోయారు ఆ నట చక్రవర్తి.

భారతీయ సినీ వినీలాకాశంలో తళుకు తారలెన్ని ఉన్నా ధ్రువనక్షత్రంలా భాసించిన దిలీప్‌ కుమార్‌ నటకళావతంసుడు! 'వయసులో నాకన్నా సరిగ్గా ఇరవై సంవత్సరాలు పెద్దవారైన దిలీప్‌ నటనలో నాకంటే రెండువేల సంవత్సరాలు ముందున్నా'రని అమితాబ్‌ బచ్చన్‌ సన్నుతులందుకున్న పద్మవిభూషణుడు! వెండితెరపై విషాదాన్ని పండించడంలో సరిసాటి లేని మేటిగా అశేష జన నీరాజనాలందుకున్న మొహమ్మద్‌ యూసఫ్‌ ఖాన్‌ అలియాస్‌ దిలీప్‌ కుమార్‌ తన 98వ ఏట అమరుడై సినీ ప్రియుల గుండెల్లో విషాద వృష్టి కురిపించారు.

నటుడిగా దిలీప్‌ కుమార్‌ ముఖానికి రంగు వేసుకొని దాదాపు రెండు పుష్కరాలైంది. అయితేనేం- దిలీప్‌ కుమార్‌ అంటేనే, అసమాన నట వటవృక్షం. ఆయనను అనుకరించే సాహసం చేయడం వెర్రితనమని తెలిసినా, అదే పని చేస్తున్నానని షారూక్‌ ఖాన్‌ అంగీకరించడం- ముందు తరాలనూ ప్రభావితం చేయగల దిలీప్‌ కుమార్‌ నట వైదుష్యానికి నిదర్శనం. ఆరు దశాబ్దాల నట ప్రస్థానంలో ఆయన నటించిన చిత్రాలు పట్టుమని ఆరు పదులైనా లేవు. అయినా దిలీప్‌ నటనకు నిఘంటువు! పాత్రలో ఒదిగిపోయే లక్షణానికి ప్రపంచ సినీ పరిశ్రమలోనే మార్లిన్‌ బ్రాండో పెట్టింది పేరు. బ్రాండో కన్నా వయసులో పెద్దవాడైన దిలీప్‌- నటనకు నిలువెత్తు రూపమని దిగ్దర్శకుడు సత్యజిత్‌ రే ప్రశంసించారు. అమితాబ్‌, నసీరుద్దీన్‌ షా, కమల్‌ హాసన్‌ వంటి మేటి కళాకారులు- 1940, 1950 దశకాల్లో దిలీప్‌ కుమార్‌ నటన నుంచి స్ఫూర్తి పొందే తమను తాము మలచుకొన్నామని సభక్తికంగా చెబుతుంటారు. నటుడికంటే తాను పోషించే పాత్ర ఎంతో ఉన్నతమైనదంటూ, నిత్య విద్యార్థిగా తనను తాను తీర్చిదిద్దుకొంటూ దిలీప్‌ కుమార్‌ ఆయా పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన తీరు అజరామరం. దిలీప్‌ కుమార్‌ అంటేనే- వెండి తెరపై చెరగని సంతకం!

భారత చలన చిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం అనదగ్గ కాలానికి కొమ్ముకాసి, స్వీయ నటశేముషీ విభవంతో బంగారం లాంటి పాత్రలకు తావి అబ్బేలా చేసిన దిలీప్‌ కుమార్‌కు ఏనాడూ ప్రత్యామ్నాయం లేదు. విశాలమైన నుదురు, ఎటో చూస్తున్నట్లుండే నేత్రాలు, విషాదాన్ని ధ్వనింపజేసే మంద్ర స్థాయి స్వరం.. వాటికి జతపడిన విలక్షణ ఆహార్యంతో దిలీప్‌ కుమార్‌ ప్రేక్షక కోటిని విశేషంగా ఆకట్టుకొన్నారు. బాంబే టాకీస్‌ యజమానులు హిమాంశురాయ్‌, ఆయన భార్య దేవికారాణి 'జ్వార్‌భాటా' అనే చిత్రంలో నాయక పాత్రకు దిలీప్‌ కుమార్‌ను ఎంచుకోవడం- భారత సినీ పరిశ్రమలో ఓ సరికొత్త శకారంభానికి నాంది! హిందీ రచయిత భగవతి చరణ్‌ వర్మ యూసఫ్‌కు దిలీప్‌ కుమార్‌ అన్న తెరనామకరణం చెయ్యడంతో- రాజ్‌కపూర్‌, రాజ్‌కుమార్‌, అశోక్‌కుమార్‌, దేవానంద్‌ లాంటి వరిష్ఠులకు దీటైన నటనాయక ప్రస్థానం మొదలైంది.

అజాద్‌, నయాదౌర్‌, కోహినూర్‌లతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దిలీప్‌- 1960లో వచ్చిన 'మొఘల్‌ ఎ ఆజమ్‌'తో చరిత్ర సృష్టించారు. చిరాయువులనదగ్గ పది హిందీ చిత్రాల్ని ఎప్పుడు ఎంపిక చేసినా అందులో కనీసం మూడింట దిలీప్‌ నయనానందకర నట విన్యాసం ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టే 1991లో పద్మభూషణ్‌, 1995లో దాదాసాహెబ్‌ ఫాల్కే, 1998లో పాకిస్థాన్‌ ఉన్నత పురస్కారం నిషానే ఇంతియాజ్‌, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు కోరి వరించాయి. కార్గిల్‌ కొలిమి రగులుతున్న వేళ నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు నచ్చజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం దిలీప్‌ కుమార్‌ సాయం తీసుకొన్నదంటేనే- దాయాది దేశంలోనూ ఆ మహానటుడి పట్ల అభిమానం ఎంతగా పొంగులు వారుతోందో బోధపడుతుంది. అభిమాన జనకోటి గుండెల్లో 'ట్రాజెడీ కింగ్‌'గా దిలీప్‌ కుమార్‌... ఎప్పటికీ చిరంజీవి!

రచయిత - శైలజా చంద్ర

ఇవీ చూడండి:

దిలీప్ కుమార్ ప్రేమ కథలు- సైరాభానుతో పరిణయం ఇలా..!

Dilip Kumar: 'ట్రాజెడీ కింగ్'​ సినీ ప్రస్థానం సాగిందిలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.