ETV Bharat / opinion

ధరణి శ్వాసకోశానికి ముప్పు- ప్రమాదంలో వృక్షజాతులు - deforestation

భూమి మీద నివసించే ప్రతి జీవి అడవులపై ఆధారపడి జీవిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. 1990 నుంచి ఏటా 17.8 కోట్ల హెక్టార్ల చొప్పున అటవీ ప్రాంతం కోతకు గురవుతూ వస్తోందని ప్రపంచ అటవీ వనరుల అంచనా నివేదిక-2020 వెల్లడిస్తోంది. దేశ భూభాగంలో 33శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలని జాతీయ అటవీ విభాగం 1952నాటి నివేదికలో పేర్కొంది. మరి ప్రస్తుతం ఈ మేరకు అడవులున్నాయా? ఏ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి?

Special story on deforestation after industrialization
అడవుల క్షయీకరణ- ధరణి శ్వాసకోశానికి ముప్పు
author img

By

Published : Sep 16, 2020, 10:45 AM IST

అనాదిగా మానవాళి, జంతుజాలం అడవులపై ఆధారపడి మనుగడ సాగిస్తూ వచ్చాయి. నదుల పుట్టుకకు, అపారమైన సహజ వనరులకు అడవులే ఆలవాలం. జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలోనూ అడవులదే కీలకపాత్ర. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లమంది అటవీ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏటా అటవీ ఉత్పత్తుల విలువ 60 వేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని ప్రపంచబ్యాంక్‌ నివేదిక చాటుతోంది. భూతాపాన్ని పెంచే కర్బన ఉద్గారాలను 12 నుంచి 20 శాతానికి తగ్గించడంలో అడవుల పాత్ర ఎనలేనిది. భూమిపై లభిస్తున్న 40శాతం ప్రాణవాయువు వాటి నుంచే ఉత్పత్తి అవుతుంది. మానవాళికి ఇన్ని ప్రయోజనాలు కల్పిస్తున్న అడవుల విస్తీర్ణం నానాటికి తరిగిపోవడం అందరినీ కలచివేస్తున్న అంశం. పారిశ్రామికీకరణకు ముందు ప్రపంచంలో ఉన్న అటవీ విస్తీర్ణం 590 కోట్ల హెక్టార్లు. ప్రస్తుతం అది 406 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. ప్రపంచ అటవీ వనరుల అంచనా (2020) నివేదిక ప్రకారం 1990 నుంచి ఏటా 17.8 కోట్ల హెక్టార్ల చొప్పున అటవీ ప్రాంతం కోతకు గురవుతూ వస్తోంది. కనుక పారిశ్రామికీకరణ వంటి కారణాల వల్ల అడవులు విధ్వంసానికి గురికాకుండా కాపాడుకోవలసిన కనీస బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది!

క్షీణిస్తున్న విస్తీర్ణం

జాతీయ అటవీ విభాగం 1952నాటి నివేదిక ప్రకారం దేశ భూభాగంలో 33శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలి. ఎత్తయిన పీఠభూముల ప్రాంతాల్లో 60శాతం, మైదాన భూముల్లో 20శాతం కచ్చితంగా ఉండాలి. ఈశాన్య భారతం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, అండమాన్‌ నికోబార్‌ ప్రాంతాల్లో మాత్రమే విధాన లక్ష్యాలకు అనుగుణంగా అడవులు ఉన్నాయి. అదే 2019నాటి నివేదిక ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం 21.67 శాతం. అధికంగా అడవులు ఉన్న రాష్ట్రాల్లో మిజోరామ్‌(85.42శాతం), అరుణాచల్‌ ప్రదేశ్‌(79.63శాతం), మేఘాలయ(76.33శాతం), మణిపుర్‌(75.46శాతం), నాగాలాండ్‌(75.31శాతం) ముందున్నాయి. దక్షిణ భారతంలో కేరళ(54.42శాతం), తమిళనాడు(20.17శాతం), కర్ణాటక(20.11శాతం), తెలంగాణ(18.36శాతం), ఆంధ్రప్రదేశ్‌(17.88శాతం) ఉన్నాయి. అటవీ వినాశనం, విస్తరిస్తున్న పరిశ్రమలవల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెచ్చరిల్లుతున్నాయి. దీంతో భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇవే ధోరణులు కొనసాగితే 2100నాటికి అతిభయంకరమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుని సమస్త ప్రాణకోటి మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఈ విపత్తు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి పలుమార్లు ప్రపంచ సదస్సులను నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగమే పారిస్‌ వాతావరణ ఒప్పంద సదస్సు. 2015లో జరిగిన ఈ సదస్సు తీర్మానాల ప్రకారం, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వస్థాయికంటే రెండు డిగ్రీల సెంటిగ్రేడుకు తక్కువ ఉండేలా ప్రపంచ దేశాలు పట్టుదలతో కృషిచేయాలి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌ 2030 నాటికి 250కోట్ల నుంచి 300కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువుకు సమానమైన ఉద్గారాలను తగ్గించడానికి వీలుగా అటవీ విస్తరణ చేపట్టాల్సి ఉంది. అందుకు దేశంలో అటవీ విస్తీర్ణం 33శాతానికి చేరాలి. తాజా నివేదికల ప్రకారం ఉన్నది 21.67 శాతమే. అంటే నిర్దేశిత లక్ష్యాలకు బాగా వెనకబడి ఉన్నాం. 2015 నుంచి 2019నాటి అటవీ విస్తీర్ణం పెరుగుదల 0.33శాతమే నమోదైంది. మరో పదేళ్లలో 2030నాటికి దేశంలో అటవీ విస్తీర్ణం మరో 11.33శాతం పెరగాల్సి ఉంటుంది. జాతీయ అటవీ విస్తీర్ణం 24.56శాతమే ఉంది.

సంరక్షణ అందరి బాధ్యత

భారత్‌లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా అడవులు తరిగి, కొండలు చదునైపోతే వన్యప్రాణుల ఉనికి ప్రమాదంలో పడుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికమయ్యే క్రమంలో మంచు పర్వతాలు కరిగి, సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. ఫలితంగా తీరప్రాంతాలు ముంపుబారిన పడతాయి. వాతావరణ మార్పులు వర్షపాతంపై ప్రభావం చూపిస్తాయి. తుపానులు, వరదలు సంభవిస్తాయి. అధిక వర్షాలు, వరదలు నేల క్షయానికి కారణమవుతున్నాయి. అడవుల నరికివేత వల్ల ప్రాణవాయువు పరిమాణమూ తగ్గిపోతుంది. అందువల్లే విస్తారమైన అడవులను భూమికి ఊపిరితిత్తులుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అటవీ విస్తీర్ణం పెంపుదలపై దృష్టి సారించాలి. అభివృద్ధి పేరిట విపరీతమైన పారిశ్రామికీకరణ పెడధోరణులకు స్వస్తి పలకాలి. ప్రకృతి అందజేసే సహజ వనరులను పొదుపుగా, సమర్థంగావాడుకోవడానికి ప్రణాళికలు రచించాలి. అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి చేర్చాలన్న నిర్దేశిత లక్ష్య సాధనలో సామాన్య ప్రజలనూ భాగస్వాములను చేయాలి. పచ్చదనం పెంపుదల, హరితహారాల కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనప్పుడే రానున్న పర్యావరణ విపత్తు నుంచి ప్రజలు బయటపడగలుగుతారు!

Special story on deforestation after industrialization
ప్రమాదంలో వృక్ష జాతులు

ప్రమాదంలో వృక్ష జాతులు

దేశ భౌగోళిక నైసర్గిక స్వభావం, వివిధ శీతోష్ణ స్థితిగతులను అనుసరించి అడవులు సహజంగా పెరుగుతుంటాయి. వివిధ రకాల వన్యప్రాణులతోపాటు మానవ మనుగడకు తోడ్పడే అనేక వృక్షజాతులు, మరీ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కారకాలు (చెట్లు) ఉన్నాయి. అడవులు తరిగిపోతే ఎన్నో విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమల పశ్చిమభాగం, ఈశాన్య భారతం, అండమాన్‌-నికోబార్‌ ద్వీప ప్రాంతాల్లో ఉన్న ఉష్ణమండల సతత హరితారణ్యాలు అంతరిస్తే కలప, వెదురు, కెన్‌పామ్స్‌, నల్ల ఇరుకుడు చేవ, మంచిగంధం తదితర విలువైన వృక్షాలు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, మైకాల్‌, మహాదేవకొండలు, తూర్పుకనుమల్లోని కొండచరియలు శివాలిక్‌ ప్రాంతాల్లో ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు తరిగిపోతే కలప, మద్ది, సాల్‌, మంచిగంధం, వెదురు, చింతపండు, కుంకుళ్లు, జిగురు, తేనె, లక్క, కరక్కాయలు వంటి వనరులు దొరకడం గగనమవుతుంది. హిమాలయ, నీలగిరి, అన్నామలై ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పర్వత ప్రాంత అడవులు తగ్గితే క్రీడా సామగ్రికి వాడే మెత్తని కలపను నష్టపోతాం. రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, పంజాబ్‌, పశ్చిమ కనుమల్లో దొరికే చిట్టడవులు, ముళ్లపొదలు తరిగిపోతే బబూల్‌, రేగు, తుమ్మ, నాగజెముడు, బ్రహ్మజెముడు లాంటి చెట్ల జాతికి నష్టం కలుగుతుంది. గంగ, కృష్ణ, గోదావరి, మహానది, కావేరి డెల్టా ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మడ అడవులు అంతరించిపోతే పర్యావరణానికి తీవ్రహాని వాటిల్లుతుంది. మడ అడవులు తుపాను సమయాల్లో కెరటాల తాకిడి నుంచి తీరప్రాంత భూభాగాలను పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందువల్లే, వీటిని తీరరక్షక ప్రాంతాలుగా భారత ప్రభుత్వం ప్రకటించింది.

రచయిత- ఆచార్య నందిపాటి సుబ్బారావు, భూగర్భ రంగ నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.