ETV Bharat / opinion

కోళ్ల పరిశ్రమపై దుష్ప్రచారాలు- ఉపాధికి నష్టం

వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఒకటి నుంచి రెండు శాతానికే పరిమితం అవుతుంటే- ఎన్నో అవాంతరాల మధ్య కోళ్ల పరిశ్రమ గత నాలుగేళ్లుగా ఎనిమిది నుంచి 10 శాతం వృద్ధి కనబరుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్​లో ఉత్పత్తి, వినియోగ వృద్ధి నమోదవుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలలో బర్డ్‌ ఫ్లూ వ్యాపించటంతో గుడ్డు, చికెన్‌ వినియోగంపై దుష్ప్రచారం మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల్లో బర్డ్ ‌ఫ్లూ ఆనవాళ్లు లేకున్నా ప్రతికూల ప్రచారం కారణంగా దాదాపు 15 శాతం వరకూ వినియోగం తగ్గి ధరలు పడిపోయాయి.

author img

By

Published : Jan 19, 2021, 7:51 AM IST

Updated : Jan 19, 2021, 8:00 AM IST

social media affect on poultry industry in  india
కోళ్ల పరిశ్రమపై దుష్ప్రచారాలు-వృద్ధికి, ఉపాధికి నష్టం

దేశంలో వ్యవసాయ అనుబంధ విభాగాల్లో అత్యధిక వృద్ధి రేటు కనబరుస్తున్న వాటిలో కోళ్ల పరిశ్రమ ఒకటి. గత నాలుగు దశాబ్దాల్లో ప్రధాన వాణిజ్య పరిశ్రమగా రూపుదాల్చింది. వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఒకటి నుంచి రెండు శాతానికే పరిమితం అవుతుంటే- ఎన్నో అవాంతరాల మధ్య కోళ్ల పరిశ్రమ గత నాలుగేళ్లుగా ఎనిమిది నుంచి 10 శాతం వృద్ధి కనబరుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఇక్కడ ఉత్పత్తి, వినియోగ వృద్ధి నమోదవుతోంది. 2014 నాటికి గుడ్ల ఉత్పత్తిలో మనదేశం ఆరో స్థానంలో ఉండగా 2020 నాటికి మూడో స్థానానికి చేరింది. అదే సమయంలో చికెన్‌ ఉత్పత్తిలో 15వ స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ రంగంలో వేగవంతమైన వృద్ధి కనబరుస్తున్నా వినియోగంలో మాత్రం ప్రపంచ సగటుకు ఆమడ దూరంలో ఉన్నాం. 2015లో దేశీయ సగటు గుడ్డు వినియోగం ఏడాదికి 30 మాత్రమే కాగా, మాంసం వినియోగం 400 గ్రాములకు పరిమితమైంది. 2020 నాటికి గుడ్డు సగటు వినియోగం 68కి, కోడి మాంసం వినియోగం 3.5 కిలోలకు చేరింది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఏటా ఒక్కో వ్యక్తి సగటున 240 గుడ్లు, 20 కిలోల మాంసం తింటున్నారు. ప్రపంచ సగటు వినియోగం 190 గుడ్లు, 17 కిలోల మాంసంగా ఉంది.

భారత వైద్య పరిశోధన మండలి సూచనల ప్రకారం ప్రతి వ్యక్తి సంవత్సరానికి 180 గుడ్లు, 10.8 కిలోల మాంసం తినాలి. ప్రస్తుతం మన దేశంలో వినియోగం అందులో మూడో వంతు మాత్రమే ఉంది. తలసరి సగటు వినియోగం ఒక గుడ్డు పెరిగినా, 25 వేల మందికి అదనంగా ఉపాధి లభిస్తుందని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి. కోళ్ల పరిశ్రమ ద్వారా దేశంలో 16 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ స్థాయి దాదాపు రూ.80 వేల కోట్లకు మించింది. రైతులకు ఏటా సమకూరుతున్న ఆదాయంలో 12 శాతం కోళ్ల పెంపకం ద్వారానే వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 35 వేల మంది కోళ్ల రైతులు ఉంటే- మొత్తం ఈ పరిశ్రమ మీద ఆధారపడి రెండు రాష్ట్రాల్లో అయిదు లక్షల మంది జీవిస్తున్నారు.

ఏటా 10శాతం వృద్ధితో..

మన కోళ్ల పరిశ్రమ ప్రస్తుత ఉత్పాదక సామర్థ్యం అభివృద్ధి చెందిన దేశాలతో దాదాపు సమంగా ఉంది. గుడ్లు, బ్రాయిలర్‌ పరిశ్రమ ఏటా దాదాపు 10శాతం వృద్ధితో ముందుకు దూసుకెళ్తోంది. ప్రపంచంలో ఇదే అత్యధిక వృద్ధి రేటు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వినియోగం గరిష్ఠ స్థాయికి చేరిన పరిస్థితుల్లో అక్కడ వృద్ధి రేటుకు అవకాశాలు తక్కువే. మన దేశంలో వినియోగం ప్రపంచ స్థాయికన్నా తక్కువగా ఉన్న నేపథ్యంలో మరింత వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత వినియోగ రేటు మరో పదిశాతం పెరిగితే వచ్చే అయిదేళ్లలో ప్రపంచంలో ఉత్పత్తిలో రెండో స్థానానికి చేరుకుంటాం. దేశీయంగా కోళ్లు, గుడ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ముందు వరసలో నిలుస్తున్నాయి.

ప్రతికూల ప్రచారం

సామాజిక మాధ్యమాలలో ప్రతి చిన్న విషయానికీ పెద్ద ఎత్తున ప్రతికూల ప్రచారం జరుగుతుండటంతో కోళ్ల పరిశ్రమకు అపార నష్టం వాటిల్లుతోంది. కొన్ని రాష్ట్రాలలో బర్డ్‌ఫ్లూ వ్యాపించటంతో గుడ్డు, చికెన్‌ వినియోగంపై దుష్ప్రచారం మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాధికి సంబంధించి ఆనవాళ్లు లేకున్నా ప్రతికూల ప్రచారం కారణంగా విక్రయాలపై కొంతమేర ప్రభావం పడింది. దాదాపు 15 శాతం వరకూ వినియోగం తగ్గి ధరలు పడిపోయాయి. గత ఏడాది కొవిడ్‌ వ్యాప్తికి సంబంధించి గుడ్లు, చికెన్‌ వినియోగపై దుష్ప్రచారం సాగడంతో కోళ్ల పరిశ్రమ దాదాపు 25 వేల కోట్ల రూపాయల మేరకు నష్టపోయింది. ఆ సమస్య నుంచి కోలుకుంటున్న ప్రస్తుత సమయంలో బర్డ్‌ ఫ్లూపై ప్రచారం మరింత హాని తలపెట్టే ప్రమాదం ఉంది. దీనివల్ల పరిశ్రమకు నష్టం వాటిల్లడమే కాకుండా- వేల మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్న సంగతి అంతా గుర్తెరగాలి. ఇలాంటి దుష్ప్రచారాన్ని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగాలు మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బర్డ్‌ ఫ్లూ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ లక్షణాలు లేవని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి ప్రకటించారు. 70 డిగ్రీల ఉష్ణ్రోగతకన్నా అధిక వేడితో వండితే, ఆయా పదార్థాల్లో వైరస్‌ మిగిలి ఉండే అవకాశం లేదన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలదే.

-ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు

Last Updated : Jan 19, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.