ETV Bharat / opinion

లైంగిక విద్యపై తొలగని అపోహలు - చిన్నారులపై లైంగిక వేధింపులు

దేశంలో లైంగిక విద్యను మరింత సమ్మిళితంగా, సమగ్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని కొవిడ్‌ గుర్తుచేసింది. భారత్‌లో కొన్ని దశాబ్దాలుగా పెద్దయెత్తున సామాజిక పరివర్తన జరుగుతోంది. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు సరళీకృతమవుతున్నాయి. వాటికి ఆమోదనీయతా పెరుగుతోంది. అయినప్పటికీ లైంగిక విద్య విషయంలో చేయాల్సింది ఎంతో ఉంది.

sex education is still a mere illusion for many people in India
లైంగిక విద్యపై తొలగని అపోహలు
author img

By

Published : Dec 23, 2020, 7:16 AM IST

కొవిడ్‌ మహమ్మారి కారణంగా బడులు మూసివేయడం వల్ల లైంగిక విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ఉపాధ్యాయుడు- విద్యార్థి పరస్పర బోధన, తరగతి గదిలో బృంద చర్చ వంటివన్నీ నిలిచిపోయాయి. విద్యార్థులు ఇళ్లకు పరిమితం కావడంలో ఒత్తిడికి లోను కావడం, ఆన్‌లైన్‌ పాఠాల కోసం ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలకు కళ్లప్పగించి అతుక్కునిపోవడం కొనసాగుతోంది. తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, మాట్లాడటం వంటివేమీ లేకుండా పోయాయి. ఆన్‌లైన్‌లో ఎక్కువ కాలం గడిపే విద్యార్థుల్లో సైబర్‌ గిల్లికజ్జాలు, అంతర్జాల వేధింపుల ముప్పు పెరిగింది. అంతర్జాలంతో చాలా ఎక్కువగా అనుసంధానం కలిగి ఉండే ప్రస్తుత సమయంలో మహమ్మారి కారణంగా ఇంటి వద్దే సాగే చదువుల వల్ల దృక్పథాల్లో, పద్ధతుల్లో మార్పులు రావాల్సిన, సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అప్పుడే లైంగిక విద్య నిజంగా సమ్మిళితంగా, ప్రగతిశీలంగా, లింగసమానతతో పరిఢవిల్లుతుంది.

అవగాహన లేమితో వేధింపుల ముప్పు

సరైన లైంగిక విద్య లేకపోవడం వల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు ఆస్కారం పెరుగుతోంది. సమ్మతి, ఉల్లంఘన, అత్యాచారం వంటి అంశాల మధ్య తేడాను చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యునిసెఫ్‌, ప్రయాస్‌ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం- అయిదు నుంచి పన్నెండేళ్ల వయసున్న చిన్నారుల్లో 53 శాతం లైంగిక వేధింపులకు గురైనట్లు తేలడం దిగ్భ్రాంతికి గురిచేసే అంశం. చాలా కేసుల్లో నిందితులు బాధితుల సన్నిహిత బంధువులే కావడం గమనార్హం. ఇందులో సగానికిపైగా కేసులు బయటికి రాకుండా మగ్గిపోతున్నాయి. భారత్‌లో లైంగిక విద్య అంటే యుక్తవయసు గర్భధారణలు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వంటి అంశాలకు పర్యాయపదంగా మారిపోయింది. రుతుక్రమం అంశాన్నీ నిర్దిష్టంగా అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇందులో మరో సమస్య ఏమిటంటే- దేశంలో ఇప్పటికీ ఎన్నో పాఠశాలలు, విద్యాసంస్థల్లోని పాఠ్యప్రణాళికల్లో ఎలాంటి లైంగిక విద్యాంశాలనూ చేర్చలేదు. 'లైంగిక, పునరుత్పత్తి హక్కుల కోసం యువ సమాఖ్య' అనే సంస్థ నివేదిక ప్రకారం చాలా వరకు రాష్ట్ర బోర్డులకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని పాఠ్య ప్రణాళికల్లో లైంగిక విద్య అంశాలు లేవని తేలింది.

తొలగని భయాలు...

భారత ప్రభుత్వం 2007లో జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ, యునిసెఫ్‌ సాయంతో కౌమార విద్యా కార్యక్రమాన్ని (ఏఈపీ) తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం- చిన్నారుల్లో ఆరోగ్యకరమైన ఆలోచనా ధోరణులను ప్రోత్సహించడం, నిజజీవిత పరిస్థితులకు సానుకూల ధోరణిలో ప్రతిస్పందించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా సాధికారత కల్పిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది చాలా రాష్ట్రాల్లో సరిగ్గా అమలు కాలేదు. సామాజికంగా సాంస్కృతికంగా సునిశిత అంశాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నా- సెక్స్‌, సెక్సువాలిటీ అంశాలపై గూడుకట్టుకున్న భయాలేవీ తొలగిపోలేదని దీన్నిబట్టి అర్థమవుతోంది.

జాతీయ ఆరోగ్య విధానం-2020 శారీరక ఆరోగ్యం, లైంగిక సునిశితత్వం అవసరాల్ని ప్రస్తావించినా, కౌమార లైంగిక విద్యపై అంతగా దృష్టి సారించలేదు. ఈ విషయంలో పెద్ద సంఖ్యలో శిక్షకులను తీర్చిదిద్దాలి. దీనివల్ల ప్రజలు తేలికగా అర్థం చేసుకోగలిగేలా సమగ్ర లైంగిక విద్యను అందించే దిశగా అడుగులు పడే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా ఇది కౌమార వయస్కులకు చాలా ఉపయుక్తం. వీరికోసం సంపూర్ణ, స్వీయఅభివృద్ధి, ఆటపాటలతో కూడిన కార్యక్రమాన్ని రూపొందించాలి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా డిజిటల్‌ మీడియా, వెబ్‌ ఆధారిత ఇంటర్‌ఫేస్‌లను కూడా లైంగిక విద్య కోసం ఉపయోగించడం శ్రేయస్కరం. లైంగిక విద్యను అందించేవారు యువతతో నేరుగా అనుసంధానమయ్యేందుకు ఈ మాధ్యమాలు తోడ్పడతాయి. వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలు, వెబ్‌సైట్లు, మెసేజ్‌ యాప్‌లు, సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కూడా ఈ దిశగా కృషి చేయవచ్చు.

రచయిత- డాక్టర్‌ నీలేశ్‌ పాటిల్, (భారత కుటుంబ నియంత్రణ సంఘంలో టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌).

ఇదీ చదవండి:కశ్మీర్​లో గుప్కార్​ గుబాళింపు- జమ్మూలో భాజపా హవా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.