ETV Bharat / opinion

హైపర్ ‌సోనిక్‌ సాంకేతికతతో గగనసీమలోనూ స్వావలంబన! - గగనసీమలోనూ స్వావలంబన

అమెరికా 2004లో ఎక్స్‌ 43ఎ విమానాన్ని మాక్‌ 6.6 వేగంతో నడిపింది. రెండోసారి ఎక్స్‌ 43ఎని 9.6 మాక్‌ వేగంతో నడిపారు. ఇంతవరకు ఈ రికార్డును ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ వేగంతో న్యూయార్క్‌ నుంచి బయలుదేరే ఎక్స్‌ 43ఎ, గంటలోనే టోక్యో చేరగలదు. విమానాలతోపాటు క్షిపణుల ప్రయోగానికీ తోడ్పడే శ్క్రామ్‌ జెట్‌ సాంకేతికతను మొదట అమెరికా, తరవాత రష్యా, చైనాలు అందిపుచ్చుకోగా, తాజాగా భారత్‌ సగర్వంగా వాటి సరసకు చేరింది.

Self-reliance in space with hypersonic technology!
హైపర్‌సోనిక్‌ సాంకేతికతతో గగనసీమలోనూ స్వావలంబన!
author img

By

Published : Sep 14, 2020, 6:41 AM IST

భూమిమీద నుంచి గాలిలోకి లేచి ఎకాయెకి అంతరిక్షంలోకి దూసుకెళ్లి, పని పూర్తయ్యాక నేలకు తిరిగి రాగల ఏరోస్పేస్‌ విమానాన్ని రూపొందించాలని మానవుడి చిరకాల కల. ఆ స్వప్నాన్ని నిజం చేసుకోవడానికి అమెరికా దశాబ్దాల నుంచి ప్రయత్నిస్తోంది. 'అమెరికాలోని డలెస్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి, శబ్ద వేగానికి 25 రెట్లు ఎక్కువ వేగంతో సమీప భూకక్ష్యను చేరి, అక్కడి నుంచి కేవలం రెండు గంటల్లో టోక్యో విమానాశ్రయంలో దిగగల విమానాన్ని రూపొందించాలని లక్షిస్తున్నాం' అని 1986లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించారు. ధ్వని గంటకు 767 మైళ్ల (1,236 కిలోమీటర్ల) వేగంతో పయనిస్తుంది. దీన్ని ఒక 'మాక్‌'గా వ్యవహరిస్తారు. అంతకన్నా ఎక్కువ వేగాన్ని సూపర్‌ సోనిక్‌ వేగంగా, ధ్వనికన్నా అయిదు రెట్లకు మించిన వేగాన్ని హైపర్‌ సోనిక్‌గా వ్యవహరిస్తారు. ఇంత వేగాన్ని అందుకోవాలంటే సూపర్‌ సోనిక్‌ కంబశ్చన్‌ ర్యామ్‌ జెట్‌ (శ్క్రామ్‌ జెట్‌) ఇంజిన్‌ అవసరం. టర్బో జెట్‌, ర్యామ్‌ జెట్‌, శ్క్రామ్‌ జెట్‌ ఇంజిన్లు పొడవాటి గొట్టంలా ఉంటాయి. ఈ గొట్టం మొదట్లో వెడల్పుగా ఉండి, గాలిని వేగంగా లాక్కుంటుంది. గొట్టం మధ్య భాగం సన్నగా ఉండి, ఈ గాలిలోకి ఇంధనాన్ని కలిపి మండించగా వచ్చే వాయువును వెనుక భాగం నుంచి విపరీతమైన వేగంతో బయటకు వదులుతుంది. అదే విమానాన్ని ముందుకు నెడుతుంది. టర్బో జెట్‌, ర్యామ్‌ జెట్లలో జరిగేది ఇదే. ర్యామ్‌జెట్లు పీల్చుకునే గాలిని ధ్వనికన్నా తక్కువ వేగానికి కంప్రెస్‌ చేసి, ఇంధనాన్ని కలిపి మండించి, సూపర్‌ సోనిక్‌ వేగంతో విమానాన్ని ముందుకు నెడతాయి. శ్క్రామ్‌ జెట్‌ ధ్వనిని మించిన సూపర్‌ సోనిక్‌ వేగంతో గాలిని తీసుకుని అదే వేగంతో బయటకు వదలడం ద్వారా విమానాన్ని లేదా క్షిపణిని హైపర్‌ సోనిక్‌ వేగంతో ముందుకు నెడుతుంది. ర్యామ్‌ జెట్లు 3 మాక్‌ నుంచి 5 మాక్‌ వరకు వేగాన్ని అందిస్తే, శ్క్రామ్‌ జెట్‌ 5 మాక్‌ను మించిన వేగంతో విమానాన్ని ముందుకు నెడుతుంది.

దేశీయంగా అభివృద్ధి

అమెరికా 2004లో ఎక్స్‌ 43ఎ విమానాన్ని మాక్‌ 6.6 వేగంతో నడిపింది. అది ప్రపంచంలోనే మొట్టమొదటి హైపర్‌ ప్లేన్‌. రెండోసారి ఎక్స్‌ 43ఎని 9.6 మాక్‌ వేగంతో నడిపారు. ఇంతవరకు ఈ రికార్డును ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ వేగంతో న్యూయార్క్‌ నుంచి బయలుదేరే ఎక్స్‌ 43ఎ, గంటలోనే టోక్యో చేరగలదు. విమానాలతోపాటు క్షిపణుల ప్రయోగానికీ తోడ్పడే శ్క్రామ్‌ జెట్‌ సాంకేతికతను మొదట అమెరికా, తరవాత రష్యా, చైనాలు అందిపుచ్చుకోగా, తాజాగా భారత్‌ సగర్వంగా వాటి సరసకు చేరింది. ఒక క్షిపణి లేదా విమానం హైపర్‌ సోనిక్‌ వేగంతో పయనించేటప్పుడు విపరీతమైన గాలి రాపిడినీ, 2,500 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిని తట్టుకోగల మెటీరియల్‌ను డీఆర్‌డీఓకు చెందిన ‘ఆర్మమెంట్‌ అండ్‌ కాంబాట్‌ ఇంజినీరింగ్‌ క్లస్టర్‌’ (పుణే) రూపొందించింది. శ్క్రామ్‌ జెట్‌, హైపర్‌ ప్లేన్ల తయారీకి కావలసిన ఇతర సాంకేతికతలనూ ఇస్రో, డీఆర్‌డీఓలు స్వయంగా సమకూర్చుకున్నాయి.

భూకక్ష్యకు చేరువగా...

హైపర్‌ సోనిక్‌ క్షిపణులు మన భూభాగం మీదకు దూసుకొచ్చే శత్రు క్షిపణులను క్షణాల్లో తుత్తునియలు చేయగలవు. అలాగే శత్రువును మెరుపుదాడితో దిమ్మెరపోయేట్లూ చేస్తాయి. రష్యాతో కలసి భారత్‌ తయారుచేసిన సూపర్‌ సోనిక్‌ బ్రహ్మోస్‌ క్షిపణికి శ్క్రామ్‌ జెట్‌ అమర్చి హైపర్‌ సోనిక్‌ క్షిపణిగా తీర్చిదిద్దాలని భారత్‌ యోచిస్తోంది. బ్రహ్మోస్‌ ప్రస్తుతం 2.8 మాక్‌ వేగాన్ని అందుకోగలదు. హైపర్‌ సోనిక్‌ క్షిపణిగా మారితే 5 మాక్‌కు మించిన వేగంతో శత్రు లక్ష్యాలపై పడి ధ్వంసం చేయగలదు. శ్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌ అమర్చిన హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ ప్రయోగాత్మక రాకెట్‌ (హెచ్‌ఎస్‌టీడీవీ)తో సమీప భూకక్ష్యలోకి ఉపగ్రహాలనూ ప్రయోగించవచ్ఛు శ్క్రామ్‌ జెట్‌ పీల్చుకునే గాలిలో ఆక్సిజన్‌ను మండించడం ద్వారా రాకెట్‌ ముందుకు కదులుతుంది. అంతరిక్షంలో గాలీ ఉండదు, ఆక్సిజనూ ఉండదు కాబట్టి హెచ్‌ఎస్‌టీడీవీ భూకక్ష్యను దాటి వెళ్లలేదు. ఈ హైపర్‌ సోనిక్‌ రాకెట్లను పునర్వినియోగార్హంగా మార్చినట్లయితే, మళ్లీ మళ్లీ సమీప భూకక్ష్యలోకి పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించవచ్ఛు అలాగే హైపర్‌ సోనిక్‌ క్షిపణిని కక్ష్యలో పేల్చి శత్రు ఉపగ్రహాలనూ నాశనం చేయవచ్ఛు కాబట్టి శ్క్రామ్‌ జెట్‌ సాంకేతికత పౌర, సైనిక ప్రయోజనాలు రెండింటినీ అమోఘంగా నెరవేర్చగలదు.

కిందటి సంవత్సరం చైనా జాతీయ సైనిక కవాతులో హైపర్‌ సోనిక్‌ డీఎఫ్‌ 17 క్షిపణిని సగర్వంగా ప్రదర్శించుకున్నది. తానేమీ తక్కువ తినలేదంటూ భారత్‌ తాజాగా హైపర్‌ సోనిక్‌ రాకెట్‌ను సగర్వంగా ప్రయోగించింది. ఈ హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ ప్రయోగాత్మక రాకెట్‌ (హెచ్‌ఎస్‌టీడీవీ)ని అయిదేళ్లలో ఆయుధంగా మార్చడానికి భారత్‌ సన్నాహాలు చేసుకొంటోందని తెలుస్తోంది. శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థకు అందకుండా అపార వేగంతో దూసుకెళ్లి విధ్వంసం సృష్టించే సత్తా హైపర్‌ సోనిక్‌ క్షిపణులు, విమానాలకు ఉంటుంది కాబట్టి, ఈ రంగంలో పైచేయి సాధించడానికి ప్రధాన దేశాలు పోటీపడుతున్నాయి. ఈ పోటీలోకి భారత్‌ కూడా ఉరికింది.

శత్రు భీకర క్షిపణులు

Self-reliance in space with hypersonic technology!
శత్రు భీకర క్షిణపులు

శబ్ద వేగంకన్నా 6.5 రెట్లు ఎక్కువ వేగం... అంటే 6.5 మాక్‌తో పయనించే హైపర్‌ సోనిక్‌ క్షిపణి ఒకే ఒక్క నిమిషంలో 73 మైళ్ల దూరం పయనిస్తుంది. ఈ లెక్కన 700 మైళ్ల దూరంలోని శత్రు లక్ష్యాన్ని కేవలం 10 నిమిషాల్లో ఛేదించగలదన్నమాట. ఇంతటి కీలకమైన సాంకేతికతను స్వయంగా అభివృద్ధి చేసుకోవడానికి భారత్‌ చాలాకాలం నుంచి కృషి చేస్తోంది. 2016 ఆగస్టు 28న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మొదటిసారి ఒక రాకెట్‌ను శ్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌తో ప్రయోగించింది. రెండోసారి- 2019 జూన్‌ 12న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఒక మానవ రహిత విమానాన్ని ఈ ఇంజిన్‌తో ప్రయోగించింది. అయితే, అది ఆశించిన ఎత్తును అందుకోలేకపోయిందని తెలిసింది. తాజాగా ఈ సెప్టెంబరు 7న డీఆర్‌డీఓ శ్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌ అమర్చిన హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ ప్రయోగాత్మక రాకెట్‌ (హెచ్‌ఎస్‌టీడీవీ)ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ మానవ రహిత రాకెట్‌ కిరోసిన్‌ ఇంధనంతో ధ్వని కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగంతో పయనించింది. దీనికి అగ్ని క్షిపణిలోని ఘన ఇంధన మోటారును ఉపయోగించారు. అగ్ని రాకెట్‌ హెచ్‌ఎస్‌టీడీవీని 30 కి.మీ.ఎత్తుకు తీసుకెళ్లిన తరవాత, క్రూయిజ్‌ భాగం విడివడి, అందులోని శ్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌ సూపర్‌ సోనిక్‌ వేగంతో గాలిని పీల్చుకుని 6 మాక్‌ల హైపర్‌ సోనిక్‌ వేగాన్ని అందుకుంది. దీనితో మున్ముందు హైపర్‌ సోనిక్‌ క్షిపణులు, అధునాతన అంతరిక్ష వాహనాల తయారీ సుసాధ్యం కానున్నది.

- ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.