ETV Bharat / opinion

మహమ్మారుల ముట్టడి.. పరిశోధనలతోనే అడ్డుకట్ట

కొవిడ్ మహమ్మారి లాగానే.. జంతువుల నుంచి మరెన్నో వైరస్‌లు మానవులకు సోకుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జంతువుల ద్వారా సోకే దాదాపు 10 రకాల వైరస్‌లు మానవాళికి మహమ్మారులుగా పరిణమించవచ్చని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. నిపా, జికా వైరస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

covid
కరోనా కుటుంబం
author img

By

Published : Jul 19, 2021, 7:01 AM IST

ప్రపంచమంతటా జన జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి వ్యాపించిందని పరిశోధనల్లో తేలింది. జంతువుల నుంచి మరెన్నో వైరస్‌లు మానవుల మీద దాడికి కాచుకుని ఉన్నాయి. జంతువుల ద్వారా సోకే దాదాపు 10 రకాల వైరస్‌లు మానవాళికి మహమ్మారులుగా పరిణమించవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. కేరళలో కనిపించిన నిపా, జికా వైరస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

నిపా, జికా..

జికా వైరస్‌కు కారకమైన ఏడిస్‌ ఈజిప్టి దోమ ద్వారానే డెంగీ, చికున్‌గన్యా వ్యాధులూ వ్యాపిస్తాయి. జికా వైరస్‌ సోకిన వారిలో జ్వరం, కండరాల నొప్పి, దద్దుర్ల వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. జికా బారిన పడిన గర్భవతులకు పిల్లలు చాలా చిన్న తలలతో జన్మిస్తారు. ఈ వైరస్‌ వల్ల మృతశిశు జననం, నెలలు నిండకముందే పుట్టడం కూడా సంభవించవచ్చు. ఇలా జన్మించిన పిల్లలకు అంధత్వం సంప్రాప్తించే ప్రమాదం ఉంది. జికా వైరస్‌కు టీకాలు, మందులు లేవు. జ్వరం, ఒళ్లు నొప్పులకు పారాసెటమాల్‌ మాత్రలు వాడటం, బాగా నీరు తాగడం వంటి చిట్కాలే శరణ్యం. ఈ జులై 15 నాటికి కేరళలో 28 జికా వైరస్‌ కేసులు నమోదవగా, అందులో ముగ్గురు గర్భిణులు ఉన్నారు. జికా వైరస్‌ తమ రాష్ట్రానికి వ్యాపించకుండా కర్ణాటక జాగ్రత్తపడుతోంది. 2018లో కేరళలో తలెత్తిన నిపా వైరస్‌ కూడా చాలా ప్రమాదకరమైంది. ఈ వైరస్‌ సోకినవారిలో దాదాపు 75శాతం ప్రజలు మరణానికి చేరువయ్యే అవకాశం ఉంది.

1998లో తొలిసారి వెలుగుచూసిన నిపా వైరస్‌ తరచూ ఆగ్నేయాసియా దేశాల్లో ప్రత్యక్షమవుతోంది. నిపా వైరస్‌ మెదడువాపును కలిగించి రోగిని కోమాలోకి నెడుతుంది. పందులు, గబ్బిలాల ద్వారా ఈ వైరస్‌ మానవులకు సోకుతుంది. ఇది కూడా దగ్గు, తుమ్ముల ద్వారా విస్తరిస్తుంది. కేరళలో ప్రజారోగ్య యంత్రాంగం చాలా పటిష్ఠంగా ఉన్నందువల్ల నిపా కేసులను వేగంగా గుర్తించి వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగారు.

ఆటపట్టు ఆఫ్రికా

ఆఫ్రికా ఖండ పశ్చిమ భాగం అనేక ప్రాణాంతక వ్యాధులకు నెలవుగా మారింది. వీటిలో మొదట చెప్పుకోవలసింది ఎబోలా మహమ్మారి గురించి. ఈ వైరస్‌ మూలం ఏమిటో శాస్త్రజ్ఞులు ఇంతవరకు నిర్ధారించలేకపోయారు. బహుశా గబ్బిలాలు, కోతుల నుంచి మానవులకు వ్యాపిస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వైరస్‌ సోకినవారిలో దాదాపు సగంమంది మృత్యువాత పడుతున్నారు. 1976లో కాంగోలో దీన్ని మొట్టమొదటిసారి కనుగొన్నప్పటి నుంచి అనేక పశ్చిమాఫ్రికా దేశాల్లో తరచూ ఎబోలా కేసులు విజృంభించాయి. మెర్క్‌ కంపెనీ తయారుచేసిన ఎర్వెబో టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతితో 2020 ఫిబ్రవరి నుంచి ఈ వ్యాధికి వాడుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లోనూ ఎర్వెబో టీకాకు అనుమతి లభించింది.

2021 ఫిబ్రవరి వచ్చేసరికి ప్రపంచం ఒకవైపు కొవిడ్‌తో పోరాడుతుంటే- మరోవైపు కాంగో, గినియా దేశాల్లో మళ్ళీ ఎబోలా కేసులు తలెత్తాయి. ఎర్వెబోతో పాటు జాన్సన్‌ సంస్థ టీకాకూడా అందుబాటులో ఉన్నా కాంగోలో సాయుధ ముఠాల హింసాకాండ, అరకొర ఆస్పత్రి వసతుల వల్ల టీకా కార్యక్రమం ముందుకు సాగడం లేదు. పశ్చిమాఫ్రికా దేశాలు పేదరికం వల్ల ఎబోలాపై సమర్థంగా పోరాడలేకపోతున్నాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉంటే, అవి మహమ్మారులపై పోరుకు అడ్డువస్తాయని ఎబోలా అనుభవం తెలుపుతోంది. ఎబోలా వైరస్‌ కుటుంబానికి చెందిన మార్బర్గ్‌ వ్యాధి సోకినవారిలో దాదాపు 90శాతం రోగులు మరణిస్తారు. ఆఫ్రికాలోని అంగోలా, ఉగాండా దేశాలలో ఈ వ్యాధి తొలిసారి కనిపించింది.

ఎబోలా, మార్బర్గ్‌ వైరస్‌లు సోకినవారు రక్తస్రావ జ్వరం, విరేచనాలు, అవయవ వైఫల్యంతో చనిపోతారు. ఎబోలాకు రెండు టీకాలు అందుబాటులోకి వచ్చినా మార్బర్గ్‌ వ్యాధికి టీకాలను, మాత్రలను కనుక్కోలేదు. ఇది మహా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది కూడా గబ్బిలాల నుంచే వ్యాపించవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఎబోలా, మార్బర్గ్‌ వైరస్‌ల మాదిరిగా లస్సా జ్వరం కూడా తీవ్ర రక్తస్రావానికి, కాలేయ, ప్లీహ, మూత్రపిండ వైఫల్యానికి దారితీస్తుంది. ఆఫ్రికాలో మాత్రమే కనిపించే మాస్టోమైస్‌ ఎలుకలు తాకిన గృహోపకరణాల ద్వారా లస్సా వైరస్‌ మానవులకు సోకుతుంది. ఎలుకల మలమూత్రాల నుంచి ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. లస్సా జ్వరం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఏటా దాదాపు మూడు లక్షల మందిని వేధిస్తోంది. వారిలో దాదాపు 15శాతం మరణిస్తున్నారు.

వ్యాప్తికి కారణాలెన్నో...

ఆసియా, ఆఫ్రికా, దక్షిణ ఐరోపా దేశాల్లో కనిపించే క్రిమియన్‌-కాంగో రక్తస్రావ జ్వరం పశువులు, గొర్రెలను పట్టుకొని ఉండే పేను లాంటి పిణుజుల ద్వారా మానవులకు సోకుతుంది. ఇప్పుడు ఈ జ్వరం అఫ్గానిస్థాన్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. ఆఫ్రికాలో 2000 సంవత్సరం నుంచి విరుచుకుపడుతున్న రిఫ్ట్‌ వ్యాలీ జ్వరానికీ దోమలే కారకాలు. వాతావరణంలో వేడి పెరిగిన కొద్దీ ఈ జ్వరం మహమ్మారిలా మారి ప్రపంచంపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఒకప్పుడు ఆఫ్రికాలో మాత్రమే కనిపించిన మర్కట మశూచికం పెంపుడు కోతుల రవాణా, పెరిగిన విమాన ప్రయాణాల ద్వారా అమెరికా, ఐరోపాలకూ వ్యాపించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, వాతావరణ మార్పులు, పట్టణాల విస్తరణకు తోడు జంతువులతో మానవ సాన్నిహిత్యం పెరిగిన కొద్దీ రకరకాల మహమ్మారులు విరుచుకుపడతాయి. జంతు వైరస్‌ల వల్ల కలిగే లక్షణాలను ముందుగానే గుర్తించి వేగంగా స్పందిస్తే మహమ్మారులను అడ్డుకోవచ్చు.

కరోనా కరాళ నృత్యం

గడచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి తీరని హాని కలిగించిన మూడు రకాల కరోనా వైరస్‌లలో ఒకటి- సార్స్‌ వైరస్‌ కాగా, రెండోది మెర్స్‌ వైరస్‌, మూడోది ఇప్పుడు వికట నర్తనం చేస్తున్న కొవిడ్‌ కారక సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌. మెర్స్‌ కేసులు తొలిసారి 2012లో సౌదీ అరేబియాలో వెలుగు చూశాయి. శ్వాసకోశంపై దాడి చేసే మెర్స్‌ వైరస్‌ రోగిలో తీవ్రమైన దగ్గు, ఆయాసం కలిగిస్తుంది. రోగికి బాగా సన్నిహితంగా మెలిగేవారికీ ఈ వైరస్‌ సోకుతోంది. దీని నియంత్రణకు రెండు టీకాలు రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలు జరుపుకొంటున్నాయి. అవి కొవిడ్‌ నియంత్రణకు పనికొస్తాయా అని పరిశోధనలు జరుపుతున్నారు. 2003లో 37 దేశాల్లో దాదాపు 8,273 మందికి సోకి 775 మంది మరణాలకు కారణమైన సార్స్‌ వ్యాధి సైతం కరోనా వైరస్‌ కుటుంబం నుంచే ఉత్పన్నమైంది. ఈ వైరస్‌ కూడా దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రస్తుతానికి సార్స్‌ వైరస్‌ సద్దుమణిగినా, రేపు ఎప్పుడైనా అది మళ్ళీ విజృంభించే ప్రమాదం లేకపోలేదు.

- కైజర్‌ అడపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.