ETV Bharat / opinion

దళితులకు దిక్సూచి.. రాజకీయ సవ్యసాచి పాసవాన్​

author img

By

Published : Oct 11, 2020, 7:17 AM IST

బిహార్‌లో దళిత కులం నుంచి వచ్చి రాజకీయాల్లో వరుస విజయాలను సాధించిన నాయకుడు రాం విలాస్ పాసవాన్​ తప్ప మరొకరు లేరు. ప్రజల మనసును ముందే గుర్తించి, తన రాజకీయ వ్యూహాలకు తదనుగుణంగా పదునుపెట్టుకుంటూ వరుస విజయాలు సాధించిన రాజకీయ చతురుడు ఆయన. గడచిన 50 ఏళ్ల ఆయన రాజకీయ జీవితం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. బిహార్‌ జనాభాలో దళితులు 16 శాతం కాగా, అందులో 5 శాతం పాసవాన్​‌ కులస్థులే. వారు ఆయన్ను ఆకాశంతో పోలుస్తుంటారు. ‘ఊపర్‌ ఆస్మాన్‌, నీఛే పాసవాన్​‌’ అన్నది వారి నినాదం. పైన ఆకాశం, నేల మీద పాసవాన్​‌ అని దాని అర్థం. మన పొలాలను తడిపే వర్షాల కోసం ఆకాశం మీద ఆధారపడినట్లు, మన శ్రేయస్సు కోసం పాసవాన్​‌ మీద ఆధారపడవచ్చని ఆయన మద్దతుదారులు నమ్ముతారు.

ram vilas paswan is the only succesfull dalit leader in bihar
దళితులకు దిక్సూచి రాజకీయ సవ్యసాచి

రాం విలాస్‌ పాసవాన్​‌ను కేవలం దళిత నాయకుడిగా చూడటం సరికాదు. తన రాజకీయాలకు బీఆర్‌ అంబేడ్కర్‌ నుంచి ప్రేరణ పొందిన పాసవాన్​‌- దళితులకే పరిమితం కాకుండా మొదటి నుంచీ అన్ని కులాలు, మతాలకు సంబంధించిన నాయకుడిగా నిలవడానికే కృషిచేశారు. ఆ విధంగా దీర్ఘకాలం అధికార పదవులు నిర్వహించగలిగారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరవాత పాసవాన్​‌ దళిత సేనను స్థాపించారు. అందులో సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. అయితే, కాలక్రమంలో ఆయన దళితుల్లో సొంత కులమైన దుసఢ్‌ అంటే పాసవాన్​‌ కులానికి ప్రధాన ప్రతినిధిగా నిలిచారు. బిహార్‌ జనాభాలో దళితులు 16 శాతం కాగా, అందులో 5 శాతం పాసవాన్​ కులస్థులే. వారు ఆయన్ను ఆకాశంతో పోలుస్తుంటారు. 'ఊపర్‌ ఆస్మాన్‌, నీఛే పాసవాన్​‌' అన్నది వారి నినాదం. పైన ఆకాశం, నేల మీద పాసవాన్​‌ అని దాని అర్థం. మన పొలాలను తడిపే వర్షాల కోసం ఆకాశం మీద ఆధారపడినట్లు, మన శ్రేయస్సు కోసం పాసవాన్​ మీద ఆధారపడవచ్చని ఆయన మద్దతుదారులు నమ్ముతారు.

రాజకీయ ప్రస్థానమిదీ...

రాంవిలాస్‌ పాసవాన్​‌ 1960లలో సంయుక్త సోషలిస్టు పార్టీ (ఎస్‌ఎస్‌పీ) సభ్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికి ఆయన వయసు 23 ఏళ్లే. బిహార్‌లోని అలౌలి నియోజక వర్గం నుంచి 1969 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు. మృదుభాషి అయిన పాసవాన్​‌ లోక్‌సభకు తొమ్మిదిసార్లు పోటీ చేసి ఎనిమిదిసార్లు నెగ్గారు. ఆయన ఒక్క హాజీపూర్‌ నుంచే ఎనిమిదిసార్లు పోటీచేశారు. తొమ్మిదోసారి, 1991లో రోసెరా నుంచి పోటీచేశారు. పాసవాన్​‌ రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చివరకు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా తనువు చాలించారు. 2000 సంవత్సరంలో జనతాదళ్‌ నుంచి బయటికొచ్చి లోక్‌ జనశక్తి పార్టీని స్థాపించారు.

బిహార్‌లో దళిత కులం నుంచి వచ్చి రాజకీయాల్లో వరుస విజయాలను సాధించిన నాయకుడు పాసవాన్​‌ తప్ప మరొకరు లేరు. ప్రజల మనసును ముందే గుర్తించి, తన రాజకీయ వ్యూహాలకు తదనుగుణంగా పదునుపెట్టుకుంటూ వరుస విజయాలు సాధించిన రాజకీయ చతురుడు ఆయన. గడచిన 50 ఏళ్ల ఆయన రాజకీయ జీవితం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పాసవాన్​‌ ఒకసారి నాతో ఇలా అన్నారు-'నా రాజకీయ అంచనా ఒకే ఒకసారి తప్పింది. 2009 ఎన్నికల్లో తప్పుడు అంచనా వల్ల ఓడిపోవాల్సి వచ్చింది.' పలు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్లుగా వెల్లడించే పాసవాన్​‌ వరుసగా ఆరుగురు ప్రధానమంత్రుల హయాంలో మంత్రి పదవులను నిర్వహించారు. వీపీ సింగ్‌, హెచ్‌.డి.దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌, ఏబీ వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీ- అందరూ పాసవాన్​కు మంత్రి పదవులు ఇచ్చి సత్కరించినవారే. మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉంటూనే పాసవాన్​‌ బిహార్‌ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేవారు. రాష్ట్రంలో 15 ఏళ్ల లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాలనకు 2005లో చరమ గీతం పాడటంలో పాసవాన్​‌ హస్తం ఉంది. లాలూ స్థానంలో నీతీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కావడానికీ తోడ్పడ్డారు. నిజానికి 2004 లోక్‌సభ ఎన్నికల్లో లాలూ, పాసవాన్​‌ ఇద్దరూ యూపీఏ ఛత్రం కిందే పోరాడారు. ఆ ఎన్నికల్లో యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు పాసవాన్​‌ తనకు రైల్వే శాఖ కావాలన్నారు. అయితే, లాభసాటి అయిన ఆ శాఖను లాలూ యాదవ్‌ ఎగరేసుకుపోయారు. దీన్ని ఘోర అవమానంగా పరిగణించిన పాసవాన్​‌, మున్ముందు లాలూపై పగ తీర్చుకోవాలని లోలోన తీర్మానించుకున్నారు. మరుసటి సంవత్సరం ఫిబ్రవరిలో బిహార్‌ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. లాలూపై పగతీర్చుకోవడానికి ఇదే అదను అని పాస్వాన్‌ భావించి, రాష్ట్రీయ జనతాదళ్‌కు పోటీగా అన్ని స్థానాల్లో తన ఎల్‌జేపీ అభ్యర్థులను నిలబెట్టారు. 29 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. 75మంది ఎమ్మెల్యేలతో లాలూ యాదవ్‌ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలచినా, పాసవాన్​‌ ఆయనకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయారు. దీంతో బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.

నేర్పుగా ఎత్తుగడలు

అదే సంవత్సరం అక్టోబరు-నవంబరులో మళ్లీ ఎన్నికలు నిర్వహించినప్పుడు నీతీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. గతంలో లాలూకు పాసవాన్​‌ చేసిన గర్వభంగం వంటిది ఇప్పుడు నితీశ్‌కు చేయాలని పాసవాన్​‌ కుమారుడు చిరాగ్‌ భావిస్తున్నట్లుంది. కానీ, 2005 ఫిబ్రవరిలో జరిగినది, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతమవుతుందా అంటే అనుమానమే. బిహార్‌లో నీతీశ్‌ పార్టీ జేడీ (యు) పోటీచేస్తున్న అన్ని స్థానాల్లో తానూ అభ్యర్థులను నిలబెడతానని చిరాగ్‌ పాసవాన్​‌ ప్రకటించారు. అక్టోబరు 28న మొదటి దశ పోలింగ్‌కు వెళ్లే 71 నియోజక వర్గాలకు గానూ 42 స్థానాలకు ఇప్పటికే ఎల్‌జేపీ అభ్యర్థులను ప్రకటించారు. రాజకీయాల్లో నష్టానికి వెరవకుండా ముందడుగు వేస్తేనే ఫలితం ఉంటుందని రాం విలాస్‌ పాసవాన్​‌ తన కుమారుడు చిరాగ్‌కు బోధించి ఉండాలి. ధైర్యం చేయనిదే విజయం దక్కదని పాసవాన్​ అంటూ ఉంటారు. ఆ అవగాహనతో నేర్పుగా ఎత్తులుపైయెత్తులు వేసి అనుకున్నది సాధించుకునేవారు. మరి చిరాగ్‌లో తండ్రికి ఉన్న రాజకీయ చాతుర్యం ఉందా అన్నది రేపటి ఎన్నికల్లో తేలుతుంది. తమిళనాడు ద్రావిడ ఉద్యమ పిత పెరియార్‌ రామస్వామి నాయకర్‌ నుంచి స్ఫూర్తి పొందిన పాసవాన్​‌- రాం మనోహర్‌ లోహియా అనుచరుడు కూడా.

- కనైయ్యా భేలారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.