ETV Bharat / opinion

అమ్మ భాషలో బోధనే సమున్నతం - తెలుగుభాష

మాతృభాషలో విద్యాభ్యాసంతో(education in mother tongue) అవగాహన స్థాయి ఉన్నతంగా ఉంటుందన్న సత్యం ఇప్పుడు అవహేళనకు గురవుతోంది. దాని పట్ల వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ఆ సత్యం ప్రస్తుతం ఈ రెండు దశలను దాటుతోంది కాబట్టి ఆమోదాన్ని పొందడమే తరువాయి! జాతీయ విద్యావిధానానికి(National education policy) అనుగుణంగా వృత్తి విద్యల్ని ప్రాంతీయ భాషల్లో బోధించనున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

telugu language
తెలుగుభాష
author img

By

Published : Aug 28, 2021, 7:31 AM IST

ప్రతి సత్యం నిగ్గుతేలే ముందు అవహేళన, వ్యతిరేకత, ఆమోదం అనే మూడు దశలను దాటుతుందని ప్రసిద్ధ తత్వవేత్త షోపెన్‌ హోవర్‌ పేర్కొన్నారు. వర్తమాన సమాజంలో భాష విషయంలో అవి సంపూర్ణంగా అనువర్తిస్తాయని చెప్పవచ్చు. మాతృభాషలో విద్యాభ్యాసంతో(education in mother tongue) అవగాహన స్థాయి ఉన్నతంగా ఉంటుందన్న సత్యం ఇప్పుడు అవహేళనకు గురవుతోంది. దాని పట్ల వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ఆ సత్యం ప్రస్తుతం ఈ రెండు దశలను దాటుతోంది కాబట్టి ఆమోదాన్ని పొందడమే తరువాయి! జాతీయ విద్యావిధానానికి(National education policy) అనుగుణంగా వృత్తి విద్యల్ని ప్రాంతీయ భాషల్లో(regional languages) బోధించనున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

విద్యార్థుల్లో సవ్యంగా, సహజంగా ఆలోచించడం అలవడాలని కోరుకొంటున్న వారంతా అది విని చాలా ఆనందించారు. ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. మాతృభాషలో విద్యను నేర్పాలన్నది కేవలం ఒక ఆదర్శంగా కాకుండా అమ్మభాష(Mother tongue) ద్వారా పిల్లలకు అర్థమైన భాషలో శాస్త్ర పరిజ్ఞానాన్ని చేరువ చేయాలన్నది ఇక్కడ ప్రాథమిక లక్ష్యం. తనకు తెలియని, అర్థంకాని భాషలో యుక్త వయసు వచ్చిన పిల్లలైనా నేర్చుకోవడంలో, ఆలోచించడంలో, తర్కించడంలో, ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడంలో వెనకబడి ఉంటారన్నది- భారత్‌లోనే కాకుండా అన్ని దేశాల్లో ప్రధానమైన సమస్య.

కారాదు విఫల ప్రయోగం

ఒకప్పుడు చాలా దేశాలు బ్రిటిష్‌ వారి ఆధిపత్యంలో ఉన్నాయి. ఆంగ్లేయులు ఆయా దేశాల్లో శాస్త్ర, సాంకేతిక, వృత్తి విద్యలను ఆంగ్లంలో ప్రవేశపెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరవాత జపాన్‌ వంటి చాలా దేశాలు సొంతంగా ఆలోచించుకొని ముందుచూపుతో శాస్త్రవిజ్ఞానంలో ఆంగ్ల ఆధిపత్యాన్ని వదులుకొన్నాయి. కానీ, విజ్ఞానశాస్త్రం ప్రాధాన్యాన్ని మాత్రం గుర్తించాయి. ఇండియాలో దురదృష్టవశాత్తు అందుకు భిన్నంగా ఆంగ్ల భాష ఆధిపత్యం కొనసాగింది. విజ్ఞానశాస్త్రం ప్రజలకు చేరువ కావాలన్నదే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పరమార్థం అని మనం గుర్తించాలి. తరగతి గదిలో గురువులు పాఠం చెబుతున్నప్పుడు విద్యార్థులకు కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి. వాటిపై వారు ప్రశ్నలు సంధిస్తుంటారు. మాతృభాషలో బోధన జరిగితే విద్యార్థికి ఆయా అంశాలు బాగా అర్థమై, మరింత స్పష్టంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా విజ్ఞానశాస్త్రాన్ని అమ్మభాషలో బోధించినప్పుడు పిల్లలకు మరింత ప్రయోజనం కలుగుతుంది. అలా కాకుండా సరిగ్గా తెలియని భాషలో పాఠం చెబితే పిల్లలు ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందరూ విజ్ఞానవంతులు కావాలి, అప్పుడే ప్రశ్నించడం నేర్చుకుంటారు. పరిశీలించడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా విద్యలో నాణ్యత పెరుగుతుంది. ప్రధానంగా ఆంగ్లం, మాతృభాషల చదువుల మధ్య అంతరాలు చెరిగిపోయి, ప్రజలను మమేకం చేసే చదువు వస్తుంది. మాతృభాషలో ఉన్నత విద్య విజయవంతం కావాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. లేకుంటే అది విఫల ప్రయోగంగా మిగిలే ప్రమాదం ఉంది. పటిష్ఠ పాఠ్యపుస్తకాల రూపకల్పన వాటిలో మొదటిది.

నాణ్యమైన గ్రంథాలు అవసరం

భౌతిక, రసాయన, జీవ, భూగర్భ తదితర శాస్త్రాలకు సంబంధించి తెలుగు అకాడమీ పారిభాషిక పదాలు రూపొందించింది. చరిత్ర, సమాజ శాస్త్రాలకు సంబంధించిన ప్రామాణికమైన పుస్తకాలను తెలుగులో ప్రచురించింది. ఆధునిక వృత్తి విద్యలకు సంబంధించి అటువంటి పారిభాషిక పదాలు, గ్రంథాలు విస్తృతంగా తెలుగులో రావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రస్తుతం చాలా మంది కృషిచేస్తున్నారు. వారి అనుభవాలను, సేవలను ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి. రెండో అంశం అనువాదం.

పటిష్ఠమైన అనువాద శాఖను విధిగా ఏర్పరచుకోవాలి. చాలా సందర్భాల్లో యంత్రానువాదం వల్ల చాలా తప్పులు దొర్లుతున్నాయి. ఒక పదాన్ని ఆయా శాస్త్రాల్లో వేర్వేరు అర్థాల్లో ఉపయోగిస్తారు. వైద్య, ఇంజినీరింగ్‌ పాఠ్యపుస్తకాలకు ప్రత్యేక వాక్య నిర్మాణం ఉంటుంది. దానికి అనుగుణంగా యంత్రానువాదాన్ని సిద్ధం చేసుకోవాలి. అనువాదకులకు ప్రత్యేక శిక్షణ అందించాలి. అధ్యాపకులకూ ఒకటి రెండు నెలలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఈ విధానం ఎందుకు, విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఇది ఎలా తోడ్పడుతుంది, తెలుగులోనే ఎందుకు మాట్లాడాలి, విద్యార్థులను ఎలా ప్రోత్సహించాలి- తదితర అంశాలను ఇందులో వివరించవచ్చు.

అవగాహన కల్పించాలి..

తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల భావప్రసార నైపుణ్యాలు (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) లోపిస్తాయన్న వాదన సాధారణంగా వినిపిస్తుంటుంది. భావ ప్రసార నైపుణ్యాలు వేరు, శాస్త్ర అవగాహన వేరు అని విద్యార్థులకు తెలియజెప్పాలి. ఆంగ్ల భాషను సులభంగా, అర్థవంతంగా మాట్లాడటంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. వ్యాసం, ఉపన్యాసం రాయడం, తన గురించి తాను పరిచయం చేసుకోవడం తదితర విభిన్న ప్రక్రియల్లో పిల్లల అభివ్యక్తి నైపుణ్యాలు పెంచాలి. ఆంగ్లం మనల్ని శాసించేలా కాకుండా, ఆయా విషయాల్లో దాన్ని ఒక పనిముట్టుగా మార్చుకోవాలి. అందుకోసం ప్రత్యేక పాఠ్యప్రణాళిక, ప్రయోగశాలలు, కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళితే ఆశించిన ఫలితాలు సాధించడంలో అవాంతరాలు ఎదురవుతాయని గ్రహించాలి.

నాయకత్వ లక్షణాలు కీలకం

ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువుకుంటే ఆంగ్లం బాగా వస్తుందని, మంచి ఉద్యోగాలు దక్కుతాయని కొందరు అపోహపడుతుంటారు. ఆంగ్ల మాధ్యమానికి, ఇంగ్లిష్‌ మాట్లాడటానికి, ఉద్యోగాలు రావడానికి కొంత సంబంధం ఉన్న మాట వాస్తవమే అయినా- మొత్తం దానిపైనే ఆధారపడి ఉండదని వారికి తెలియజెప్పాలి. విషయం మీద గట్టి పట్టు ఉండటం, బృందంలో ధైర్యంగా మాట్లాడటం, అందరికీ నచ్చజెప్పేలా, ఏకాభిప్రాయం సాధించేలా సంభాషించడం, నాయకత్వ లక్షణాలు తదితరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఆ అంశాల్లో వారిని తీర్చిదిద్దాలి. వాటిని ఆంగ్లంలో చెప్పడం ఎలా అన్నదీ నేర్పాలి. అవసరమైతే అందుకోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం రూపొందించుకోవాలి. అప్పుడు ఆకాశమే హద్దుగా పిల్లలు జ్ఞాన తృష్ణతో పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారు.

మాతృభాషలో ఉన్నత విద్య పరంగా వేగాన్ని, చురుకుదనాన్ని తొలి, రెండో విడత విద్యార్థుల్లో చూపగలిగితే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇటువైపు ఆకర్షితులవుతారు. అప్పుడు లోకానికి ఇది ఆదర్శం అవుతుంది.

ఇదీ చదవండి: covid vaccination: ఒక్కరోజులో కోటి డోసులు- భారత్​ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.