ETV Bharat / opinion

టీకా బాటలో వెనకబాటు- ఉరకలేస్తున్న ఇజ్రాయెల్‌ - వ్యాక్సినేషన్​ భారత్

కొవిడ్‌ టీకాలను అత్యధిక ప్రజానీకానికి అందజేసే రేసులో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్‌ తన ఆర్థిక రథానికి తిరిగి ఊపు తీసుకురావడానికి నడుంకట్టింది. ఫిబ్రవరి 23నాటికి ఆ దేశం ప్రతి వందమందికిగాను 87 మందికి టీకాలు వేసింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) 53.60 సగటుతో రెండో స్థానంలో నిలుస్తుంటే, 28.31తో బ్రిటన్‌, 20మందితో అమెరికా తదుపరి స్థానాలు ఆక్రమిస్తున్నాయి. చైనాలో ప్రతి 100మందిలో సగటున 2.89 మందికి టీకాలు పడగా భారత్‌లో కేవలం 0.90కే ఇప్పటివరకు టీకా వేయగలిగారు.

COVID-19 Vaccination
టీకా బాటలో వెనకబాటు- ఉరకలేస్తున్న ఇజ్రాయెల్‌
author img

By

Published : Feb 27, 2021, 5:58 AM IST

ల్లలకగానే పండగ కాదు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చినా, వాటిని జనానికి ఎంత త్వరగా వేస్తే అంత వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకొంటుంది. చితికిపోయిన జనం బతుకులు మళ్ళీ గాడిన పడతాయి. కొవిడ్‌ టీకాలను అత్యధిక ప్రజానీకానికి అందజేసే రేసులో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్‌ తన ఆర్థిక రథానికి తిరిగి ఊపు తీసుకురావడానికి నడుంకట్టింది. ఫిబ్రవరి 23నాటికి ఆ దేశం ప్రతి వందమందికిగాను 87 మందికి టీకాలు వేసింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) 53.60 సగటుతో రెండో స్థానంలో నిలుస్తుంటే, 28.31తో బ్రిటన్‌, 20మందితో అమెరికా తదుపరి స్థానాలు ఆక్రమిస్తున్నాయి. చైనాలో ప్రతి 100మందిలో సగటున 2.89 మందికి టీకాలు పడగా భారత్‌లో కేవలం 0.90కే ఇప్పటివరకు టీకా వేయగలిగారు.

ప్రస్తుతం ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల్లో టీకాల సరఫరాలో ఆటంకాల వల్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమం నత్తనడకన సాగుతుంటే, 86లక్షల జనాభాగల ఇజ్రాయెల్‌లో అవసరానికి మించి ఫైజర్‌-బయో ఎన్‌ టెక్‌ టీకాల లభ్యత ఉంది. డిసెంబరు 20న టీకాలు వేయనారంభించిన ఆ దేశం ఫిబ్రవరి 15నాటికే 40శాతానికి మొదటి డోసు వేసి, 28 శాతానికి రెండో మోతాదూ అందించింది. ఇంకా విశేషమేమంటే 60 ఏళ్లు పైబడినవారిలో 80 శాతానికి ఫైజర్‌ టీకా వేయడం! ఆ వయసువారిలో గతంతో పోలిస్తే కొవిడ్‌ వ్యాప్తి 56 శాతం తగ్గింది. రెండో డోసు తరవాత ఆస్పత్రి చేరికలు 42 శాతం, కొవిడ్‌ మరణాలు 35 శాతం మేరకు తగ్గిపోయాయి. నేడు ఇజ్రాయెల్‌లో ఫైజర్‌ టీకా నిల్వలు పొంగిపొరలుతుండటంతో మోడెర్నా టీకా వేయడానికి అవకాశం లేకుండా పోతోంది. మోడెర్నా టీకాకు ఇజ్రాయెల్‌ జనవరి అయిదునే లైసెన్సు పొందినా దాని వాడకం ఫిబ్రవరి గడిచిపోతున్నా మొదలేకాలేదు!

ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాథమ్యం!

ఫైజర్‌-బయోఎన్‌ టెక్‌ టీకాలను ఇజ్రాయెల్‌ భారీయెత్తున సేకరించగలిగిందంటే కారణం- ఈయూకన్నా ఎక్కువ ధర పోసి కొనడమే. ఫైజర్‌ టీకా డోసు ఒక్కింటికి ఈయూ కేవలం 12 యూరోలను చెల్లిస్తుంటే, ఇజ్రాయెల్‌ 23 యూరోలు చెల్లించి కొనుగోలు చేసింది. ఒకవేళ ఫైజర్‌ టీకా వికటిస్తే ఆ కంపెనీయే జవాబుదారీ కావాలని ఈయూ షరతు పెట్టగా, ఇజ్రాయెల్‌లో ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొంటోంది. అన్నింటినీ మించి వ్యాక్సిన్‌ సమాచారాన్ని వారంవారం ఫైజర్‌కు పంపడానికి అంగీకరించింది. ఇజ్రాయెల్‌ ఆరోగ్య రక్షణ యంత్రాంగమంతా డిజిటల్‌ పద్ధతిలోకి మారిపోయినందువల్ల కొవిడ్‌ టీకాలకు సంబంధించి పక్కా సమాచారం ఫైజర్‌కు అందుతోంది. ఫార్మా కంపెనీలకు ఇటువంటి సమాచారం అమూల్యమైనది. టీకా మొదటి డోసు వేయగానే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతూ రెండో డోసు వేసిన తరవాత పూర్తి సత్తా చూపితేనే అది అనుకున్న విధంగా పనిచేస్తున్నట్లు లెక్క! ఇజ్రాయెల్‌లో ప్రభుత్వంతోపాటు అతిపెద్ద ఆరోగ్య బీమా కంపెనీల నుంచీ అందుతున్న సమాచారం ఫైజర్‌ టీకా శక్తిని నిర్ధారిస్తోంది. ఉదాహరణకు ఆరోగ్య బీమా సౌకర్యం ఉండి, రెండో డోసు వేసుకున్న 5,23,000 మందిలో కేవలం 0.1 శాతం అంటే 544మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వారిలో ఏ ఒక్కరూ కరోనా వల్ల మరణించలేదు. వ్యాక్సిన్‌ వేసుకోని 6,28,000 మందిలో 18,425మందికి కరోనా సోకినట్లు బీమా సంస్థల సమాచారం వెల్లడించింది.

ఈ గణాంకాలు ఫైజర్‌-బయోఎన్‌ టెక్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రకటించిన ఫలితాలతో సరిపోలుతున్నాయి. టీకా వేసుకున్న తరవాత సైతం కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల ద్వారా ఇతరులకు కరోనా అంత తేలిగ్గా సోకదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. యువతీయువకులు, గర్భిణులు, మధుమేహులు, క్యాన్సర్‌ రోగులపై టీకా ప్రభావం గురించిన సమాచారం ఇంకా అందవలసి ఉంది. యువ ఇజ్రాయెలీలు టీకాలు వేయించుకోవడానికి అంతగా సుముఖత చూపకపోవడం గమనించాల్సిన అంశం. ఫలితంగా నేడు కొవిడ్‌వల్ల ఆస్పత్రిపాలవుతున్నవారిలో 60ఏళ్లుపైబడినవారికన్నా 60 ఏళ్లలోపువారే ఎక్కువగా కనిపిస్తున్నారు. యువ రోగుల్లో చాలామంది ఊపిరి ఆడక గుండె, ఊపిరితిత్తులకు బయటినుంచి శ్వాస అందించే ఎక్మో యంత్రాలపై ఆధారపడే పరిస్థితి నెలకొంది. అందరూ టీకాలు వేయించుకునేలా చూడటానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదా జరిమానా విధించడం వంటి పద్ధతులను చేపట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

మన తీరు మారాలి...

ప్రపంచంలోనే కొవిడ్‌ టీకా కార్యక్రమంలో అగ్రగామిగా పేరుతెచ్చుకున్న ఇజ్రాయెల్‌ తన ఆక్రమణలోని పాలస్తీనా భూభాగాల ప్రజలను అలక్ష్యం చేస్తోందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ముద్రను చెరిపేసుకోవడానికి ఇజాయెల్‌ ప్రభుత్వం ఇటీవలే పాలస్తీనా ప్రజలకు టీకాల సరఫరా ప్రారంభించింది. మరోవైపు ఆర్థిక, సామాజిక జీవనంపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేస్తూ ఆర్థిక రథాన్ని ముందుకు ఉరికించడానికి ఉపక్రమిస్తోంది. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు, రెండు డోసుల టీకాలు వేయించుకున్నవారు మొబైల్‌ యాప్‌ ద్వారా గ్రీన్‌ పాస్‌ పొంది దేశంలో స్వేచ్ఛగా సంచరించవచ్చని సర్కారు ప్రకటించింది. గ్రీన్‌పాస్‌లు ఆరు నెలల వరకే చెల్లుబాటవుతాయి. అవి కలిగినవారు థియేటర్లు, వ్యాయామశాలలు, క్రీడా మైదానాలు, హోటళ్లు, ఈత కొలనులు, షాపింగ్‌ కేంద్రాలకు వెళ్లవచ్చు. కానీ, వినియోగదారులు, వ్యాపారులు భౌతిక దూరం పాటించడం, మాస్కులు, శానిటైజర్లు వాడటం తప్పనిసరి. పరిస్థితి సవ్యంగా ఉందని ప్రభుత్వం నిర్ధారించుకుంటే మార్చి ఒకటో తేదీ నుంచి రెస్టారెంట్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి అనుమతిస్తుంది. భారత్‌లో కొవిడ్‌ టీకాల కార్యక్రమం ఆశించినంత వేగంగా జరగడం లేదు. మార్చినుంచి ప్రైవేటు సంస్థలను సైతం టీకా కార్యక్రమంలో భాగస్వాములను చేయాలనుకుంటున్న సర్కారు- ఇజ్రాయెల్‌ అనుభవాన్ని పరిశీలించి, వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలి!

- ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.