ETV Bharat / opinion

కష్టకాలంలో భారత్​కు మిత్రుల అండ - కరోనా రెండో దశ భారత్

నలభైకిపైగా దేశాలకు కష్టకాలంలో టీకాల పంపిణీతో సాయం చేసిన భారత్​కు ఇప్పుడు ప్రతిఫలంగా ఆ దేశాలు తమవంతు సహాయాన్ని అందజేస్తున్నాయి. దేశంలో మహమ్మారి రెండో దశ ఆందోళనకర పరిస్థితులు ఏర్పరిచిన నేపథ్యంలో అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్య సహా పశ్చిమాసియా దేశాలు తమ మద్దతు అందించాయి.

world coutries support to india, corona second wave india
కష్టకాలంలో భారత్​కు మిత్రుల అండ
author img

By

Published : Jul 1, 2021, 7:36 AM IST

కరోనా రెండో దశతో ఉక్కిరిబిక్కిరైన భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలిచాయి. పొరుగు దేశాలు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కూడా మద్దతునిచ్చేందుకు వెంటనే ముందుకొచ్చాయి. ఇక్కడా వక్రబుద్ధి ప్రదర్శించిన పాక్‌ సహాయం చేస్తానంటూనే కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించింది. ఖైదీలుగా ఉన్న కశ్మీరీ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేసింది. ఈ కారణంగా పాకిస్థాన్‌ సహాయాన్ని నిరాకరించిన భారత్‌, బంగ్లాదేశ్‌ మద్దతును స్వాగతించింది. ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అందించిన 10వేలకుపైగా రెమ్‌డెసివిర్‌ వైల్స్‌, 30వేలకుపైగా పీపీఈ కిట్లు, జింకు, క్యాల్షియం, విటమిన్‌-సి వంటి ఔషధాలను స్వీకరించింది. కరోనా తొలి దశ అనంతరం 'వ్యాక్సిన్‌ మైత్రి'లో భాగంగా టీకా సహాయం చేసిన భారత్‌కు కష్టకాలంలో బంగ్లాదేశ్‌ తోడ్పాటు అందించింది.

అత్యవసర మందుల చేరవేత

'వ్యాక్సిన్‌ మైత్రి'తో భారత్‌ నుంచి 6.63 కోట్ల టీకాలు అందుకున్న నలభైకిపైగా దేశాలూ ఆ విషయాన్ని మరచిపోలేదు. రెండోదశ తీవ్రస్థాయిలో ఉన్నవేళ భారత్‌కు వివిధ రూపాల్లో అండగా నిలిచాయి. అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్య నుంచే కాకుండా పశ్చిమాసియా దేశాల నుంచీ మద్దతు లభించింది. ఇజ్రాయెల్‌ మరో అడుగు ముందుకేసి భారత్‌కు తమ వైద్య నిపుణులను పంపించింది. దేశంలోని ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేసి ఇరుదేశాల మధ్య బంధాన్ని చాటిచెప్పింది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య ఏప్రిల్‌ 28న జరిగిన టెలిఫోన్‌ సంభాషణ అనంతరం ఇరు దేశాల మైత్రి మరింత బలపడింది. సంక్షోభ సమయంలో భారత్‌కు కావాల్సిన వస్తువులను రష్యా సరఫరా చేసింది. అమెరికా, ఐరోపా సమాఖ్యలూ అండగా నిలిచేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, తైవాన్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఇండొనేసియా, మలేసియా, దక్షిణకొరియాలు అత్యవసర మందులు, పరికరాలను పంపి వెన్నంటి నిలిచాయి. ముస్లిం ప్రాబల్య దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌, ఖతార్‌ సైతం మనదేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కృషి చేశాయి.

రెండోదశ అల్లకల్లోలం సృష్టించినా, ప్రపంచ దేశాల అండతో దాన్ని భారత్‌ ఎదుర్కోగలిగింది. కానీ విదేశాలపై భారత్‌ ఆధారపడిన తీరు తీవ్ర చర్చలకు దారితీసింది. ఇలా సహాయం తీసుకుంటే ఇతర దేశాలు భారత్‌ను చిన్నచూపు చూస్తాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. నాటి యూపీయే ప్రభుత్వం సునామీ సమయంలో ప్రపంచ దేశాల మద్దతును సున్నితంగా తిరస్కరించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం కూడా దాదాపు ఇదే విధానాన్ని అనుసరించింది. 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తగా, యూఏఈతో పాటు ఇతర విదేశాలు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. వాటిని భారత్‌ తిరస్కరించింది. కానీ, కరోనా మహమ్మారి మునుపెన్నడూ చూడనిది, కనీవినీ ఎరుగనిది. రెండో దశ ఉద్ధృతి ఊహకు అందనిది. మహమ్మారి నుంచి దేశ ప్రజలను విముక్తి చేసేందుకే ప్రభుత్వం విదేశీ సహాయానికి అంగీకరించిందని భావించాలి. ఈ విషయంలో 'భారత దౌత్యం' విజయం సాధించింది. ఇన్నేళ్లుగా, విదేశీ శక్తుల మధ్య సమానమైన బంధాన్ని పాటిస్తూ రావడం భారత్‌కు కలిసి వచ్చింది. అమెరికా, రష్యా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి మన దేశానికి అండగా నిలవడమే ఇందుకు నిదర్శనం. అమెరికా ఆంక్షలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నా ఎస్‌-400 రక్షణ వ్యవస్థను రష్యా నుంచి మనదేశం కొనుగోలు చేస్తోంది. రక్షణపరంగా రష్యాపై భారత్‌ ఆధారపడటం అగ్రరాజ్యానికి ఇష్టం లేకపోయినా, కీలకమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కొనేందుకు ఇండియా కీలకమన్న సంగతి అమెరికాకు బాగా తెలుసు. చైనా కుతంత్రాలను గ్రహించిన ఇండో-పసిఫిక్‌ దేశాలకు భారత్‌ విలువేమిటో తెలుసు.

నమ్మదగిన భాగస్వామి

కరోనా తొలి దశ అనంతరం ప్రపంచ దేశాలను భారత్‌ ఆదుకున్న తీరు ఎంతో ప్రత్యేకం. టీకాలను తయారు చేసి ప్రపంచం నలుమూలలకు, ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలకు ప్రభుత్వం పంపింది. ఇలా 'విశ్వసనీయ భాగస్వామి'గా ఇన్నేళ్లుగా ప్రపంచ దేశాల్లో భారత్‌ తెచ్చుకున్న పేరు, కరోనా రెండో దశలో ఉపయోగపడింది. ఇండియా-గల్ఫ్‌ వాణిజ్యం భారీగా పెరగడం, గల్ఫ్‌ దేశాల్లో 75 లక్షల మందికిపైగా ప్రవాస భారతీయులు పనిచేస్తూ వాటి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుండటం వంటివి భారత్‌తో ఆయా దేశాలకు బలమైన మైత్రి నెలకొనడానికి కారణాలుగా మారాయి. ఫలితంగా, పశ్చిమాసియా దేశాలు భారత్‌కు సరైన సమయంలో అండగా నిలిచాయి. ఈ క్రమంలో విదేశీ సహాయం పొందినంత మాత్రాన దేశం బలహీన పడుతున్నట్లు కాదని, అంతర్జాతీయ వేదికలపై మనకున్న గుర్తింపునకు ప్రతిఫలంగా భావించవచ్చని ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది. బ్రెజిల్‌ కూడా కరోనా సంక్షోభంతో విలవిలలాడినా, భారత్‌కు దక్కిన సహాయంలో పావు వంతు అయినా ఆ దేశానికి అందలేదు. ఎన్నో ఏళ్లుగా వాణిజ్య, భౌగోళిక, రాజకీయ వ్యవహారాల్లో నమ్మదగిన భాగస్వామిగా భారత్‌ గుర్తింపు తెచ్చుకుందనడానికి ఇదే నిదర్శనం.

- రాజీవ్‌ రాజన్‌

ఇదీ చదవండి : ఉల్కలతో మానవాళికి ఉపద్రవం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.