ETV Bharat / opinion

జంతు సంరక్షణ మానవాళికి రక్షాకవచం - జంతు సంరక్షణపై నిపుణులు

జంతుజాలం నుంచి మానవాళికి బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవుల ద్వారా సంక్రమించే రుగ్మతలను జూనోటిక్‌ వ్యాధులుగా పరిగణిస్తున్నారు. ఈ వ్యాధుల పట్ల ప్రజలను చైతన్య పరచడమే జూనోసెస్‌ డే ముఖ్యోద్దేశం. మానవాళిపై ప్రస్తుతం సుమారు 150 జూనోటిక్‌ వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సూక్ష్మజీవుల వల్ల మానవ, జంతుజాలానికి పొంచి ఉన్న ముప్పును ముందుగానే గుర్తించి దాన్నుంచి తప్పించుకోవడం తక్షణ కర్తవ్యమని సూచిస్తున్నారు.

wildlife conservation, ప్రపంచ జూనోసెస్​ డే
జంతు సంరక్షణ మానవాళికి రక్షాకవచం
author img

By

Published : Jul 6, 2021, 7:23 AM IST

ఫ్రెంచ్‌ జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్‌- జంతువుల నుంచి మానవుడికి సంక్రమించే రేబిస్‌ వ్యాధికి 1885 జులై ఆరున విజయవంతంగా టీకా ప్రయోగించారు. ప్రజారోగ్య వ్యవస్థలో ఒక అద్భుత ఆవిష్కరణకు నాంది పలికిన రోజు కావడం వల్ల ఆయనను స్మరించుకుంటూ ఏటా అదే రోజున ప్రపంచమంతా 'జూనోసెస్‌ డే'ని జరుపుకొంటోంది. జంతుజాలం నుంచి మానవాళికి బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవుల ద్వారా సంక్రమించే రుగ్మతలను జూనోటిక్‌ వ్యాధులుగా పరిగణిస్తున్నారు. ఈ వ్యాధుల పట్ల ప్రజలను చైతన్య పరచడమే జూనోసెస్‌ డే ముఖ్యోద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ ముగ్గురిలో ఒకరు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల బారిన పడుతున్నారు. సుమారు 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. ఇటీవల కొత్తగా ఉద్భవిస్తున్న సాంక్రామిక వ్యాధుల్లో దాదాపు 75శాతం పక్షులు, జంతువుల నుంచి వస్తున్నవేనని అమెరికాకు చెందిన 'సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌' అంటోంది. ఈ దశాబ్దంలో జూనోటిక్‌ వ్యాధులవల్ల దాదాపు పది వేల కోట్ల డాలర్ల ఆర్థిక భారం ప్రజలపై పడినట్లు ఆ సంస్థ పేర్కొంది. పేద ఆఫ్రికా దేశాల్లో ఈ రోగాల తీవ్రత మరీ అధికంగా ఉంది.

పరిశుభ్రతే కీలక ఆయుధం

మానవాళిపై ప్రస్తుతం సుమారు 150 జూనోటిక్‌ వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశువులు, గొర్రెలు, మేకలు తదితర జంతువుల నుంచి సంక్రమించే ఆంత్రాక్స్‌; కోడి ఇతర పక్షి జాతుల నుంచి వ్యాపించే బర్డ్‌ ఫ్లూ; చింపాంజీలు, గొరిల్లాల నుంచి వచ్చే ఎబోలా; ఎలుకలు, కుక్కల ద్వారా సంక్రమించే రేబిస్‌; 'రోడెంట్స్‌'గా వ్యవహరించే ఎలుక జాతి క్షీరదాల నుంచి వ్యాపించే నిఫా వ్యాధులు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్పర్శ ద్వారా దోమలు కీటకాల కాటు ద్వారా మానవ శరీరంలో ఈ వ్యాధులు పెద్దయెత్తున వ్యాప్తి చెందుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న జంతు, పక్షి జాతులను భుజించడం వల్ల ఇవి సంక్రమిస్తాయి. కుళ్ళిన మాంసాహారం తిన్నా వ్యాపించే అవకాశం ఉంది. జూనోటిక్‌ వ్యాధుల వ్యాప్తిలో జంతువుల పాత్ర అత్యంత కీలకం.

పెంపుడు జంతువులు, ఆహారం కోసం ఫామ్‌లలో పెంచుతున్న పశుపక్ష్యాదులు, జంతు వధశాలలు, జీవ శాస్త్ర ప్రయోగశాలలు ఈ వ్యాధుల ఆవిర్భావానికి కారణమవుతున్నాయి. ఇవి ముందుగా జంతువుల నుంచి మనిషి శరీరంలోనికి చేరి- ఆపై మనిషి నుంచి మనిషికి వివిధ మార్గాల ద్వారా సంక్రమించి, మహమ్మారులుగా మారి ప్రపంచవ్యాప్తంగా మారణకాండ సృష్టిస్తున్నాయి. నేడు ప్రజలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుదిపేస్తున్న కొవిడ్‌ మహమ్మారి సైతం గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు ప్రాథమిక పరిశోధనల్లో తేలడం వల్ల జూనోటిక్‌ వ్యాధులపై చర్చ మరింత తీవ్రమైంది. కోట్ల మందిని బలి తీసుకుంటున్న ఇలాంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అత్యంత ఆవశ్యకం. ఈ తరహా వ్యాధుల నిర్మూలనలో టీకాయే ప్రధాన ఆయుధం. పరిసరాల పరిశుభ్రత వీటి కట్టడిలో కీలకమైంది. సూక్ష్మజీవులవల్ల మానవ, జంతుజాలానికి పొంచిఉన్న ముప్పును ముందుగానే గుర్తించి దాన్నుంచి తప్పించుకోవడం తక్షణ కర్తవ్యం.

వ్యూహాలు తప్పనిసరి

ప్రతి ఒక్కరికీ మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఈ ఏటి డబ్ల్యూహెచ్‌ఓ నినాదం ప్రధానంగా ఈ వ్యాధులను ఉద్దేశించి ఎంచుకొన్నదే. జంతువుల నుంచి మానవుడికి సంక్రమించే వ్యాధుల గొలుసును ఛేదించాలనే ప్రస్తుత జూనోసెస్‌ డే నినాదమూ దానికి తోడయింది. ప్రపంచవ్యాప్తంగా జంతు మాంసానికి గిరాకీ పెరుగుతోంది. జంతువధ విచ్చలవిడిగా జరుగుతోంది. ఇది పర్యావరణానికీ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇప్పటికే ఎన్నో జాతుల జంతువులు మానవ తప్పిదాలతో అంతరించిపోయాయి. ప్రకృతి వైపరీత్యాలూ కొత్త వ్యాధుల పుట్టుకకు, వ్యాప్తికి కారణమవుతున్నాయని 'యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం- ప్రపంచ పాడి పరిశోధన' కేంద్రాల సంయుక్త నివేదిక వెల్లడిస్తోంది.

ఆవులు, గేదెలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు, కోళ్లు మానవుడి జీవనంలో అంతర్భాగమై సహవాసం చేస్తున్నాయి. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ పట్ల పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. జంతుజాలం ఆరోగ్య పరిరక్షణ అందరికీ శ్రేయస్కరం. అవి ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచం బాగుంటుందనే భావన ప్రజలందరిలో కలగాలి. మన చుట్టూ ఉన్న జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మానవాళికి అత్యంత సులువైన, కచ్చితమైన ఆరోగ్యమార్గంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఈ వ్యాధులపై నిరంతర నిఘా ఉంచి- వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతగా గుర్తించాలి. సృష్టిలోని ప్రతీ జీవి స్వేచ్ఛగా, ఆరోగ్యంగా మనుగడ సాగించేలా భద్రత కల్పించాలి. జూనోటిక్‌ వ్యాధుల పట్ల చైతన్యం కలిగి నియంత్రణ దిశగా అడుగులు వేయడమే లూయీ పాశ్చర్‌ లాంటి మేధావుల స్మృతికి మనం అందించే ఘన నివాళి.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌ (వైద్య రంగ నిపుణులు)

ఇదీ చదవండి : 'ఆపరేషన్​ కశ్మీర్ 2.0' ప్రక్రియ ప్రారంభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.