ETV Bharat / opinion

సత్వరన్యాయం.. తక్షణావసరం!

గత కొన్ని దశాబ్దాలుగా వివిధ రంగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సంభవించినా, న్యాయస్థానాల తీర్పుల వేగం పెరగలేదు. ప్రస్తుతం మన కోర్టుల్లో 44 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 2022 చివరికి అవి 50 కోట్లను దాటిపోనున్నాయి. వీటిని వేగంగా పరిష్కరించి తీర్పులు ఇవ్వాలంటే, మొదట న్యాయమూర్తుల పదవుల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

author img

By

Published : Jul 1, 2021, 8:50 AM IST

indian judicial system, భారత న్యాయవ్యవస్థ
సత్వరన్యాయం.. తక్షణావసరం!

దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పట్ల నిరసన తెలిపిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేయడానికి ఉగ్రవాద నిరోధక చట్ట నిబంధనలను అడ్డుపెట్టుకున్న పోలీసులను హైకోర్టు గట్టిగా మందలించింది. న్యాయస్థానం ఆ విద్యార్థులకు బెయిలు ఇచ్చినా, ఆ ఆదేశం వెలువడటానికి 13 నెలలు పట్టడం విశేషం. ఇన్ని నెలలూ విద్యార్థులు జైలులో మగ్గిపోవడానికి ఎవరు బాధ్యత వహించాలి? అసలు వారు అరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజుల్లోనే దిగువ కోర్టు కాని, హైకోర్టు కాని బెయిలు మంజూరు చేసి ఉండవచ్చు. కేవలం 24 గంటల్లోనే బెయిలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. దిల్లీ విద్యార్థులకు బెయిలు ఇవ్వడంలో అసాధారణ జాప్యం వారి ప్రాథమిక హక్కులకు భంగకరం. ఈ జాప్యానికి పోలీసులు, ప్రభుత్వమే కారణమని అందరూ నిందిస్తారు. మరి న్యాయవ్యవస్థకు బాధ్యతే లేదా? హడావుడి తీర్పులు ఎంత అనర్థదాయకమో, అమిత ఆలస్య తీర్పులూ అంతే అవాంఛనీయం. ప్రస్తుతం జైళ్లలో మగ్గిపోతున్న వారిలో 65 నుంచి 70 శాతం వరకు విచారణలో ఉన్నవారే. ఆ ఖైదీలందరూ పేదలే.

తీర్పుల్లో పెరగని వేగం

స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఏడు దశాబ్దాల్లో మౌలిక వసతులు, రేషన్‌ కార్డుల జారీ వంటి రంగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సంభవించినా, న్యాయస్థానాల్లో తీర్పుల వేగం పెరగలేదు. కేసుల పరిష్కారానికి ఏళ్లూపూళ్లూ పడుతోంది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించడానికి కోర్టులు అనేకానేక తీర్పులు వెలువరించినా, తమ ప్రాంగణాల్లోనే వాటిని కాపాడటంలో విఫలమయ్యాయి. ఇది అవినీతి, నేరాలు పెరగడానికి దారి తీసింది. దీనివల్ల మన జీడీపీ వృద్ధి వేగం పుంజుకోవడం లేదు. సులభతర వాణిజ్య సూచీలో భారత్‌ వెనకబడటానికి అవినీతే మూలకారణం. ఇక్కడ 1980-84 మధ్య అవినీతి, తీవ్ర నేరాల కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) జరిపిన ఒక అధ్యయనాన్ని ఉటంకించాలి. ఈ అయిదేళ్లలో 275 మంది నిందితులను విచారించిన కోర్టులు 144 మంది విషయంలోనే నేర నిర్ధారణ జరిపాయి. ఒక కేసు దర్యాప్తు ముగించడానికి సగటున 13.4 నెలలు పట్టగా, విచారణకు 88 నెలలు పట్టిందని సీబీఐ నివేదిక తెలిపింది. నేరాలు రుజువై శిక్షలు పడిన వారిలో చాలామంది పైకోర్టులకు అప్పీలు చేసుకున్నారు. వీరిలో 20 రోజులకు మించి జైలులో ఉన్నవారు కేవలం 21 మంది. సీబీఐ అధ్యయనం పూర్తయిన 2008లో 66 కేసులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఆ కేసులపై ప్రజాధనం ఖర్చయిపోతూనే ఉంది. తీర్పులు ఇవ్వడంలో కోర్టులు చేస్తున్న విపరీత జాప్యం వల్ల చాలామంది నేరస్తులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. ఈ జాప్యానికి కారణాలను శోధించాలి.

ప్రస్తుతం మన కోర్టుల్లో 44 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 2022 చివరికి అవి 50 కోట్లను దాటిపోనున్నాయి. వీటిని వేగంగా పరిష్కరించి తీర్పులు ఇవ్వాలంటే, మొదట న్యాయమూర్తుల పదవుల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలి. 2006-17 మధ్య కాలంలో అపరిష్కృత కేసులు ఏటా 2.5శాతం చొప్పున పెరగ్గా, న్యాయమూర్తుల పదవుల్లో ఖాళీలు ఏటా 21శాతం చొప్పున పెరిగాయి. వాటిని వేగంగా భర్తీచేసి ఉంటే ఆరేళ్లలో పెండింగు కేసులనేవే ఉండేవి కావని 100 మంది ఐఐటీ పూర్వ విద్యార్థుల అధ్యయనం తేల్చింది. దీన్ని జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ, జస్టిస్‌ ఆర్‌.సి.చవాన్‌ సమర్థించారు కూడా. సబార్డినేట్‌ జడ్జీల పదవులకు నియామకాలు పోటీ పరీక్ష ద్వారా జరుగుతాయి. ఉదాహరణకు 107 ఖాళీల కోసం హరియాణా జ్యుడీషియల్‌ సర్వీసు పరీక్షలకు హాజరైన 14వేల మందిలో చివరకు కేవలం తొమ్మిది మంది మాత్రమే విజేతలుగా నిలిచారు. ఈ లెక్కన అన్ని రాష్ట్రాల్లో ఖాళీల భర్తీ ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. పరీక్షకు హాజరైన వారిలో అత్యధిక మార్కులు సంపాదించిన వారిని ఎంపిక చేయాలనే కనీస నియమాన్ని ఇక్కడ పాటించడం లేదని అర్థమవుతోంది.

వర్చువల్‌ పద్ధతి మేలు

సుప్రీంకోర్టు ఈ-కమిటీ చేసిన మూడు కీలక సిఫార్సులు ఇంతవరకు అమలుకాకపోవడం పెద్ద లోపం. కేసుల జాబితా తయారు చేసి, వాటిని ఏయే న్యాయమూర్తులకు కేటాయించాలో, వాయిదాలు ఎలా ఇవ్వాలో నిర్ణయించే బాధ్యతను కంప్యూటర్‌ అల్గారిథమ్స్‌కు ఇవ్వాలని, ఈ విషయాల్లో న్యాయమూర్తులకు అయిదు శాతం మాత్రమే విచక్షణాధికారం ఇవ్వాలని ఆ సంఘం సిఫార్సు చేసింది. వకీళ్లు, వ్యాజ్యదారులు కోర్టులకు వచ్చి కాగితాలపై పిటిషన్లు, అఫిడవిట్లు, రుసుము చెల్లింపులు జరపనక్కర్లేకుండా ఈ-ఫైలింగ్‌ విధానాన్ని ప్రవేశపెడితే ఏటా మూడు లక్షల చెట్లను రక్షించిన వారమవుతామని ఈ-కమిటీ సూచించింది. ఈ సూచన కూడా అమలు కాలేదు. ఈ-కమిటీ వర్చువల్‌ కేసు విచారణలనూ సిఫార్సు చేసింది. కొవిడ్‌ వల్ల వర్చువల్‌ విచారణలు జరుగుతున్నా అవి కొద్ది కేసులకే పరిమితం. అత్యధిక కేసులను ఇంకా ప్రత్యక్ష పద్ధతిలోనే విచారిస్తున్నారు. ఇకనైనా విస్తృతంగా వర్చువల్‌ విచారణలను చేపట్టకపోతే పెండింగ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతాయి. కొవిడ్‌ మహమ్మారి ముగిసిన తరవాతనైనా అన్ని కోర్టులూ వర్చువల్‌ విచారణ పద్ధతికి మారాలి. అది సాధ్యం కాకపోతే వీలైనన్ని ఎక్కువ కేసులను వర్చువల్‌గా, మిగతా కేసులను పాత పద్ధతిలో విచారించి వేగంగా తీర్పులు ఇవ్వాలి. వర్చువల్‌ విచారణలకు కావలసిన కంప్యూటర్లు, సంబంధిత సాధనాలను ఇప్పటికే న్యాయస్థానాలు సమకూర్చుకున్నాయి. కొవిడ్‌ వల్ల న్యాయవాదులు సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకుని వీడియో కాల్స్‌ చేస్తున్నారు. కొవిడ్‌ అనంతరం ఈ ప్రక్రియ ఊపందుకుని వర్చువల్‌ కోర్టులు ముమ్మరం కావచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని స్వీయప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించి కొవిడ్‌ సంక్షోభాన్ని మహదవకాశంగా మార్చుకోవాలి. భారత్‌లో 75శాతం కేసులు సంవత్సర కాలమైనా పరిష్కారానికి నోచుకోవడంలేదు. భారత్‌ ఈ పద్ధతిని మార్చుకుని శీఘ్ర న్యాయం అందించాలి.

జాప్యాన్ని నివారించాలంటే?

హైకోర్టుల్లో 33 శాతం న్యాయమూర్తుల పదవులను దిగువ కోర్టుల నుంచి భర్తీ చేస్తారు. మిగిలిన పదవులను మంచి ప్రాక్టీస్‌ ఉన్న న్యాయవాదులతో భర్తీ చేస్తారు. అయితే, వకీళ్లుగా అగ్రశ్రేణికి చేరుకుని దండిగా ఆదాయం ఆర్జిస్తున్న విఖ్యాత న్యాయవాదులెవరూ ఈ పదవులు స్వీకరించడానికి ముందుకు రావడం లేదు. దీనికి బదులు దిగువ కోర్టుల న్యాయమూర్తులతో 80శాతం హైకోర్టు పదవులను భర్తీచేసే పద్ధతిని పాటిస్తే అనుభవజ్ఞులు లభ్యమవుతారు. దిగువ కోర్టులవారు పైకి ఎదిగే అవకాశం లభిస్తుంది. కేసులు వేగంగా పరిష్కారమవుతాయి. జడ్జి పదవుల్లో ఖాళీలు దీర్ఘకాలం భర్తీ కానందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు జవాబుదారీ వహించి, సమస్యను తక్షణం పరిష్కరించాలి.

-శైలేష్​ గాంధీ (కేంద్ర మాజీ సమచార కమిషనర్​)

ఇదీ చదవండి : 'న్యాయ వ్యవస్థపై నియంత్రణ తగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.