ETV Bharat / opinion

మారని హస్తరేఖలు.. కుటుంబ పరిధి దాటని కాంగ్రెస్​!

author img

By

Published : Sep 1, 2020, 8:01 AM IST

Updated : Sep 1, 2020, 12:22 PM IST

కాంగ్రెస్ పార్టీలో పెద్దగా మార్పులేమీ కనబడట్లేదు. పార్టీ పెత్తనంలో కుటుంబ పరిధి మారలేదు. గాంధీ కుటుంబం నుంచి చేజారనూలేదు. రాహుల్ నాయకత్వ తీరు మారలేదు. సీనియర్ల అంసంతృప్తి మారలేదు...

no-change-in-congress-party-leadership-and-inner-side
హస్త రేఖలు మారలేదు.. వారి పెత్తనం చేజారలేదు!

కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితులేమీ మారలేదు. ఇందిరాగాంధీ కాలం నుంచీ ఒకే విధమైన ప్రస్థానం సాగుతోంది. హస్తం పార్టీ గాంధీల కుటుంబం నుంచి తప్ప, ఇతరులెవ్వరినీ తమ నేతగా అంగీకరించబోదనేది ఇప్పటికే రుజువైన సత్యం. సోనియాగాంధీ, కాకపోతే రాహుల్‌గాంధీ. ప్రస్తుతం ప్రియాంకగాంధీ రిజర్వులో సిద్ధంగా ఉన్నారు. వంధిమాగధుల బృందం లేకుండా ఆలోచన కూడా చేయలేని అశక్తత గాంధీ కుటుంబానిది. అధినాయకత్వానికి నమ్మకస్తులైన ఓ అర డజను మందిదాకా ఉండే నేతలే నిజమైన హైకమాండ్‌. సలహాలు ఇచ్చేదీ, నిర్ణయాలు తీసుకునేదీ వీరే. మీడియా భాషలో వీరిని కోటరీగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సంస్కృతి ఇందిరాగాంధీ హయాములోనూ కొనసాగింది. కాకపోతే, దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీలో వాస్తవిక పరిస్థితులు ఏమిటనేది ఆమెకు బాగా తెలుసు. ఇందిర స్థాయిలో రాజకీయ పరిణతిని సోనియా నుంచి ఆశించడం సమంజసం కాకపోవచ్ఛు అందువల్లే రాజకీయ వ్యవహారాల నిర్వహణ కోసం సోనియాకు కోటరీ అవసరమవుతోంది. పార్టీపై తన పట్టు నిలబెట్టుకొనేందుకు ఇదంతా ఆమెకు ఉపయోగపడుతూ ఉండవచ్చేమో గానీ, దేశంలోని పురాతన పార్టీకి మాత్రం భారీ నష్టాన్నే మిగిల్చిందని చెప్పాలి.

మెరిపించలేదు ఎందుకు?

రాహుల్‌ను విజయవంతమైన నేతగా తీర్చిదిద్దడంలో కాంగ్రెస్‌ నేతలు సమష్టిగా ఎందుకు కృషి చేయలేకపోతున్నారనేది పెద్ద ప్రశ్నే. శక్తిమంతమైన ప్రజానేతకు ఉండాల్సిన ఆకర్షణ రాహుల్‌లో తక్కువే. కాంగ్రెస్‌లో కోటరీ ప్రాధాన్యాన్ని, అంతర్గత రాజకీయాల్ని, సంస్థాగత సవాళ్లను ఆయన అర్థం చేసుకోవాల్సి ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఓటమి తరవాత రాహుల్‌ చాలా రోజులు సమీక్షాసమావేశాలు నిర్వహించారు.

అన్ని రాష్ట్రాల కార్యకర్తల అభిప్రాయాల్ని, ఫిర్యాదుల్ని విన్నారు. పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా సోనియా కోటరీని పక్కనపెడుతూ, కొత్త జట్టును నిర్మించే కసరత్తు మొదలుపెట్టారు. ఇది సదుద్దేశంతో వేసిన ఎత్తుగడే అయినా, అనుభవ లేమితో కొన్ని తప్పులు దొర్లాయి. రాహుల్‌ చుట్టూ చేరిన ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న యువనేతలు... 135 ఏళ్ల పురాతన పార్టీ సంప్రదాయాలతో మమేకం కాలేకపోయారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల్లో నేతలను నామినేట్‌ చేసే పద్ధతిని రాహుల్‌ ఆపేశారు. పార్టీలో యథాతథ స్థితిని కోరుకునే వారికి ఇదంతా కొరుకుడు పడలేదు. రాహుల్‌ అక్కడితో ఆగకుండా, యువనేతలకు రాష్ట్రశాఖల పగ్గాలు అప్పగించడం మొదలుపెట్టడం పాతనేతలకు మింగుడుపడలేదు.

2014 నుంచి 2019 మధ్య పార్టీని సంస్కరించేందుకు రాహుల్‌ చేయగలిగినన్ని ప్రయత్నాలూ చేశారు. మరోవైపు, పార్టీలో రాహుల్‌ తమను మార్గదర్శకులుగా అంగీకరిస్తేనే, తాము మంచి సలహాలు ఇస్తామనేలా సీనియర్ల వ్యవహార శైలి సాగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్న రాహుల్‌ నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో ఇది మునుపెన్నడూ లేని పరిణామమే అయినా, కోటరీ మాత్రం సంతోషించినట్లు తెలుస్తోంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేలా సోనియాను ఒప్పించడంలో అహ్మద్‌పటేల్‌, చిదంబరం, ఆంటొనీ, వోరా వంటి నేతలు సఫలీకృతులయ్యారు. ఈ నేతలంతా ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, హైకమాండ్‌లో భాగంగా చేసి ఉండకపోతే- రాహుల్‌ తనకు నచ్చిన వారిని పార్టీకి అధ్యక్షుడిగా చేసుకోవడంలో విజయం సాధించేవారు. అది వీరికి ఇష్టం లేదు. తాత్కాలిక అధ్యక్ష పదవి చేపట్టేలా ప్రియాంక తల్లికి నచ్చజెప్పడంతో నాయకత్వం గాంధీ కుటుంబం నుంచి చేజారలేదు.

నేతల అసంతృప్తి...

ఇటీవలి పరిణామాల విషయానికొస్తే, 23 మంది సీనియర్‌ నేతల లేఖ పార్టీలో గందరగోళానికి దారితీసింది. పార్టీలో రాజ్యసభ టికెట్లు అసంతృప్తికి కారణమయ్యాయి. రాహుల్‌ తన సన్నిహితులైన కేసీ వేణుగోపాల్‌, రాజీవ్‌ సాతవ్‌లకు రాజ్యసభ అవకాశాన్ని కల్పించడం... ఆజాద్‌, సిబల్‌, ఆనంద్‌ శర్మ వంటి నేతలకు అంగీకారయోగ్యం కాలేదు. ఇలా చాలామంది అసంతృప్తితో ఉండటాన్ని మంచి అవకాశంగా భావించిన కోటరీ నేతలు ఈ పరిణామాలను రాహుల్‌కు వ్యతిరేకంగా వాడుకున్నట్లు విదితమవుతోంది.

సోనియానే తాత్కాలిక అధ్యక్షరాలిగా కొనసాగేలా ఒప్పించారు. మొత్తానికి... కాంగ్రెస్‌ ఎదుట సోనియా, ప్రియాంక, రాహుల్‌ అనే మూడు ఐచ్ఛికాలే ఉన్నాయి. కాంగ్రెస్‌పై పెత్తనాన్ని ఇతరులకు అప్పగించడం గాంధీల కుటుంబానికి సాధ్యం కాదన్నదీ నిజమే. 2024 వరకు కాంగ్రెస్‌ తన సొంతింటిని చక్కదిద్దుకునే కార్యక్రమాల్లోనే మునిగి తేలే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

- రాజీవ్‌ ఆచార్య

(సీనియర్‌ పాత్రికేయులు)

ఇదీ చదవండి: రాజీ కుదిరేనా.. నేడు మరోసారి రాజస్థాన్ సీఎల్పీ భేటీ

Last Updated : Sep 1, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.