ETV Bharat / opinion

గ్రామీణానికి నయా వృద్ధి నమూనా

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. కరోనా మహమ్మారి ధాటికి వలసకూలీలు పడిన వెతలు ఇంకా మన కళ్లముందే కదలాడుతున్నాయి. పట్టణాల్లో ఉండలేక, స్వగ్రామంలో ఉపాధి లేక వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఇలాంటి పరిస్థితులను అధిగమించాలంటే.. పాలకుల చిత్తశుద్ధితో గాంధేయ గ్రామస్వరాజ్ నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Neo growth model for rural
గ్రామీణానికి నయా వృద్ధి నమూనా
author img

By

Published : Jul 4, 2020, 9:55 AM IST

కొవిడ్‌ తాకిడికి కోట్లమంది వలస కూలీలు పట్టణాలు వదలి స్వగ్రామాలకు పయనమై వెళుతూ నానా అగచాట్లపాలు కావడం అందరి మనసులనూ కలచివేసింది. పొట్ట చేత్తోపట్టుకుని నగరాలకు చేరిన నిరుపేద కూలీలకు స్వస్థలాల్లోనే జీవనాధారం కల్పించాల్సిన ఆవశ్యకతను కరోనా కల్లోలం తెలియజెప్పింది. పల్లెల్లోనే మెరుగైన జీవన స్థితిగతులను, ఉపాధిని కల్పిస్తే కోట్ల మంది ఏటా దూర స్థలాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పుతుంది. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతుంది. దేశంలోని ఆరున్నర లక్షల పైచిలుకు గ్రామాల్లో నివసిస్తున్న 80 కోట్లమంది పౌరులు స్వావలంబనతో జీవించడానికి సాంకేతికత అమోఘంగా ఉపకరించగలదు. దీన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో గ్రామీణ విజ్ఞాన వేదికను ఏర్పాటుచేయాలి. భారత్‌లో గత పదేళ్లలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు విజృంభించాయి. వేర్వేరు అంచనాల ప్రకారం వీరి సంఖ్య 7.2 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన చైనా తరవాత అత్యధిక వలస కూలీలు ఉన్నది ఇండియాలోనే.

గాంధేయ గ్రామస్వరాజ్‌

గ్రామీణానికి నయా వృద్ధి నమూనా గ్రామాలు స్వయంసమృద్ధం కావాలన్నదే గాంధీజీ గ్రామస్వరాజ్య పరమార్థం. మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక చంపారన్‌ (1917), సేవాగ్రామ్‌ (1920), వార్థా (1938) వంటి గ్రామీణ ఉద్యమాలను నడిపించారు. గ్రామ స్థాయిలో వికేంద్రీకృత రాజకీయ యంత్రాంగం ఏర్పడాలని, మౌలిక వసతుల నిర్మాణ పనులు చేస్తూ గ్రామీణులు ఆర్థిక స్వావలంబన, సామాజిక సమానత్వం సాధించుకునే వాతావరణం నెలకొనాలని లక్షించారు. స్వయంసమృద్ధ గ్రామాలనే సారవంతమైన నేలలో నిజమైన ప్రజాస్వామ్యం వేళ్లూనుకొంటుందని ఆయన ప్రబోధించారు. 'గ్రామ స్వరాజ్యమంటే ప్రతి గ్రామం ఓ గణతంత్ర రాజ్యంగా విలసిల్లడం. తన మౌలిక అవసరాలను తానే తీర్చుకుంటూ ఇరుగుపొరుగు గ్రామాలతో ఇచ్చిపుచ్చుకొనే గ్రామ రాజ్యమది. స్వావలంబన, పరస్పరావలంబనల ఉత్తమ గుణ సంగమమే గ్రామ స్వరాజ్యం' అని గాంధీజీ ఉద్ఘాటించారు. గ్రామ స్వరాజ్యమంటే పల్లె ప్రజలు స్థానికంగా పనిపాటలు చేసుకుంటూ ఎక్కువ ఉత్పాదకతతో అధిక ఆదాయాలు పొందడం. గ్రామాభివృద్ధికి సాంకేతికత కీలకమని గాంధీజీ గుర్తించారు. సంప్రదాయ రాట్నాన్ని సాంకేతిక హంగులతో ఆధునికంగా తీర్చిదిద్దగలిగేవారికి లక్ష రూపాయల (నేటి విలువలో దాదాపు రెండున్నర కోట్ల రూపాయల) బహుమానం ఇస్తామని నాటి బ్రిటిష్‌, భారతీయ వార్తాపత్రికల్లో ఆయన ప్రకటించారనే సంగతి చాలామందికి తెలియదు.

గ్రామాలకు ఆధునిక వసతుల కల్పనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ గ్రామీణాభివృద్ధికి పుర పథకాన్ని ప్రతిపాదించారు. 50 నుంచి 100 గ్రామాలను ఒక సముదాయంగా ఏర్పరచి ఉమ్మడి వసతులు, మార్కెట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణాభివృద్ధి ఊపందుకొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సముదాయాన్ని 'పుర కాంప్లెక్స్‌'గా వ్యవహరించారు. పుర సముదాయాలను రోడ్ల వంటి భౌతిక వసతులతో; సాంకేతిక, విజ్ఞాన, ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానించాలని కలామ్‌ ప్రతిపాదించారు. ఈ నాలుగు సంధానాలతో గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయన్నారు. కలామ్‌ 2004 జనవరిలో చండీగఢ్‌లో జరిగిన భారత జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ 90వ మహాసభలకు పుర నమూనాను సమర్పించారు. స్వయంసమృద్ధ గ్రామాలే పునాదిగా భారతదేశం ఆర్థికంగా సమున్నత శిఖరాలను అందుకోగలుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. కొన్ని గ్రామాలను కలుపుతూ 30 కిలోమీటర్ల చుట్టుకొలతతో రింగు రోడ్డు నిర్మించి, సముదాయంలోని గ్రామాలన్నింటికీ బస్సు సౌకర్యం ఏర్పరచి ఉమ్మడి మార్కెట్‌గా రూపాంతరం చెందించడం పుర పథకంలో కీలక భాగం. దీనివల్ల పట్టణాలపై ఒత్తిడి తగ్గి, పుర గ్రామ సముదాయాల్లోనే నివాస వసతులు వృద్ధి చెందుతాయి. పోనుపోను గ్రామాల నుంచి గ్రామాలకు వలసలు జరుగుతూ, గ్రామాల నుంచి పట్టణాలకు వలస రద్దీ తగ్గుతుంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద ఒక్కో యూనిట్‌కు రూ.130 కోట్ల ఖర్చుతో మొత్తం 7,000 పుర సముదాయాలను నిర్మించాలని కలామ్‌ పుర పథకం ప్రతిపాదించింది. పుర గ్రామ సముదాయాల్లో పట్టణాలకు తీసిపోని జీవన నాణ్యతను అందించాలని కలామ్‌ కలగన్నారు.

మానవతావాద నమూనా

నానాజీ దేశ్‌ముఖ్‌ సంపూర్ణ మానవతావాద నమూనా స్వయంసమృద్ధ గ్రామాలను స్వప్నించింది. దేశంలోని 500 గ్రామాల్లో, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌ ప్రాంతంలో దేశ్‌ముఖ్‌ ఈ నమూనాను అమలుచేశారు. నిరుద్యోగ రహిత గ్రామాలను సృష్టించడం, పేదరికాన్ని నిర్మూలించడం, న్యాయపరమైన వివాదాలను స్థానికంగానే పరిష్కరించుకోవడం, వితంతు పునర్వివాహాలు- ఈ నమూనాలో అంతర్భాగాలు. గ్రామాలను సముదాయాలుగా ఏర్పరచి సాంఘిక, ఆర్థిక, విద్యావైద్య వసతులను ఏర్పరచాలని దేశ్‌ముఖ్‌ నమూనా ప్రతిపాదించింది. అధునాతన సాంకేతికత వినియోగానికి పెద్ద పీట వేసింది. నేడు ప్రపంచమంతటా సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కృత్రిమ మేధ, అంతర్జాలాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. విదేశాల్లో భారీయెత్తున అవలంబిస్తున్న ఆధునిక సేద్య పద్ధతుల సమాచారాన్ని మన రైతులకు అందించి, ప్రపంచ విపణిలో పంటల ధరవరలను ఎప్పటికప్పుడు మన రైతాంగానికి తెలియబరచడానికి ఈ సాంకేతికతలు తోడ్పడతాయి. తద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. చిన్న, మధ్యతరహా రైతులకు సాధికారత కల్పించడానికి కొత్తగా చేపట్టిన 10,000 వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల కార్యక్రమం దేశ్‌ముఖ్‌ నమూనాకు అనుగుణంగా ఉంది. గాంధీ, కలామ్‌, దేశ్‌ముఖ్‌లు కలగన్న గ్రామీణాభివృద్ధిని సాకారం చేయడానికి నిధుల సమీకరణకు ఆత్మనిర్భర్‌ బాండ్లను విడుదల చేసే విషయం కేంద్రం ఆలోచించాలి. వాణిజ్య బ్యాంకులిచ్చే ప్రాధాన్య రుణాల్లో కొంత భాగాన్ని ఈ బాండ్ల కొనుగోలుకు వెచ్చించాలి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో మన యువతను విద్యార్థి దశ నుంచే సిద్ధం చేయాలి. ఇంజినీరింగ్‌, వైద్య, బిజినెస్‌ స్కూళ్ల పాఠ్యప్రణాళికలను తదనుగుణంగా రూపొందించాలి. యువతరంలో నిబిడీకృతమైన నవీకరణ శక్తిని గ్రామాభ్యుదయానికి నియోగించాలి.

మహనీయులు చూపిన బాటలో...

భారత్‌లోని ప్రతి నలుగురు కార్మికుల్లో ఒకరు వలసవచ్చినవారే. వలస కూలీల జీవితం ఎంత దినదిన గండంగా గడుస్తుందో కరోనా సంక్షోభంవల్ల లోకానికి తెలిసివచ్చింది. కోట్లాది వలస కూలీలు స్వస్థలాలకు తిరిగివెళ్లారని అంచనా. వీరిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్రాలు చేసిన ప్రయత్నాలు సముద్రంలో నీటిబొట్టులా మిగిలాయి. గ్రామాల్లో బతుకు వెళ్లదీయలేక పట్టణాలు, నగరాలకు జనం వలస వెళ్లాల్సిన దుస్థితిని సత్వరం నివారించాలి. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని కొత్త అభివృద్ధి నమూనాలను తక్షణమే చేపట్టాలి. అదృష్టవశాత్తు అలాంటి ప్రత్యామ్నాయ నమూనాలను జాతీయ మహామహులు మనకు ముందే అందించారు. జాతిపిత మహాత్మా గాంధీ, పూర్వ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌, సామాజిక ఉద్యమశీలి నానాజీ దేశ్‌ముఖ్‌లు ప్రతిపాదించిన గ్రామీణాభివృద్ధి నమూనాలు తక్షణం అనుసరణీయం.

ఇదీ చూడండి: 'వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.