ETV Bharat / opinion

'ఎంఎస్​ఎంఈ'లకు ఊరటే తప్ప.. భరోసా ఏదీ?

పరిశ్రమలు పడకేసి ఆర్థికాభివృద్ధి పూర్తిగా కుంటుపడిన నేపథ్యంలో వ్యవసాయం తరవాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మాత్రమే. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భిన్న వర్గాల సమాహారంగా విలసిల్లుతున్న ఎంఎస్‌ఎంఈలను ప్రాంతీయ అసమానతలను తగ్గించే సాధనాలుగా పరిగణిస్తారు. ఈ రంగాన్ని ఆదుకొనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ కొంత ఊరట కలిగించినా.. పూర్తి భరోసా ఇవ్వలేకపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

MSMSE's need big help to recover from covid crisis
చిరు దివ్వెలకు చమురేదీ? ఎంఎస్‌ఎంఈలకు ఊపిరి పోయాలి
author img

By

Published : Jun 22, 2020, 9:02 AM IST

Updated : Jun 22, 2020, 10:30 AM IST

ప్రజా జీవనాన్ని కరోనా మహమ్మారి తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. పరిశ్రమలు పడకేసి ఆర్థికాభివృద్ధి పూర్తిగా కుంటువడిన నేపథ్యంలో వ్యవసాయం తరవాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మాత్రమే. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భిన్న వర్గాల సమాహారంగా విలసిల్లుతున్న ఎంఎస్‌ఎంఈలను ప్రాంతీయ అసమానతలను తగ్గించే సాధనాలుగా పరిగణిస్తారు. దేశంలోని టైర్‌-1, టైర్‌-2 నగరాల్లో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు బాగా విస్తరించాయి. ఈ నగరాల్లో పరిశ్రమల స్థాపన ఇతర అవసరాలకోసం బ్యాంకింగ్‌ సేవలను పెద్దయెత్తున వినియోగించడం ద్వారా సమాజంలోని అనేక వర్గాలను సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పథం తొక్కించడమే లక్ష్యం కావాలి. ఇప్పటికీ దేశంలో సుమారు 90 శాతం ఎంఎస్‌ఎంఈ నిర్వాహకులు మూలధన నిధుల సేకరణ ఇతర అవసరాలకోసం బ్యాంకేతర మార్గాలపై ఆధారపడుతున్నారు. తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్‌కు సమర్థంగా తరలించే అనుసంధాన వ్యవస్థలు కొరవడ్డాయి. లాభాలు తక్కువగా ఉండటంతో సమర్థమైన మానవ వనరులకు చోటు కల్పించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దానితోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే ఆర్థిక వెసులుబాటూ ఈ పరిశ్రమలకు లేదు. నూతన సాంకేతికతకు దూరమైన పరిశ్రమలకు ఉత్పత్తి రంగంలో ఉబికివస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలూ దూరమవుతాయి.

ఎన్నో సవాళ్లు...

పాత యంత్రాల వినియోగంవల్ల నాణ్యత తగ్గడంతోపాటు ఉత్పత్తి వ్యయమూ పెరుగుతోంది. తద్వారా భారీ పరిశ్రమలతో పోటీలో నిలబడలేక ఎంఎస్‌ఎంఈల రంగం వెనకబడుతోంది. ఇ-గవర్నెన్స్‌ సదుపాయాలను వినియోగించుకోలేకపోవడం అతిపెద్ద సవాలు. ఆన్‌లైన్‌ అమ్మకాలను చేపట్టకపోవడమూ సమస్యగానే ఉంది. వాణిజ్యాన్ని సులభతరం గావిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలపై ఎంఎస్‌ఎంఈల రంగంలోని చాలామందికి అవగాహన ఉండటం లేదు. అవినీతి ఎల్లెడలా విస్తరించడం, న్యాయ వివాదాల పరిష్కారానికి సరైన వ్యవస్థలు లేకపోవడం ఈ రంగం విస్తరణకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. దేశంలో 11 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం- జీడీపీలో 30 శాతానికి, తయారీ రంగంలో 45శాతానికి, ఎగుమతులపరంగా 40శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. రుణ సదుపాయం అందుబాటులో లేకపోవడం, బహుళ జాతి సంస్థలనుంచి పోటీ పెరుగుతుండటం, మౌలిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, ముడి వనరుల కొరత వంటివి ఈ రంగం విస్తరణకు అడ్డంకులుగా ఉన్నాయి.

పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులో లోటుపాట్ల కారణంగా గడచిన నాలుగేళ్లుగా ఈ రంగం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. బ్యాంకింగ్‌ రంగంలో తలెత్తిన సంక్షోభాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల సమస్యలు ఈ రంగాన్ని మరింత కుంగదీశాయి. కరోనా నేపథ్యంలో విధించిన ‘లాక్‌డౌన్‌’ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు చావుదెబ్బగా పరిణమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ పరిశ్రమలకు అవసరమైన రుణ సదుపాయాన్ని 59 నిమిషాల్లో అందే ఏర్పాటు చేశారు.

సమగ్ర సంస్కరణలు అవసరం

ఈ రంగాన్ని ఆదుకొనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ కొంత ఊరట కలిగించినా, పూర్తి భరోసా ఇవ్వలేకపోయింది. జీఎస్‌టీ చెల్లింపులు నమోదు చేసుకున్న పరిశ్రమలకు కేవలం రెండు శాతం వడ్డీతో రుణ సదుపాయం కల్పించడం, వ్యాపార బిల్లులకు ఇ-డిస్కౌంటింగ్‌ పద్ధతిలో మినహాయింపులు ప్రకటించడం వంటి ప్రోత్సాహక చర్యలను కేంద్రం ప్రతిపాదించింది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల వస్తుత్పత్తిని ఇ-వాణిజ్య అంతర్జాల వేదికల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోవడం; ప్రభుత్వ రంగ సంస్థలు తప్పనిసరిగా పాతిక శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని షరతులు విధించడం, ఇ-మార్కెట్‌ ప్లేస్‌ ద్వారా ప్రత్యక్షంగా ముడిసరకుల కొనుగోలుకు ఉపక్రమించడం వంటి అభినందనీయమే. ఈ పరిశ్రమలకు అత్యవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు దేశవ్యాప్తంగా 20 హబ్‌లను ఏర్పాటు చేశారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా కల్పించే రుణ సదుపాయాన్ని పది లక్షలనుంచి 20 లక్షల రూపాయలకు పెంచడం వంటివి ఆహ్వానించదగిన చర్యలే. ఏకగవాక్ష విధానాన్ని సమర్థంగా అమలు జరిపితే వీటి విస్తరణ బాగుంటుంది. గడచిన కొన్నేళ్లుగా పదిశాతం వృద్ధి రేటుతో విస్తరిస్తున్న ఈ రంగానికి- కరోనా కారణంగా పెద్ద దెబ్బ తగిలింది. ఎక్కడికక్కడ చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు ద్రవ్య లభ్యత కొరవడి దిక్కులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించినా- ఈ పరిశ్రమల ఉత్పత్తులకు తగిన డిమాండ్‌ ఉంటుందా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్నగా మారింది. అందుకోసం ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకూ నిర్మాణాత్మక చర్యలతో ముందుకు రావలసి ఉంది. అమ్మేవాళ్లు ఉండి... కొనేవాళ్లు లేకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే క్రమంలో భాగంగా సమతుల్య వ్యూహంతో ముందుకు కదలాలి.

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య(రచయిత- వాణిజ్య శాస్త్ర నిపుణులు)

Last Updated : Jun 22, 2020, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.