ETV Bharat / opinion

MP Election Vindhya Region : ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్​.. బీజేపీ-కాంగ్రెస్​ 'ఢీ'.. వింధ్యలో విజయం ఎవరిదో? - మధ్యప్రదేశ్​ ఎన్నికలు 2023 వింధ్య

MP Election Vindhya Region : మన దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్న ప్రాంతాల్లో మధ్యప్రదేశ్‌లోని వింధ్య ఒకటి. మధ్యప్రదేశ్‌లో అధికారం దక్కాలంటే ఈ ప్రాంతంలో సత్తా చాటడం కీలకం. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో బీజేపీ 24 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు చాలా మారాయి. ఈసారి కూడా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా కలిగిన వింధ్యలో సత్తా చాటి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టాలని ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా గట్టిగా యత్నిస్తోంది.

MP Election Vindhya Range
MP Election Vindhya Range
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 6:52 AM IST

MP Election Vindhya Region : ఉత్తర్‌ప్రదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో 9 జిల్లాలు ఉన్నాయి. వాటిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 30. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీని దక్కించుకోలేకపోయింది. అందుకు ప్రధాన కారణం- ఆ పార్టీ వింధ్యలో బోల్తా పడటమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వింధ్యలో ఏకంగా 24 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్‌ ఆరు సీట్లకే పరిమితమైంది. అందుకే ఈ సారి వింధ్యలో పట్టు సాధించాలని ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

బీజేపీ ధీమా!
2003 తర్వాత సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా ఓబీసీలు, గిరిజనులు, దళితుల ఓట్లను బీజేపీ ఎక్కువగా ఆకర్షించింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక ఓబీసీల్లో ఎక్కువ మంది బీజేపీవైపే నిలిచారు. గత కొన్నేళ్లుగా మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వింధ్య ప్రాంతంలో 2018 నాటి ఫలితాలే పునరావృతం అవుతాయని బీజేపీ ధీమాతో ఉంది. మొత్తం 30 స్థానాల్లో 24 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

వింధ్యపై కమలం ప్రత్యేక దృష్టి
Vindhya Range Madhya Pradesh Election : గత అసెంబ్లీ ఎన్నికల్లో వింధ్య ప్రజలు కమలదళానికి పట్టం కట్టినా.. తర్వాత పరిస్థితుల్లో మార్పు మొదలైంది. రీవా మేయర్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. 2021 నాటి ఉప ఎన్నికల్లో సత్నా జిల్లాలోని రాయ్‌గావ్‌లోనూ హస్తం పార్టీ జయభేరి మోగించింది. తాజాగా వింధ్యలో బ్రాహ్మణ ఓటర్లను ప్రభావితం చేయగల కీలక నేత నారాయణ్‌ త్రిపాఠి తమ గూటికి చేరడం కాంగ్రెస్‌కు కొత్త జోష్‌నిస్తోంది. ఓబీసీలకు బీజేపీ తమకంటే అధిక ప్రాధాన్యమిస్తోందన్న భావన స్థానిక రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణుల్లో ఇప్పటికే మొదలైంది. 2020లో కమల్‌నాథ్‌ సర్కారు కూలిపోయాక గద్దెనెక్కిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. వింధ్య ప్రాంత ఎమ్మెల్యేలెవరికీ మంత్రివర్గంలో చోటివ్వలేదు. ఈ పరిణామాలన్నీ బీజేపీకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం వింధ్యపై ప్రత్యేక దృష్టిసారించింది.

బీజేపీ X కాంగ్రెస్​
వింధ్యలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ సర్కారుపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందున ఈసారి వింధ్యలోని 30 స్థానాల్లో 22 చోట్ల తాము గెలుస్తామని వారు ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలకు ఇక్కడ చోటు లేదని వారు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం సీధీ జిల్లాలో అగ్రవర్ణాలకు చెందిన ఓ వ్యక్తి.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. అప్పటి బీజేపీ నేత సీధీ ఎమ్మెల్యే కేదార్‌ శుక్లాకు ఆ కేసు నిందితుడు దూరపు బంధువని ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. గిరిజన ఓటర్లు పార్టీకి దూరమయ్యే ముప్పుందని గ్రహంచిన సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. నాడు నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆదివాసీ వ్యక్తి కాళ్లు కడిగారు. ప్రస్తుత ఎన్నికల్లో శుక్లాను కాదని.. సీధీ ఎంపీ రీతి పాఠక్‌కు బీజేపీ టికెట్‌ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీని వీడిన శుక్లా.. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

ఆమ్​ఆద్మీ ఖాతా తెరుస్తుందా?
వింధ్య ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన రాజకీయ పార్టీలకు ఈ ప్రాంతం ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటుంది. కొత్త పార్టీలను అక్కున చేర్చుకుంటుంది. కమ్యూనిస్టులు నుంచి బీఎస్పీ వరకు ఆ ప్రాంతంలో జయకేతనం ఎగురవేసినవారే. అందుకే మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఖాతా తెరవాలని భావిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ వింధ్యపై ఎక్కువగా దృష్టిసారించింది. ఈ ప్రాంతంలోని సింగ్రౌలీ మేయర్‌ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ ఆప్‌ అధ్యక్షురాలు రాణి అగ్రవాల్‌ విజయం సాధించారు. తద్వారా బీజేపీ ఆధిపత్యానికి గట్టి సవాల్‌ విసిరారు. ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున దిల్లీ, పంజాబ్‌ సీఎంలు వింధ్యలో విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఒంటరిగా బరిలో ఎస్పీ
ఉత్తర్‌ప్రదేశ్‌తో సరిహద్దును కలిగి ఉండటం వల్ల వింధ్య ప్రాంతంలో ఎస్పీ, బీఎస్పీల ప్రభావం కనిపిస్తుంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ.. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తమకు కనీసం 6 సీట్లు కేటాయిస్తుందని ఆశించింది. కానీ చర్చలు విఫలమవడం వల్ల ఒంటరిగా బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉండటం వల్ల ఈ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్​
మన దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్న ప్రాంతాల్లో వింధ్య కూడా ఒకటి. ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందిన ఈ ప్రాంతం తగినంత అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా వింధ్యలో మెజార్టీ అసెంబ్లీ సీట్లు సాధించి.. రాష్ట్రంలో అధికారానికి బాటలు పరుచుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. నవంబర్‌ 17న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

MP CM Constituency Budhni : సొంతగడ్డపై సత్తాచాటేందుకు శివరాజ్​ రెడీ.. VIP నియోజకవర్గంలో విజయం ఎవరిదో?

MP Election Ayodhya Ram Mandir : బీజేపీ X కాంగ్రెస్​.. అయోధ్య రాముడి చుట్టూ మధ్యప్రదేశ్​ ఎన్నికల ప్రచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.