ETV Bharat / opinion

అందరికీ అందని భూమి ఫలాలు.. సంస్కరణలు అసంపూర్ణమే! - భూ చట్టాలు

గడిచిన 75 ఏళ్లలో మూడు దశల్లో పేదలకు భూములు అందించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందంటున్నారు నిపుణులు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వినూత్న పద్ధతుల్లో పేదలకు భూములు దక్కేలా ప్రయత్నాలు కొనసాగాల్సిందేనని సూచిస్తున్నారు.

land reforms in india
అందరికీ అందని భూమి ఫలాలు
author img

By

Published : Sep 10, 2021, 7:26 AM IST

ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, శాంతిస్థాపన, రాజ్యాంగ లక్ష్యాల సాధన, ప్రజలకు ఆహార భద్రతా లక్ష్యాలు సాకారం కావాలంటే ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉండటం అవసరం. అందుకే స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల నుంచే భూసంస్కరణలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైన భూమి అందరికీ దక్కేలా ప్రయత్నాలను ఆరంభించాయి. ఇందుకోసం ప్రపంచంలో ఏ దేశమూ చేయనన్ని భూ చట్టాలను రూపొందించాయి. గడిచిన 75 ఏళ్లలో మూడు దశల్లో పేదలకు భూములు అందించే ప్రయత్నాలు జరిగాయి.

జమీందార్లు, జాగీర్దార్లు, ఈనాందార్ల వ్యవస్థలను రద్దు చేసి భూమి సాగు చేసుకుంటున్న వారికే హక్కులను కల్పించారు. భూ కమతాలపై పరిమితి విధించి మిగులు భూములను పేదలకు పంచారు. కౌలుదారులకు హక్కులు కల్పించారు. వీటితో పాటు పేదలకు ప్రభుత్వ, భూదాన భూములు పంపిణీ చేస్తూనే అటవీ భూములపై హక్కులను కల్పించారు. వీటన్నింటితో దాదాపు తొమ్మిది కోట్ల కుటుంబాలకు మేలు కలిగింది. భూసంస్కరణలతో భారతదేశం సాధించిన ఫలితాలు తక్కువేమీ కాదు. కానీ, చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. దేశంలో భూసంస్కరణలు అసంపూర్ణంగానే మిగిలిపోయాయని దశాబ్దం క్రితం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని సంఘమే అభిప్రాయపడింది. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల దృష్ట్యా భూ సంస్కరణల ఆవశ్యకత మరింతగా పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

దున్నేవాడిదే భూమి

రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో ఆనాడు వందల వేల ఎకరాల భూమి కలిగిన భూస్వాములుండేవారు. అదే సమయంలో సెంటు భూమి సైతం లేని మూడు కోట్లకు పైగా పేద కుటుంబాల జీవితం దుర్భరంగా సాగేది. ఇతరుల భూమిలో కూలీలుగా, కౌలుదారులుగా బతికేవారే ఎక్కువ మంది ఉండేవారు. సాగు చేసుకునేవారికే భూమి ఉండాలని, అందరికీ ఎంతో కొంత భూమి ఉంటేనే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని భావించి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భూ సంస్కరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాంది పలికాయి. భూమి సాగుదారుడికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యవస్థలు రద్దయ్యాయి. వాస్తవ సాగుదారులకు హక్కులు దఖలుపడ్డాయి. అలా రెండున్నర కోట్ల మంది సాగుదారులు భూ యజమానులయ్యారు.

అప్పటి గ్రామీణ జనాభాలో 35శాతానికి పైగా కౌలు రైతులే. వారందరికీ రక్షణ కల్పించడం కోసం ప్రత్యేక చట్టాలు అమలులోకి వచ్చాయి. వీటితో 1.24 కోట్ల మంది కౌలు రైతులకు 1.56 కోట్ల ఎకరాల భూములపై హక్కులు దక్కాయి. ఆ తరవాత సీలింగ్‌ చట్టాలు వచ్చాయి. వాటితో అందుబాటులోకి వచ్చిన 54 లక్షల ఎకరాల మిగులు భూములను 56 లక్షల పేద కుటుంబాలకు పంచారు. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న భూములనూ పేదలకు పంపిణీ చేసింది. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమం ఫలితంగా 2.20 కోట్ల ఎకరాల భూమి పేదలకు అందింది.

వ్యవసాయ భూములను పేదలకు పంచడం సహా దాదాపుగా 40 లక్షల పేద కుటుంబాలకు పది సెంట్ల వరకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ సంస్కరణలన్నీ రెండు దశల్లో (1947-70, 1970-90) అమలు జరిగాయి. 1990వ దశకంలో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణతో మూడో దశ భూసంస్కరణల ఆవశ్యకత ఏర్పడింది. ప్రభుత్వ భూముల పంపిణీ, ఇంటి స్థలాల మంజూరు కొనసాగిస్తూనే కొత్తరకం సంస్కరణలకు అంకురారోపణ చేశారు. భూమి కొనుగోలు చేసి ఇవ్వడం, కౌలు చట్టాల్లో సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి. తరతరాలుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనుల హక్కులను గుర్తిస్తూ చట్టం చేసి దాదాపుగా 20 లక్షల ఆదివాసీ కుటుంబాలకు 42 లక్షల ఎకరాల అటవీ భూమిపై హక్కు పత్రాలు జారీ చేశారు. ఇన్నేళ్ల భూసంస్కరణల తరవాతా 53 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు. కేవలం నాలుగు శాతం లోపే ఉన్న మధ్యస్థ, పెద్ద రైతుల చేతుల్లోనే 40 శాతం భూమి ఉంది.

గమ్యం చేరాలంటే..

అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశాలన్నీ ఒక్కసారన్నా భూసంస్కరణలను సంపూర్ణంగా అమలు చేసినవే. భూ సంస్కరణలు అంటే పేదలకు భూమి పంచడం మాత్రమే కాదు. భూమితో ముడివడిన హోదాను, అధికారాన్ని, గుర్తింపును కూడా బదలాయించడం. అందుకే భూసంస్కరణలు చాలా క్లిష్టతతో కూడుకున్నవి. మార్కెట్ల సంస్కరణల యుగంలో భూ సంస్కరణలకు తావు లేదనుకోవడం సరైనది కాదు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వినూత్న పద్ధతుల్లో పేదలకు భూములు దక్కేలా ప్రయత్నాలు కొనసాగాల్సిందే.

ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యవసాయ సంబంధాలు, అసంపూర్ణ భూసంస్కరణల కమిటీ ఇచ్చిన నివేదిక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన భూకమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేస్తే ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. నీతి ఆయోగ్‌ సూచించినట్లుగా కౌలు చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలి. భూముల సర్వే పూర్తిచేసి, భూ రికార్డులను ఆధునికీకరించి, భూమి హక్కులకు పూర్తి హామీ ఇచ్చే టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థను సత్వరం తేవాల్సిన అవసరం ఉంది. భూ వివాదాలను సత్వరం పరిష్కరించడం కోసం జిల్లా రాష్ట్ర స్థాయుల్లో ట్రైబ్యునళ్ల ఏర్పాటు జరగాలి. భూమి ప్రకృతి వనరు. దాని ఫలాలు అందరికీ దక్కాలి. అందుకోసం ప్రయత్నాలు కొనసాగాలి.

తెలుగు రాష్ట్రాల్లో..

land reforms in india
తెలుగు రాష్ట్రాల్లో భూపంపిణీ..

దేశం మొత్తంలో పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూముల్లో 28శాతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. పంచిన భూమిలో ఎక్కువ శాతం సాగుకు పనికిరానిది! కాగితాలపైనే పంపిణీ సాగినవీ ఉన్నాయి. మరోవైపు పేదలకు పంచిన సర్కారీ భూముల్లో ముప్పై శాతానికి పైగా అన్యాక్రాంతం అయ్యాయని అంచనా. ఇప్పటికీ తెలంగాణలో 56శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 76శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు చేసిన 250కి పైగా భూచట్టాల వల్ల కొద్దిశాతం పేదలే భూమి హక్కులు పొందగలిగారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారికి చెందిన భూములు కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి.

-ఎం సునీల్​ కుమార్​ (రచయిత- భూచట్టాల నిపుణులు, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు)

ఇదీ చూడండి : దేశ ప్రజలకు రాష్ట్రపతి వినాయక చవితి శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.