ETV Bharat / opinion

లాక్​డౌన్లతో ఎంతకాలం.. కరోనాతో డేటింగ్ తప్పదు మరి! - corona virus news

"కూరలమ్ముకొనే వాడికే గానీ కుబేరులెవరికీ ఇబ్బంది లేని నిర్బంధాలు ఎంతకాలం చెల్లుతాయి? కూలీల బతుకులు కూలిపోతున్నాయని గ్రహించింది కాబట్టి కేంద్రం 'కరోనాతో సహజీవనం' తప్ప గత్యంతరం లేదని ప్రకటించింది." ఇది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న విషయమే. మరి వీరిద్దరీ సంభాషణేంటో చూద్దాం.

CORONA VIRUS
కరోనాతో డేటింగ్
author img

By

Published : May 13, 2020, 8:58 AM IST

"ఏం వాయ్‌ మైడియర్‌ వెంకటేశం! ఏమిటా హడావుడి! నీ వాలకం చూస్తుంటే ఏదో వినకూడనిదే విని షాకయినట్లున్నావు... ముందు ఆయాసం తీర్చుకో- తరువాత తీరిగ్గా చెబుదువుగాని... కూల్‌డౌన్‌ ఫస్ట్‌ ఐసే!"

....

"ఏమన్నావ్‌ సహజీవనమా! నేను తప్పుగా విన్నానా... నువ్‌ చెప్పడం పొరపాటా... యూ మీన్‌ డేటింగ్‌? ఇప్పుడు నీకు దాంతో ఏం పని పడింది?"

....

"డామిట్‌! ఇలాంటి మాటలంటేనే నాకు కోపం వస్తుంది. సహజీవనం గురించి నాకు తెలియకపోవడమా! ఈ ప్రపంచంలో నాకు తెలియని విషయమంటూ ఉందీ? ఆఫ్టరాల్‌ డేటింగ్‌! నేను పూనా డక్కన్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు డేటింగ్‌ విషయమై ఒక్కబిగిని గుక్క తిప్పుకోకుండా మూడు ఘంటలు లెక్చర్‌ ఇచ్చేసరికి ప్రొఫెసర్లంతా డంగయి పోయినారు! యూనో! మొన్నటికి మొన్న ‘ది ఎలెవెన్‌ కాజెస్‌ ఫర్ది టుడేస్‌ ప్రెడికమెంట్‌ డ్యూటు ది పేండమిక్‌ కొవిడ్‌ 19’ అనే అంశంపై ఇచ్చిన లెక్చర్‌ని ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఎంత ప్రముఖంగా ప్రచురించింది! మనవాళ్లు వుట్టి చాదస్తపు మూర్ఖులోయ్‌. డేటింగ్‌ కాన్సెప్టుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆ మాటకొస్తే డేటింగ్‌ చేయని ఇంగ్లీషువాణ్ణి చూశావూ? నా దగ్గర కాపర్స్‌ లేక బరిలోకి దిగలేదుగాని, లేకుంటే ఈ పాటికి నాతో ఎంతమంది డేటింగ్‌లో ఉందురూ!"

......

"నోనో సహజీవనం అంటే అదికాదు. పూటకూళ్లమ్మ దగ్గర సంతలో సామాను పేరు చెప్పి తీసుకొన్న సొమ్ము డాన్సింగర్లుకి సమర్పించడం డేటింగ్‌ కిందికి రాదు. అది ఆ పూటకే చెల్లు. సహజీవనం గురించి నీకెలా చెప్పేది? నువ్వు నిక్కరుకి ఎక్కువే అయినా జీన్‌పాంట్‌కి తక్కువైపోతివి! నీదింకా చాటింగ్‌ లెవల్‌... తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా చాటింగ్‌ ముదిరి డేటింగ్‌కి దారితీస్తుంది. అప్పటిదాకా నీకు వర్రీగాని, హర్రీగాని తగవు! పూర్‌ రిచర్డ్సు చెప్పినట్లు ఈ లోకంలో పేషెన్స్‌ ఉంటేగాని నెగ్గలేం- నన్ను చూసి నేర్చుకో."

......

"నాన్సెన్స్‌! దిసీజ్‌ బేస్‌ ఇన్‌గ్రాటిట్యూడ్‌! డేటింగ్‌ గురించి నాకు తెలియక విషయం దాటవేస్తున్నానంటావా! షీర్‌ ఇగ్నొరెన్స్‌! ఈ వయసులో నీకు సహజీవనం గురించి చెప్పడం టూ ఎర్లీ. నువు సరిగ్గా అర్థం చేసుకోక తొందరపడితివా- కొంప ములుగుతుంది. నిన్ను సురేంద్రనాథ్‌ బెనర్జీ అంతటి వాణ్ని చేయాలన్న నా లైఫ్‌ యాంబిషన్‌ గంగలో కలిసిపోతుంది. పైగా, మైడియర్‌ వెంకటేశం... నీ తండ్రి అగ్గిరావుడోయ్‌.. ఇంట్లో ఎవళ్లకీ అతన్ని లొంగదీసే ఎలోక్వెన్స్‌ లేకపోబట్టి కాస్త తటపటాయించానుగానీ, సహజీవనం గురించి నాకు తెలియక కాదు... నీకు చెప్పలేకా కాదు. యునో వెరీవెల్‌- నాతో మాట్లాడటమే పెద్ద ఎడ్యుకేషన్‌... అది నీకెన్నోసార్లు చెప్పాను."

......

"సరే నువ్వింతగా అడుగుతున్నావ్‌ కనుక చెబుతున్నాను శ్రద్ధగా విను... మీ ఇంట్లోనే నువ్వే చెప్పినట్లు ‘తలకి చముర్రాసుకోని’ బ్యూటిఫుల్‌ యంగ్‌ విడో ఉంది కదా! చూసి చూసి నాకు హార్టు మెల్టయి ఓరోజెప్పుడో ఆమెను లేవదీసుకుపోతాను. విడో మేరేజి చేసుకొందామని నచ్చచెబుతాను. ఆమె చాదస్తం కొద్దీ ‘శాస్త్రం ఒప్పుకుంటుందాండీ’ అని భీష్మించుక్కూర్చుందనుకో... నాకు ఆమెతో కలసి బతకడం తప్ప వేరే దారేముంటుంది..? దెన్‌ వియ్‌ లివ్‌ టుగెదర్‌- అలా పెళ్లికాకుండా కలసి కాపురం చేయడమే సహజీవనమంటే.’

......

"ఆ భేషుగ్గా! సహజీవనాన్ని శాస్త్రం ఏనాడో ఒప్పుకొంది. బృహన్నారదీయంలోని ఆరో ఆశ్వాసం ‘సహజీవన వ్రతం’ గురించి ఘట్టిగా సిఫార్సు చేసింది. సహజీవనమంటే ఏంలేదు. పెళ్లయ్యాక ఆలుమగలు ఒకరి అభిరుచులను మరొకరు అర్థం చేసుకొంటారు. అవి కాస్త తలకిందులైనా తాళిబొట్టు కారణంగా తప్పనిసరై సర్దుకుపోతారు. అదే, పెళ్లికి ముందే కలిసి బతికారనుకో... అభిరుచులు రుచించకపోతే ఏ బాదరబందీ లేకుండా విడిపోయే సావకాశం ఉంటుంది. లోకంలో నువు చూస్తివా... ఈ జనం సినీ జీవుల మీద పడి ఏడుస్తారు గానీ, అన్ని వర్గాలలోను ఈ సహజీవనవ్రతం బాగా ప్రాచుర్యంలోనే ఉంది... ఎందుకంటావ్‌... దాన్ని శాస్త్రం అంగీకరించబట్టే కదా! ఇంతకీ ఇంత అర్జెంటుగా సహజీవనం గురించి తెలుసుకోవలసిన అవసరం నీకెందుకొచ్చింది మైడియర్‌ బ్రదరిన్లా?"

......

"ఓరి నీ దుంపతెగా! నువ్వడిగేది కరోనాతో సహజీవనం గురించా! అందుకా షాకయ్యావు చంపావుపో! అనవసరంగా నీకు మోస్టు వేల్యుబుల్‌ ఎరుడైట్‌ కోట్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్‌ చేశానే! అదేదో ముందే చెప్పి చావొచ్చుగా! నా శ్రమంతా ‘థ్రోయింగ్‌ పెరల్స్‌ బిఫోర్‌ స్వైన్‌’ అయిపోయింది కదా బామ్మర్ధీ అయినాగానీ ప్రభుత్వాలు ఎంతకాలమని ఈ లాక్‌డౌన్లు భరిస్తాయి? కూరలమ్ముకొనే వాడికే గానీ కుబేరులెవరికీ ఇబ్బంది లేని నిర్బంధాలు ఎంతకాలం చెల్లుతాయి? కూలీల బతుకులు కూలిపోతున్నాయని గ్రహించింది కాబట్టి కేంద్రం ‘కరోనాతో సహజీవనం’ తప్ప గత్యంతరం లేదని ప్రకటించింది. దాని గురించి మరోసారెప్పుడో చెబుతాను గానీ- ఈలోగా నువ్వు కాశీ మిఠాయికోసం, సిగార్సుకోసం కాసిని కాపర్సు సంపాదించే పనిలో ఉండు సరేనా... ఇంకా ఇక్కడే నిలబడ్డావేం... బయలుదేరు!"

(రచయిత- వై.శ్రీలక్ష్మి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.