ETV Bharat / opinion

కొవిడ్‌ కల్లోలంలోనూ కొత్త కొలువులు - డబ్ల్యూఈఎఫ్​ 2020

కరోనా నేపథ్యంలో గతేడాది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. మారుతున్న పరిస్థితులు, సాంకేతికల్లో ఇమిడిపోవాలంటే.. రెండేళ్లలో కనీసం 54శాతం ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పడం, పాత నైపుణ్యాలకు మరింత పదును పెట్టడం అవసరమని ప్రపంచ ఆర్థిక వేదిక పేర్కొంది. అధునాతన సాంకేతికతలతో భవిష్యత్తు నిరంతరం మార్పులు చెందుతోంది. వీటిని అధిగమించే సత్తాను ఉద్యోగులకు ఎప్పటికప్పుడు అలవరచి, భవిష్యత్తుకు వారిని సిద్ధం చేసే బాధ్యతను కంపెనీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు తీసుకోవాలి.

Learn new skills to adapt to changing working conditions and technologies in the wake of the Covid crisis
కొవిడ్‌ కల్లోలంలో కొత్త కొలువులు
author img

By

Published : Apr 2, 2021, 8:01 AM IST

కొవిడ్‌ విజృంభణ వల్ల 2020లో ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. మారుతున్న పని పరిస్థితులు, సాంకేతికతల్లో ఇమిడిపోవాలంటే 2022కల్లా కనీసం 54 శాతం ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పడం, పాత నైపుణ్యాలకు మరింత పదును పెట్టడం అవసరమని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) పేర్కొంది. కోట్ల సంఖ్యలో ఉపాధి కోల్పోయినవారిలో జనంతో దగ్గరగా మెలగుతూ ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారే ఎక్కువ. ఆఫీసులు మూతపడటంతో ఇంటినుంచి పనిచేయడం ఎక్కువైంది. ఇప్పటి ఉద్యోగులు, కార్మికుల్లో కనీసం 25శాతం కొవిడ్‌ అనంతరం కొత్త ఉద్యోగాలు వెతుక్కోవలసి వస్తుంది. ఆటొమేషన్‌, రోబాటిక్స్‌, కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెక్యూరిటీ వంటి డిజిటల్‌ సాంకేతికతలతో నెగ్గుకురాగలిగేవారే రేపటి ప్రపంచంలో రాణిస్తారు. కొవిడ్‌ ‘లాక్‌డౌన్‌’ కాలంలో మనం పని చేసే తీరు, ఇతరులతో వ్యవహరించే పద్ధతి, విద్యావినోదాలు, షాపింగ్‌ శైలి మారిపోయాయి. కొవిడ్‌ అనంతరమూ ఈ మార్పులు కొనసాగనున్నాయి.

ఉపాధి నష్టం

ఇంటి నుంచి పని, ఆటొమేషన్‌, ఇ-కామర్స్‌, ‘వర్చువల్‌’ సమావేశాలు, ఆన్‌లైన్‌ విద్య వంటి కొత్త ధోరణులకు కరోనా అంటుకట్టింది. ఆఫీసు, ఇల్లు-రెండింటి నుంచి పనిచేసే హైబ్రిడ్‌ పని సంస్కృతిని తీసుకురావడానికి అనేక కంపెనీలు ఉద్యుక్తమవుతున్నాయి. దీని కింద కొందరు ఉద్యోగులు ఆఫీసు నుంచి, మిగిలినవారు ఇంటి నుంచి పనిచేస్తారు. ఈ విధానంలో కంపెనీలకు ఖర్చులు తగ్గి ఉత్పాదకత పెరుగుతుంది. చిన్న చిన్న బృందాలతో సమర్థంగా పనులు చేయించుకోవచ్చు. నేచర్‌ పత్రిక ఇటీవల జరిపిన సర్వేలో శాస్త్రజ్ఞులు కొవిడ్‌ తరవాత కూడా ముఖాముఖి భేటీలకు బదులు వర్చువల్‌ సమావేశాలే కొనసాగాలని కోరుకొంటున్నట్లు తేలింది. భవిష్యత్తులో పనిపాటలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై మెకిన్సే సంస్థ ఇటీవల భారత్‌, చైనా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, స్పెయిన్‌లలో సర్వే నిర్వహించింది. ఈ ఎనిమిది దేశాల్లో 2030కల్లా ప్రతి 16మంది ఉద్యోగులు, కార్మికుల్లో ఒకరు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవలసి వస్తుందని తేల్చింది.

కొవిడ్ తర్వాతా ఇదే పరిస్థితి

భారత్‌లో ఇలాంటివారి సంఖ్య 1.8 కోట్లుగా ఉంటుందని మెకిన్సే తెలిపింది. ప్రపంచ జనాభాలో సగం ఈ ఎనిమిది దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ జీడీపీలో 63 శాతం ఈ దేశాల్లోనే ఉత్పత్తి అవుతోంది. మెకిన్సే సంస్థ నిరుడు ఆగస్టులో 278మంది కంపెనీ ఉన్నతాధికారుల అభిప్రాయాలు సేకరించి విశ్లేషించింది. మున్ముందు ఆఫీసు స్థల వినియోగాన్ని 30శాతం మేరకు తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. దీనివల్ల రెస్టారెంట్లకు, రవాణా వసతులకు గిరాకీ తగ్గడం ఖాయం. కొవిడ్‌ వల్ల వ్యాపార నిమిత్త ప్రయాణాలు 20 శాతం తగ్గిపోయాయి. కొవిడ్‌ తరవాతా ఇదే పరిస్థితి కొనసాగుతుందని మెకిన్సే తేల్చింది. ఫలితంగా విమానయానం, విమానాశ్రయాలు, హోటళ్లు, ఆహార సరఫరా రంగాల్లో ఉపాధి అవకాశాలు కుదించుకుపోతాయి. కొవిడ్‌ కాలంలో భౌతిక దూరం పాటించకతప్పదు కాబట్టి- ‘వర్చువల్‌’ సమావేశాలు, ఆన్‌లైన్‌ సినిమా, టీవీ స్ట్రీమింగ్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, టెలీమెడిసిన్‌ సేవలు పెరిగాయి. ఉదాహరణకు కేవలం 2020 ఏప్రిల్‌-నవంబరు మధ్యనే ప్రాక్టో అనే టెలీమెడిసిన్‌ కంపెనీ ద్వారా వైద్య సలహా సేవలు పదింతలు పెరిగాయి.

సవాళ్లకు దీటైన విద్య

రాబోయే కాలంలో సెక్యూరిటీ ప్రొఫెషనల్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, ప్రోగ్రామర్‌ ఎనలిస్ట్‌, సిస్టమ్స్‌ ఎనలిస్ట్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌ డెవలపర్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఉద్యోగాలకు గిరాకీ పెరుగుతుందని సీఐఓ పత్రిక సూచించింది. తెలిపింది. 2021 ఫిబ్రవరిలో ‘లింక్డిన్‌’ పోర్టల్‌లో అత్యంత గిరాకీ కలిగిన ఉద్యోగాలు- సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, రిజిస్టర్డ్‌ నర్సు, సేల్స్‌ ఉద్యోగులు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఆహార బట్వాడా డ్రైవర్‌, ఫుల్‌శ్టాక్‌ ఇంజినీర్‌, జావా స్క్రిప్ట్‌ డెవలపర్‌, డెవప్స్‌ ఇంజినీర్‌. ఇంకా ఫార్మసీ టెక్నీషియన్‌, యానిమల్‌ గ్రూమర్‌, రిటైల్‌ విక్రయ సిబ్బంది, వేర్‌హౌస్‌ సిబ్బంది, సెక్యూరిటీ ఇంజినీర్‌, యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ డిజైనర్‌, డేటా ఆర్కిటెక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ మేనేజర్లకు గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. 32శాతం కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి పూర్తికాల ఉద్యోగులను తొలగించి కాంట్రాక్టు సిబ్బందిని నియమించుకొంటున్నాయని ‘గార్ట్‌నర్‌’ సర్వేలో తేలింది. ఈ సంస్థ 800మందికిపైగా హెచ్‌ఆర్‌ మేనేజర్లను సర్వే చేసింది. కొవిడ్‌కు ముందు కాలంలో 30శాతం ఉద్యోగులు అప్పుడప్పుడు ఇంటినుంచి, దూరంనుంచి పనిచేస్తే, కొవిడ్‌ తరవాత ఇలాంటి ఉద్యోగులు 48శాతం వరకు ఉంటారనీ ‘గార్ట్‌నర్‌’ సర్వే తెలిపింది.

డిజిటల్​ టెక్నాలజీపై మొగ్గు

మనుషులు చేస్తున్న కొన్ని ప్రమాదభరితమైన ఉద్యోగాల్లో- 3.2 కోట్ల నుంచి అయిదు కోట్ల ఉద్యోగాలను ఏఐ సహాయంతో చేయవచ్చు. కరోనా వచ్చినప్పటి నుంచి కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీలపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయి. మున్ముందు డిజిటల్‌ ఉద్యోగుల నియోగం పెరగడం ఖాయం. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను డిజిటల్‌ వర్కర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌లు మానవ సిబ్బందికి సహాయకారులుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వారి స్థానాలను తామే భర్తీ చేస్తాయి. వైరస్‌ భయం లేకుండా ఖాతాదారులు ఈ డిజిటల్‌ వర్కర్ల సేవలు పొందవచ్చు. 2015లో ప్రపంచవ్యాప్తంగా 490కోట్ల చిన్నాపెద్ద రోబోలు, రోబోటిక్‌ ప్రోగ్రామ్‌లు, పరికరాలు రంగంలో ఉండగా 2025కల్లా అవి 3,000 కోట్లకు పెరుగుతాయని ‘గార్ట్‌నర్‌’ అంచనా. ఏతావతా మారిపోతున్న ప్రపంచంలో నెగ్గుకురావడానికి యువతీయువకులు కొత్త నైపుణ్యాలను అలవరచుకోవాలి. యంత్రాలతో కలిసి పనిచేయడం, వాటితో పనిచేయించడం వంటి విద్యలను నేర్చుకోవాలి. నేర్చిన నైపుణ్యాలు ఎప్పటికప్పుడు పాతబడిపోతుంటాయి. వాటిని మరింత మెరుగుదిద్దుకోవాల్సి ఉంటుంది. రేపటి ప్రపంచం అధునాతన సాంకేతికతలతో నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఈ మార్పులను అధిగమించే సత్తాను వారికి ఎప్పటికప్పుడు అలవరచి, భవిష్యత్తుకు వారిని సిద్ధం చేసే బాధ్యతను కంపెనీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు తీసుకోవాలి.

నైపుణ్యవంతులదే భవిత

2025కల్లా మానవ సిబ్బంది, యంత్రాలు, ఆల్గొరిథమ్స్‌ మధ్య శ్రమవిభజన జరిగి 8.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది. అదే సమయంలో కొత్త తరహా ఉద్యోగాలు పెద్దయెత్తున పుట్టుకొస్తాయి. ఇప్పటికే డేటా ఎనలిస్టులు, డేటా సైంటిస్టులు, ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ నిపుణులకు, రోబోటిక్స్‌ ఇంజినీర్లకు గిరాకీ పెరుగుతోంది. మార్కెటింగ్‌, సేల్స్‌, ఉత్పత్తిపరమైన ఉద్యోగాలకు మాత్రం ప్రాధాన్యం తగ్గదు.

- డాక్టర్​ కె.బాలాజీ రెడ్డి, రచయిత-సాంకేతిక విద్యారంగ నిపుణులు

ఇదీ చదవండి: దేశంలో 6.75 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.