ETV Bharat / opinion

ద్రవ్యోల్బణానికి ప్రభుత్వాల ఆజ్యం - పేదలపై ద్రవ్యోల్బణం ప్రభావం

ఇంధనం, వంటనూనెల ధరల పెరుగుదలే ఇటు చిల్లర, అటు టోకు ద్రవ్యోల్బణ ఉద్ధృతికి కారణమైంది. బడుగుల నిత్య జీవితాల్ని నేరుగా ప్రభావితం చేసే చిల్లర ద్రవ్యోల్బణం ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరి ఉరమడం తీవ్ర ఆందోళనకరమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.4 శాతానికి, వృద్ధిరేటు 9.5 శాతానికి పరిమితమవుతుందని ఆర్‌బీఐ ఇటీవల కట్టిన అంచనాల్ని క్షేత్రస్థాయి ధరాఘాతాలు బదాబదలు చేస్తున్నాయి.

inflation
ద్రవ్యోల్బణం
author img

By

Published : Jun 16, 2021, 7:32 AM IST

నిరుపేదల బతుకుల్ని కర్కశంగా చిదిమేసే క్రూరమైన పన్ను- ద్రవ్యోల్బణం. ఇండియాలాంటి దిగువ మధ్యాదాయ దేశంలో చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్న సగటు పౌరుల మీద ధరోల్బణ దుష్ప్రభావాలు- ఒక్క ముక్కలో చెప్పాలంటే, దుర్భరం. వరసగా రెండో ఏడాదీ కొవిడ్‌ సృష్టించిన సామాజికార్థిక కల్లోల పరిస్థితుల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణానికి రెక్కలు మొలవడం- కోట్లాది జనావళి బతుకులపై పిడుగుపాటే. ఏప్రిల్‌ నెలలో 4.2గా ఉన్న వినియోగ ధరోల్బణ సూచీ మే నెలలో 6.3గా నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ప్రకటించింది. పట్టుమని నెలరోజుల్లో ఆహార ధరల సూచీ రెండు నుంచి అయిదు శాతానికి పెరిగిందని, రిజర్వ్‌ బ్యాంకు నిర్దేశించుకొన్న గరిష్ఠ లక్ష్యాన్ని దాటేసి గ్రామీణ ద్రవ్యోల్బణం 6.5 శాతానికి ఎగబాకిందని సర్కారీ గణాంకాలు చాటుతున్నాయి.

ఇంధనం, వంటనూనెల రేట్ల పెరుగుదలే ఇటు చిల్లర, అటు టోకు ద్రవ్యోల్బణ ఉద్ధృతికి కారణమైంది. బడుగుల నిత్య జీవితాల్ని నేరుగా ప్రభావితం చేసే చిల్లర ద్రవ్యోల్బణం ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరి ఉరమడం తీవ్ర ఆందోళనకరమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.4 శాతానికి, వృద్ధిరేటు 9.5 శాతానికి పరిమితమవుతుందని ఆర్‌బీఐ ఇటీవల కట్టిన అంచనాల్ని క్షేత్రస్థాయి ధరాఘాతాలు బదాబదలు చేస్తున్నాయి. వంట నూనెలు మంట నూనెలై ఎగసిపడుతుంటే, అనేక చోట్ల లీటరు వంద రూపాయలు దాటిపోయిన పెట్రోఘాతాలకు జనం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. రైతు అమ్మబోతే అడవి, వినియోగదారు కొనబోతే కొరివిగా దిగజారిన విపణి వ్యవస్థలో సరైన అదుపాజ్ఞలు లేక ద్రవ్యోల్బణం కట్లు తెంచుకోవడంలో వింతేముంది? వస్తూత్పత్తులకు గిరాకీ తక్కువగా ఉన్నప్పుడే ఇంతగా జూలు విదిలిస్తున్న ద్రవ్యోల్బణం వృద్ధిరేట్లనూ దిగలాగే ప్రమాదం ఉన్నందున- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.

మూడు దశాబ్దాల క్రితమే..

ద్రవ్యోల్బణం నియంత్రణ విధానాన్ని మూడు దశాబ్దాల క్రితం న్యూజిలాండ్‌ ప్రారంభించగా, 33 దేశాలు దాన్ని అనుసరించాక, 2016లో అర్జెంటీనా, ఇండియాలు దాని అమలు దిశగా దృష్టిసారించాయి. నాలుగు శాతం ద్రవ్యోల్బణాన్ని హేతుబద్ధ స్థాయిగా నిర్ధారించి రెండు శాతం అటుఇటు అయినా ఫరవాలేదన్న పంథాలో రిజర్వ్‌ బ్యాంకు ఆర్థిక వ్యూహ రచన సాగిస్తున్నా- ధరోల్బణంతో జనజీవితాలు తరచూ ఆటుపోట్లకు లోనవుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం కట్టడి కంటే వృద్ధిరేట్ల సాధనే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ మార్చి రెండోవారంలో సూచించారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటే స్థిర ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుందని అదే సమయంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు హితవు పలికారు.

ఇంధనం విద్యుత్‌ ధరోల్బణం 37.61 శాతానికి పెరగబట్టే వినియోగ ధరల సూచీ అంతగా మండుతోంది. పదిశాతం దాకా వినియోగం తగ్గినా పెట్రో సుంకాల పద్దులోనే కేంద్రం రూ.1.80 లక్షల కోట్లు అదనంగా ఆర్జించగలిగిందంటే, పౌరులపై పడిన భారం అర్థమవుతుంది. పప్పు ధాన్యాల ధరలు 9.39 శాతం, వంట నూనెలు 30 శాతం ప్రియం కావడం వంటింటి బడ్జెట్లను తలకిందులు చేస్తోంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా తడిసి మోపెడైన వైద్య ఖర్చులు, ఉపాధి కోల్పోయి కొత్తగా పేదరికంలోకి జారిపోయిన 23 కోట్ల మంది బతుకు తెరువు పోరాటాలు- పట్టణ, గ్రామీణ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల్నీ దురవస్థల పాలు చేస్తున్న వేళ ఇది. ఈ సంక్షోభ సమయంలో నల్లబజారు వర్తకుల చేతివాటం జనసామాన్యాన్ని చెండుకుతినకుండా కాచుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు- పెట్రో బాదుడుతో ద్రవ్యోల్బణానికి తామే ఆజ్యం పోయడం ఏమిటి? ఇప్పటికైనా అవి ఉదాసీనత వీడి సరైన దిద్దుబాటు చర్యల్ని సత్వరం పట్టాలకెక్కించాలి!

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.