ETV Bharat / opinion

ప్రమాణాలతోనే ప్రమాదాలకు కళ్లెం - పారిశ్రామిక ప్రమాదాలు చర్యలు

ఒక దేశం ఆర్థిక పురోగతి సాధించాలంటే పారిశ్రామిక రంగంలో తప్పక మెరుగవ్వాల్సిందే. అయితే ఆ పురోగతి పర్యావరణ, ప్రమాదాలకు ఆస్కారమివ్వకుండా ఉండాలి. ఇటీవలి కాలంలో సాంకేతిక లోపాల కారణంగా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు న్యాయస్థానాల మార్గదర్శకాలను పాటిస్తూ.. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. అలాంటప్పుడే పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ చర్యలను, సాంకేతిక భద్రత సూచనలను తప్పకుండా పాటిస్తాయి.

Industrial fire accidents are controlled by the standard measures only
ప్రమాణాలతోనే ప్రమాదాలకు కళ్లెం
author img

By

Published : Sep 4, 2020, 10:41 AM IST

ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక రంగంలో పురోగతి సాధించాల్సిందే. ఈ అభివృద్ధి పర్యావరణహితంగా, ప్రమాదాలకు ఆస్కారమివ్వకుండా ఉండాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ప్రమాదాలు ఎక్కువగా సాంకేతిక లోపాలవల్ల చోటు చేసుకున్నాయి. షార్ట్‌సర్క్యూట్‌, పేలుడు, లీకేజిల వల్లా సంభవిస్తున్నాయి. వీటి వల్ల ధన, ప్రాణ నష్టాలతో పాటు, పర్యావరణానికీ ఎంతో చేటు కలుగుతోంది. ఉదాహరణకు- భోపాల్‌ గ్యాస్‌ విషాదం (1984), జైపూర్‌ చమురు మంటలు (2009), విశాఖపట్టణం గ్యాస్‌ లీక్‌ (2020)... ఈ కోవలోకే వస్తాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (1996-2020) నివేదిక ప్రకారం పరిశ్రమల్లో ఏడాదికి 37 కోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి కారణంగా 23 లక్షల మంది వరకు చనిపోతున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ (2019) నివేదిక ప్రకారం భారత్‌లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న మొదటి అయిదు రాష్ట్రాలు వరసగా- గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌!

సాంకేతిక లోపాలెన్నో...

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారని, క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. పరిశ్రమల్లో సాంకేతిక నిపుణులతో కూడిన భద్రతా విభాగంలో సరిపడినంత మంది సిబ్బంది లేకపోవడం, అనుభవం లేనివారే ఎక్కువగా ఉండటం వంటివీ దుర్ఘటనలకు దారి తీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తరచూ పరిశ్రమల లోపల, పరిసర గ్రామాల్లో మాక్‌ డ్రిల్‌ను నిర్వహించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించి లోపాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని, అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా నష్టాల తీవ్రతను తగ్గించవచ్చు. ఆ మాక్‌డ్రిల్స్‌ తరచుగా జరుగుతున్నాయా, లేదా అనేది అనుమానమే.

ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తూ, నిబంధనలను అనుసరిస్తున్నా... అనుకోని పరిణామాలతో ఏమైనా ప్రమాదాలు చోటుచేసుకుంటే, సాధారణంగా తక్కువ స్థాయి తీవ్రతతోనే ఉంటాయి. ప్రమాదాలు తీవ్రస్థాయిలో ఉంటేమాత్రం వాటిని ముమ్మాటికీ క్షేత్రస్థాయిలో భద్రత లోపాలుగానే పరిగణించాలి. ప్రమాదం సంభవించిన తక్షణమే పరిశ్రమల్లో సిబ్బందికి, పరిసర గ్రామాల్లో ఉండే ప్రజలకు హెచ్చరిక సంకేతం అందించేలా సైరన్‌ మోగుతుంది. దీన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రమాద సమయంలో ఒకవేళ సైరన్‌ మోగలేదంటే, ముమ్మాటికీ అది సాంకేతిక లోపం కిందకే వస్తుంది.

భద్రతా చర్యలు పాటిస్తేనే..

సాధారణంగా జనావాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లోనే పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. శరవేగంతో పరుగులు పెడుతున్న పట్టణీకరణ కారణంగా క్రమేపీ పరిశ్రమల చుట్టుపక్కల ఉండే ఖాళీ ప్రాంతాలన్నీ జనావాసాలుగా మారుతున్నాయి. పరిశ్రమల్లో ఏమైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ముందుగా, ఎక్కువగా నష్టానికి గురయ్యేది ఇలాంటి సమీప ప్రాంత వాసులే. అందువల్ల, పరిశ్రమల చుట్టుపక్కల నివాసాలు ఉండేచోట్ల నెలకొన్న పరిశ్రమలు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు మొక్కుబడిగా పరిశ్రమలపై చర్యలు తీసుకోవటం, సాంకేతికపరమైన సూచనలు చేయటం ద్వారా చేతులు దులిపేసుకుంటున్నారు. తరవాత కాలంలో ఆ సూచనలకు అనుగుణంగా సాంకేతిక లోపాలను సరిదిద్దే దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు.

ఉదాసీనతతో ముప్పు

పరిశ్రమల్లో ప్రమాదాలను సాధ్యమైనంత వరకు నివారించడానికి ఉన్నతాధికారులు తరచుగా క్షేత్రస్థాయిలో భద్రతా ప్రమాణాలను పరిశీలించి, తగిన సూచనలివ్వాలి. ఇలాంటి విషయాల్లో ఉదాసీనత పనికిరాదు. పరిశ్రమల్లో విపత్తుల నిర్వహణ యంత్రాంగం అందుబాటులో ఉండాలి. అగ్నిమాపక దళాలు, ఆరోగ్య కేంద్రాలను పరిశ్రమలకు సమీపంలో ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు తమవంతు బాధ్యతగా వీటి ఏర్పాటుకు కృషి చేయాలి. అంతేకాకుండా, పరిశ్రమల లోపల సిబ్బంది, చుట్టుపక్కల గ్రామవాసులకు తరచుగా మాస్క్‌లు, రక్షణ కవచాలు, ఉచిత వైద్య వసతులను కల్పించాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు సహకరించాలి. ప్రజలు కూడా తమ వ్యక్తిగత రక్షణ కోసం సూక్ష్మ ధూళి రేణువులను నివారించేందుకు ఎల్లప్పుడూ మాస్క్‌లు ధరించాలి. మొక్కలు పెంచాలి.

ప్రజల్లో పర్యావరణ రక్షణ, ఆరోగ్య విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగించేందుకు ప్రభుత్వాలతోపాటు పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు న్యాయస్థానాల మార్గదర్శకాలను పాటిస్తూ, భారీ జరిమానాతో పాటు జైలుశిక్షలు, నష్టపరిహారాలు చెల్లించేలా, అవసరమైతే పరిశ్రమలను మరో చోటుకు మార్చేలా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. అలాంటప్పుడే- పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ చర్యలను, సాంకేతిక భద్రత సూచనలను నిక్కచ్చిగా పాటిస్తాయి.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు, రచయిత - భూగర్భ రంగ నిపుణులు

ఇదీ చదవండి: రక్షణ రంగంలో మరింత సహకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.