ETV Bharat / opinion

ఉభయతారక విధానం.. ఇక 'ఇంటి నుంచే పని' - ఐటీ కరోనా వైరస్​

అనేక రంగాలు విలవిలలాడుతున్నా.. కరోనా వైరస్​ను ఐటీ రంగం కొంత తట్టుకోగలిగింది. లాక్‌డౌన్‌వల్ల కార్యాలయాలు మూతపడినా, ఐటీ సేవలు నిలిచిపోలేదు. దాదాపు అత్యధిక ఐటీ సేవలు, ప్రాజెక్టులకు సంబంధించిన పని అంతా 'ఇంటి నుంచి పని'కి మారింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్నా, జులై 31 వరకు ఇంటి నుంచి పని విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఆదేశించింది.

India's IT unaffected with corona virus
ఉభయతారక విధానం.. వెళ్లాలనుకున్నా 'ఇంటి నుంచే'
author img

By

Published : May 19, 2020, 7:12 AM IST

కొవిడ్‌ వ్యాప్తితో దేశంలో అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 45 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగం కొంత తట్టుకోగలిగింది. దాదాపు 18వేల కోట్ల డాలర్ల (సుమారు రూ.13.50 లక్షల కోట్ల) ఆదాయంతో, దేశ జీడీపీలో ఎనిమిది శాతం వాటా కలిగిన ఐటీ రంగానికి ప్రధాన ఆదాయ వనరు విదేశీ సంస్థలే. దేశ ఐటీ రంగ ఆదాయంలో 70శాతం వాటా విదేశీ సంస్థలు/ ఖాతాదారుల నుంచే వస్తోంది. లాక్‌డౌన్‌వల్ల కార్యాలయాలు మూతపడినా, ఐటీ సేవలు నిలిచిపోలేదు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులతో 'ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రం హోమ్‌)' పద్ధతిని విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. సరఫరాల్లో అంతరాయం ఏర్పడి, దేశ సేవల రంగానికి అప్రతిష్ఠ రాకూడదని పని విధానాన్ని మార్చారు. ఉత్పాదకతకు పెద్దగా నష్టం వాటిల్లకుండా, నిపుణుల్లో 90-95 శాతం ఇంటి నుంచి పనిచేసేలా రెండు మూడు రోజుల వ్యవధిలో నూతన విధానానికి అనుగుణంగా మారిపోవడం ఆశ్చర్యకరమే. డేటా గోప్యత, భద్రత అధికంగా ఉండాల్సిన బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, ట్రేడింగ్‌, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి పరిశోధన-అభివృద్ధి కేంద్రాల సమాచారం వంటి కొన్ని విభాగాలు మినహా దాదాపు అత్యధిక ఐటీ సేవలు, ప్రాజెక్టులకు సంబంధించిన పని అంతా ‘ఇంటి నుంచి పని’కి మారింది.

ఎలా సాధ్యమైంది?

ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌ తెచ్చుకుని, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేసుకుంటే, ఎక్కడినుంచైనా పని చేయవచ్చన్నది చాలామంది ఉద్దేశం. అవకాశం/ అవసరం మేర కొద్దిమంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుండటం చూసి ఇలా అనుకోవడం కద్దు. శుక్రవారాలు, సెలవుల మధ్య ఒకరోజు పని చేయాల్సి వస్తే, కంపెనీ కూడా ఉదారంగా ఈ అవకాశం కల్పిస్తుంటుంది. కానీ, దీనికి స్పష్టమైన నిబంధనలు లేవు. కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని సమన్వయంతో వ్యవహరించడం, ఇంతకన్నా మార్గం లేదని ఖాతాదారులూ అంగీకరించడం వల్లే దాదాపుగా ఐటీ రంగం మొత్తం ఇంటి నుంచి పని చేయగలుగుతోంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజడ్‌) అధికారులు, ఎస్‌టీపీఐ అనుమతులు ఇవ్వడానికి తోడు టెలికాం విభాగం (డాట్‌) వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌) కనెక్టివిటీలో వెసులుబాటు ఇవ్వడం వల్లే ఇది సాధ్యపడింది. ప్రతి ఐటీ కంపెనీకి అధిక బ్యాండ్‌విడ్త్‌ కలిగిన నెట్‌ కనెక్షన్‌ ఉంటుంది. ఖాతాదారుకు నేరుగా కనెక్ట్‌ అవుతారు. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలంటే వీపీఎన్‌ (సెక్యూర్డ్‌ టన్నెల్‌) ద్వారా మాత్రమే తమ ఐటీ కంపెనీకి, తద్వారా ఖాతాదారుకు కనెక్ట్‌ కావాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ నెట్‌వర్క్‌లను కలిపే వీలు లేదు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిబంధన నుంచి టెలికం శాఖ సడలింపులు ఇచ్చింది. ఇంటి నుంచే పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు వీపీఎన్‌ ద్వారా తమ కార్పొరేట్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానమయ్యే అవకాశం కల్పించింది. తొలుత ఏప్రిల్‌ ఆఖరు వరకు ఇచ్చినా, ఇప్పుడు జులై 31 వరకు పొడిగించారు. అదేవిధంగా ఎస్‌ఈజడ్‌ ప్రత్యేక అవసరాల కోసం వినియోగించాల్సిన పరికరాలను (కస్టమ్స్‌ సుంకం లేకుండా కొనుగోలు చేసుకునే ల్యాప్‌టాప్‌లు/ డెస్క్‌టాప్‌లు/ ప్రింటర్లు) తప్పనిసరిగా అక్కడే ఉంచడంతో పాటు, ఏ ఉద్దేశం కోసం కొన్నారో, ఆ విధులకే వాడాలి. వీటిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఎస్‌ఈజడ్‌ అధీకృత సంస్థలతో పాటు ఎస్‌టీపీఐ సైతం అంగీకారం తెలిపింది. భవిష్యత్తు అవసరాల కోసం అధికార వర్గాలు సమన్వయంతో సాగి, చట్టాల్లో మార్పులు చేస్తే, ఇంటి నుంచే పని- ఐటీ రంగంలో ముఖ్యమైన విభాగంగా స్థిరపడుతుంది. ఈ విధానంలోనూ కంపెనీలకు కొన్ని భారాలు లేకపోలేదు. కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా అందరికీ కలిపి యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌, ఫైర్‌వాల్స్‌, సెక్యూరిటీ సదుపాయాలు, నెట్‌వర్క్‌, బ్యాండ్‌విడ్త్‌ తీసుకుంటారు. ఉద్యోగులు విడివిడిగా ఉంటే హ్యాకర్లకు అవకాశాలు పెరిగినట్లే. దీనికి తగిన ఏర్పాట్లు చేయడం కంపెనీలకు అదనపు వ్యయభారమే. తమ సమాచార భద్రత, గోప్యతపై ఖాతాదారులను ఒప్పించాల్సి ఉంటుంది. ఉద్యోగి ఇంట్లో సౌకర్యవంతంగా పని చేసేందుకు కుర్చీ, టేబుల్‌, ల్యాప్‌టాప్‌ వంటివి కంపెనీ సమకూర్చాల్సి రావచ్చు. నియంత్రణ పరమైన అనుమతులూ అవసరమవుతాయి.

లాభనష్టాలు ఇలా...

ఇంటి నుంచి పని విధానంలో యజమానులకు పలు ప్రయోజనాలు సమకూరతాయి. కార్యాలయాల నిర్వహణ, రవాణా, ఫుడ్‌ కోర్టులు, జిమ్‌, రిక్రియేషన్‌ సదుపాయాలు వంటివి కల్పించేందుకు అయ్యే వ్యయాలు ఆదా అవుతాయి. అమెరికాలో చేసిన ఓ సర్వే ప్రకారం ఓ ఉద్యోగి ఇంటి నుంచి పనిచేస్తే, అతడిపై సంస్థకు 11 వేల డాలర్ల వరకు ఆదా అవుతుందని అంచనా. మన దగ్గర ఆ స్థాయిలో కాకున్నా, ఉద్యోగి సగటు వార్షిక వేతనం రూ.10 లక్షలనుకుంటే, 7-8 శాతం మేర తగ్గొచ్చని అంచనా. ఆపై ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినుంచైనా నిపుణులను అపరిమితంగా ఎంచుకునే స్వేచ్ఛ యాజమాన్యాలకు లభిస్తుంది. సౌకర్యవంతమైన పని గంటలు కేటాయిస్తే వివాహానంతరం కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగాలు వదిలేసిన మహిళలూ ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్యం, లావాదేవీల ఆధారంగా, గంటల చొప్పునా చెల్లింపులు జరపవచ్చు. రవాణా సమయం మిగిలి, ఉత్పాదకత పెరుగుతుంది. ఆ మేరకు ఉద్యోగులపై ఒత్తిడీ తగ్గుతుంది. కుటుంబంతో ఎక్కువసేపు గడపడం, తగినంత నిద్ర ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు మెరుగుపడతాయి. వ్యాపార పొరుగు సేవల (బీపీఓ) కేంద్రాల్లో రాత్రి విధులను మహిళలకు కేటాయించలేక పోతున్నారు. ఇంటి నుంచే అయితే చాలామంది ముందుకొస్తారు. ఈ విధానంలోనూ కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. మధ్యతరగతి ఉద్యోగుల్లో ఎక్కువమందికి ప్రత్యేకంగా పని చేసుకునేందుకు ఇళ్లల్లో తగిన చోటు ఉండకపోవచ్చు. కుటుంబం, ఇరుగు పొరుగు, రాత్రివేళల్లో పనితో కొన్ని అసౌకర్యాలు ఎదురుకావచ్చు. సాంకేతికతకు సంబంధించి ఇబ్బందులు, సరైన పరికరాలు లేకపోవడం, కొన్ని సందర్భాల్లో వృత్తిపరమైన వాతావరణం కొరవడటం వంటి సమస్యలూ తలెత్తవచ్చు. ఇలాంటి ప్రతికూలతలు ఉన్నా... యజమానులు, ఉద్యోగులు ఇరువురికి ఈ పద్ధతిలో సానుకూలతలు అధికంగా ఉండటంవల్ల సమీప భవిష్యత్తులో- వీటిని అధిగమించి ఈ ప్రక్రియ బలంగా వేళ్లూనుకోవచ్చు!

పెరుగుతున్న ఆధరణ...

ప్రస్తుతం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్నా, జులై 31 వరకు ఇంటి నుంచి పని విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఆదేశించింది. సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. దీనివల్ల ఇంటి నుంచి పని విధానం విస్తరిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌ సహా వర్ధమాన దేశాల్లో ఐటీ రంగం ఈ విధానానికి మారాల్సిన ప్రక్రియ కరోనా వల్ల అయిదారేళ్లు ముందుగానే సాకారమైందని చెప్పాలి. 2025కల్లా తమ ఉద్యోగుల్లో 75శాతం ఇంటి నుంచే పని చేస్తారని దేశీయ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రకటించింది. ఇతర కంపెనీలూ ఇవే ఆలోచనలు సాగిస్తున్నాయి. సంబంధిత ప్రభుత్వ వర్గాలన్నీ సమన్వయంతో సాగి, చట్టాలను సవరించడంతోపాటు నూతన నిబంధనావళి రూపొందిస్తేనే ఇది సాధ్యమవుతుంది.

---కాకుమాను అమర్​కుమార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.