ETV Bharat / opinion

ఇరాన్‌కు స్నేహహస్తం- సంబంధాల బలోపేతమే లక్ష్యం

author img

By

Published : Oct 31, 2020, 11:41 AM IST

ఇరాన్‌తో భారత వాణిజ్య సంబంధాలపై అమెరికా ఆంక్షల ప్రభావం పడుతోంది. దీన్ని సావకాశంగా తీసుకుంటున్న చైనా.. ఇరాన్‌తో తన సంబంధాలను మెరుగు పరచుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్​ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓడరేవుకు భారత్​ రాయితీల కొనసాగింపు చేస్తూ ఇరాన్​తో సంబంధాన్ని మరింత దృఢపర్చుకునే దిశగా అడుగులేస్తోంది.

Ind_Iran relations
ఇరాన్‌కు స్నేహహస్తంగా భారత్

ఇటీవలి కాలంలో ఇరాన్‌తో సన్నగిల్లిన సంబంధాలను మెరుగు పరచుకునేందుకు భారత్‌ యత్నిస్తోంది. భారత్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ, దీనదయాళ్‌ ఓడరేవుల నుంచి ఇరాన్‌ చాబహార్‌లోని షహీద్‌ బెహెష్టి ఓడరేవుకు మధ్య జరిగే సరకు రవాణాపై మరో ఏడాది పాటు 40శాతం రాయితీ సౌకర్యాన్ని పొడిగించడమే ఇందుకు నిదర్శనం. ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవు ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రాయితీ కాలాన్ని పొడిగించింది. దీనివల్ల ఆయా ఓడరేవుల మధ్య సరకు రవాణా ఊపందుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత్‌, ఇరాన్‌ మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉందని, అయితే, క్షేత్రస్థాయిలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని పశ్చిమ ఆసియా అధ్యయనాల కేంద్రంలో సహాయ ఆచార్యులు సీమాబైద్య అభిప్రాయపడ్డారు.

'ప్రస్తుతం భారత్‌, ఇరాన్‌ సంబంధాలు చాలా కారణాల వల్ల దెబ్బతిన్నాయి. ఉన్నతోద్యోగుల్లో ఉదాసీన వైఖరి, అమెరికా నుంచి ఒత్తిడి, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య స్నేహం వంటి అంశాలెన్నో కారణమవుతున్నాయి. పరిస్థితి మెరుగుదలకు భారత్‌ మరిన్ని వ్యూహాలపై కృషి చేయాల్సి ఉంది' అని వ్యాఖ్యానించారు.

దార్శనికత అవసరం..

చాబహార్‌ ఓడరేవు ద్వారా మధ్యాసియా భాగంలోకి ప్రవేశించే అవకాశం కలుగుతుండటంతో భారత్‌ దీనికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. కాకపోతే, భారత్‌ గుర్తుంచుకోవాల్సిన సంగతేమిటంటే- చాబహార్‌ అనేది ఇరాన్‌లోని ఓడరేవు. ఏ దేశాన్నయినా ఆహ్వానించుకునే హక్కు ఆ దేశానికి ఉంటుంది. భారత్‌ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఇరాన్‌, చైనా, పాకిస్థాన్‌ వంటి దేశాలతో వ్యవహారం నడిపే విషయంలో భారత్‌కు దౌత్య, రాజకీయపరంగా మరింత దార్శనికత అవసరం.

ఇరాన్‌తో భారత వాణిజ్య సంబంధాలపై అమెరికా ఆంక్షల ప్రభావం పడుతోంది. దీన్ని సావకాశంగా తీసుకుంటున్న చైనా ఇరాన్‌తో తన సంబంధాలను మెరుగు పరచుకుంటోంది. 2018-19 సంవత్సరంలో భారత్‌, ఇరాన్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1,700 కోట్ల డాలర్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో మినరల్‌ ఆయిల్‌, చమురు దిగుమతులదే ప్రధాన వాటా.

2019-20లో ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 350 కోట్ల డాలర్లుగా అంచనా. తగ్గిన పెట్రోలియం దిగుమతుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. అమెరికాకు వ్యతిరేకంగా భారత్‌ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతోందని ఇరాన్‌ తన అసంతృప్తిని వెలిబుచ్చింది. అయితే, భారత్‌కు సంబంధించి అఫ్గానిస్థాన్‌కు ద్వారంగా భావించే వ్యూహాత్మకంగా ముఖ్యమైన చాబహార్‌ ఓడరేవు ప్రాజెక్టుకు అమెరికా తన ఆంక్షల పరిధి నుంచి మినహాయింపు కల్పించింది.

భారత్​ అంగీకరించాల్సిందే!

చాబహార్‌ ఓడరేవును మొదట్లో పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్సులో ఉన్న గ్వాదర్‌ రేవుకు పోటీగా భావించారు. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవాలో ముఖ్యమైన గ్వాదర్‌ రేవు దీనికి 70 కి.మీ. దూరంలోనే ఉంటుంది. ఒకదానివెంబడి మరొకటిగా ఆంక్షలు విధిస్తున్నా ఇరాన్‌ మనుగడ సాగించగలగడానికి కారణం చైనాయే. చైనా మద్దతుతో ఇరాన్‌ ప్రయోజనం పొందితే, భారత్‌ అంగీకరించాల్సిందే. లేనిపక్షంలో ఇరాన్‌తో సంబంధాలు మరింతగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికి భారత్‌ మరిన్ని మార్గాల్ని వెదకాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేయకూడదని భారత్‌ నిర్ణయించుకున్న తరవాత ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. గతంలో చాబహార్‌ రేవును గ్వాదర్‌తో అనుసంధానించేందుకు ఇరాన్‌ ప్రతిపాదనలు సైతం చేసింది. అమెరికా ఒత్తిడి, నిధుల్లో ఆలస్యం, భారత్‌ ఆచితూచి అడుగులు వేయడం వల్ల చాబహార్‌ రేవు నిర్మాణ పురోగతి చాలా నెమ్మదిగా ఉందని ఇరాన్‌ ఫిర్యాదులు సైతం చేసింది.

ఇరాన్‌-చైనా 25 ఏళ్ల ఒప్పందం తరవాత, ఇండియా ఇరాన్‌తో సంబంధాల పునరుద్ధరణపై మరింత శ్రద్ధపెట్టింది. సాధారణ సంబంధాలతోపాటు, చాబహార్‌ ప్రాజెక్టుపైనా ప్రత్యేక దృష్టి సారించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెంటవెంటనే ఇరాన్‌ను సందర్శించడం ఇందులో భాగంగానే భావించవచ్చు. అనుసంధానత, ఆర్థిక లింకేజీ, ప్రాంతీయ భద్రత సమస్యలు, ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌ వంటి అంశాలను మంత్రుల పర్యటనల్లో ప్రధానంగా చర్చించారు.

రచయిత- చంద్రకళ చౌధురి.

ఇదీ చదవండి:'ముందస్తు ఓటింగ్'​కే అమెరికా జనం ఓటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.