ETV Bharat / opinion

చైనా సైన్యంపై గెలుపు సులువే- ఇవే కారణాలు... - చైానా భారత్

ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమైన చైనాను భారత్​ నిలువరించగలదా? డ్రాగన్​ దగ్గరున్న అధునాతన, శక్తిమంతమైన ఆయుధాల్ని ఎదుర్కోగలదా? యుద్ధం వస్తే ఎవరిది విజయం?... ఇప్పుడు అందరివే అనుమానాలు. సంఖ్యా బలం, ఆయుధ బలం ఎలా ఉన్నా... చైనా సైన్యంలోని లోపాలే ఆ దేశానికి శాపాలుగా మారతాయని అంటున్నారు నిపుణులు. పీఎల్​ఏలో పెచ్చుమీరిన అవినీతి, అహంకారం, అనుభవ లేమి... బీజింగ్​కు ప్రతికూలంగా మారతాయని విశ్లేషిస్తున్నారు.

Fragilities in the People's Liberation Army
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో బలహీనతలు
author img

By

Published : Jun 22, 2020, 7:28 PM IST

భారీ సైనిక కవాతులు... హెలికాప్టర్లు, విమానాలతో విన్యాసాలు... జాతీయ వేడుకల్లో ఆయుధ ప్రదర్శనలు... యుద్ధ సన్నద్ధతపై విస్తృత సమీక్షలు.... చైనాలో తరచూ కనిపించే దృశ్యాలివి. ఇవన్నీ చూసిన వారు... డ్రాగన్​ సైన్యం మహా పటిష్ఠంగా ఉందని అనిపించొచ్చు. పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) యుద్ధ భూమిలో దిగితే ప్రత్యర్థులు చిత్తు కావడం ఖాయమన్న భావన కలగొచ్చు. కానీ అంతా భ్రమ.... లేనిది ఉన్నట్లుగా నమ్మించే మోసపూరిత కళలో ఆరితేరిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్​ చైనా సాగిస్తున్న డాబుసరి ప్రచారం.... నిరంకుశ పాలనను చట్టబద్ధమైనది చూపే కుటిల ప్రయత్నం.

ఆయుధాలపైనే అధికంగా దృష్టి సారించడం పీఎల్​ఏ బలహీనతను బయటపెడుతోంది. చైనా సైన్యంలో ఇప్పుడున్న జవాన్లకు ఒక్కసారి కూడా యుద్ధంలో పాల్గొన్న అనుభవం లేదు. వీరు నిజంగా యుద్ధం వస్తే ప్రత్యర్థిని ఎదుర్కొని, నిలబడగలరా అన్నది ప్రశ్నార్థకమే.

చరిత్రే సాక్ష్యం

యుద్ధ భూమిలో చైనా గత అనుభవాలు ఏమంత గొప్పగా లేవు. 1950లలో దిగ్గజ అమెరికన్ జనరల్ డగ్లస్​ మెక్​కార్తర్​ సేనను లొంగదీసుకున్నామని చెప్పే డ్రాగన్​ సైన్యం... తదనంతర కాలంలో పట్టు కోల్పోయింది. 1979లో వియత్నాం యుద్ధం సమయంలో చావు దెబ్బతింది. తమ దేశంపై దండెత్తిన పీఎల్​ఏకు చెందిన 62,500 మంది జవాన్లను హతమార్చి... 550 సైనిక వాహనాలను ధ్వంసం చేశామని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటుంది వియత్నాం. ఈ ఘోర పరాజయం తర్వాత కూడా చైనా దిద్దుబాటు చర్యలను ప్రారంభించలేదు.

అవినీతి సేన

మావో జెడాంగ్ మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన డెంగ్ జియావోపింగ్​ హయాంలో పీఎల్​ఏలో అవినీతి తీవ్రంగా పెరిగింది. సైన్యం విలాసవంతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పీఎల్​ఏ సంస్కృతి, జీవనశైలి క్రమంగా పాకిస్థాన్ డీఎన్​ఏతో విలీనమైంది. అవినీతి, అనైతికత అనే పునాదులపై రెండు దేశాల మధ్య బంధం ఏర్పడింది.

జిన్​పింగ్ విఫల ప్రయత్నాలు

2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత సైన్యంలో అవినీతిని తగ్గించాలని ప్రయత్నించారు షీ జిన్​పింగ్. ఈ క్రమంలోనే సెంట్రల్ మిలిటరీ కమిషన్​కు చెందిన ఇద్దరు వైస్ ఛైర్మన్లను తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటనతో సైన్యంలో పైస్థాయి నుంచే అవినీతి ఉందని తేలింది. ఇద్దరు వైస్ ఛైర్మన్లలో ఒకరైన జనరల్ గువో బాక్సియోంగ్ లంచగొండితనం ఆరోపణలు ఎదుర్కొన్నారు. అధికారులకు పదోన్నతి ఇవ్వడానికి బాక్సియోంగ్ లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. మరో వైస్ ఛైర్మన్ షూ కైహౌని సైతం విధుల నుంచి బహిష్కరించారు. ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో 100 మందికి పైగా జనరల్ స్థాయి అధికారులను అధ్యక్షుడు జిన్​పింగ్​ తొలగించారు. అయినా అవినీతి నిర్మూలన విషయంలో జిన్​పింగ్ విజయం సాధించలేదు.

అవే ప్రతికూలతలు

అవినీతి, అహంకారం నిజమైన యుద్ధంలో సైన్యానికి ప్రతికూలంగా మారతాయి. 2017లో జరిగిన డోక్లామ్ ప్రతిష్టంభనలో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు గల్వాన్ లోయలోనూ ఇదే జరిగింది. కర్నల్ సంతోష్ బాబు బృందం చైనా సైన్యంతో పోరాడి వ్యూహాత్మక 14వ పెట్రోలింగ్ పాయింట్​ను ఆక్రమించకుండా నిలువరించగలిగింది. భారత్, చైనా సైన్యాల మధ్య పోలికలు చూస్తే పీఎల్​ఏలో అంతర్గత వైరుద్ధ్యాలు బయటపడతాయి.

సంఖ్యా బలంలో, ఆయుధ బలంలో గొప్పగా కనిపిస్తున్న చైనా సైన్యంలోని ఈ లోపాల్ని భారత బలగాలు బాగా అర్థం చేసుకున్నాయి. డ్రాగన్​ సేనను దీటుగా ఎదుర్కోగలమా లేదా అన్న అనుమానాలకు ఏమాత్రం తావు లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో దేశ రక్షణకు ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నాయి.

వాయుసేన సన్నాహాలు

గగనతలంలో చైనా సైన్యంపై ఆధిపత్యం సంపాదించేందుకు భారత వాయుసేన ముమ్మరంగా సిద్ధమవుతోంది. రెండు జాగ్వార్ ఐఎస్ స్క్వాడ్రన్లు, మిరాజ్ 2000హెచ్​ ఫైటర్​ జెట్లకు చెందిన ఒక స్క్వాడ్రన్​ సహా మొత్తం 51 ఎయిర్​క్రాఫ్ట్​లను సిద్ధం చేసింది.

దాడి లక్ష్యాలు

సరిహద్దులో ఉన్న చైనా ఎయిర్​ఫీల్డ్​లు కశ్మీర్​, లద్దాఖ్​ సహా ఈశాన్య ప్రాంతాలపై దాడి చేయగలవు. చైనాలోని హోటాన్, లాసా/గోంగ్గర్, నగరి- గుంసా, షిగాజే వంటి ప్రాంతాలు భారత వాయుసేన పరిధిలో ఉన్నాయి. నగరి-గుంస, షిగాజేలో ఉన్న వాయుసేన పోస్టుల్లో దాడిని తట్టుకోగలిగే షెల్టర్లు లేవు. 36 ఎయిర్​క్రాఫ్ట్​లను రక్షించగలిగేలా లాసాలో ప్రస్తుతం షెల్టర్లను నిర్మిస్తున్నారు. హోటాన్​లో రెండు ఎయిర్​క్రాఫ్ట్ షెల్టర్లు ఉన్నట్లు సమాచారం. చైనా సరిహద్దులో భారత వాయు సేన మోహరించిన 270 ఫైటర్ జెట్లు, 68 ఎయిర్​క్రాఫ్ట్​లకు దీటుగా.. 157 ఫైటర్లతో పాటు కొన్ని రకాల డ్రోన్లను పీఎల్​ఏ ఎయిర్​ఫోర్స్ మోహరించవచ్చు.

ప్రస్తుత భారత దేశానికి, 1962లోని భారత దేశానికి తేడా ఉంది. ఇది చైనా విస్మరించకూడదు. మితిమీరిన గర్వం ఉన్న చైనా సైన్యానికి ఈ విషయం ఇప్పటికే పూర్తిగా అర్థమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.