ETV Bharat / opinion

రూపు మారనున్న నగరాలు.. జనారోగ్యానికి జాగా ఏదీ?

author img

By

Published : Jun 26, 2020, 7:10 AM IST

కరోనా ప్రభావంతో ప్రపంచ రూపురేఖలే మారిపోనున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువమంది పట్టణాలకు వలసపోతున్నారు. ఫలితంగా మురికివాడలు మరింత పెరుగుతాయన్న ఆందోళన కలుగుతోంది. దానివల్ల వచ్చే సమస్యల తీవ్రత ఏమిటో ఊహించవచ్చు. కొవిడ్​-19 భావి నగర దృశ్యాన్ని మార్చనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

IMPACT OF COVID ON HEALTH
రూపు మారనున్న నగరాలు.. జనారోగ్యానికి జాగా ఏదీ?

పారిశ్రామిక విప్లవంతో విస్తరించిన నగరాలు నవీన నాగరికతకు విశిష్ట ప్రతీకలని ఎందరో ఇంతకాలం సూత్రీకరిస్తూ వచ్చారు. కొవిడ్‌ విజృంభణతో ఆ భావనను మార్చుకోక తప్పదనిపిస్తోంది. 1960లో ఈ భూమండలం మీద పది లక్షలకు మించిన జనాభా కలిగిన నగరాలు కేవలం 111. 2018కల్లా కేవలం చైనా, భారత దేశాల్లో అలాంటి నగరాల సంఖ్య 548కి చేరింది. 2030కల్లా 28 శాతం ప్రపంచ జనాభా జనసమ్మర్దంతో కిక్కిరిసే నగరాలు, పట్టణాల్లో జీవించనుందని ఐక్యరాజ్యసమితి అంచనా. ఇప్పటికే గ్రామాల నుంచి నగరాలకు పెరిగిన వలసలతో విస్తరించిన మురికివాడలు మున్ముందు ఇంకెంతగా విజృంభిస్తాయోనన్న ఆందోళన కలుగుతోంది.

మురికివాడల్లోనే..

ముంబయి మహానగరంలోని ధారావి మురికివాడలో చదరపు కిలోమీటరుకు 3.75 లక్షలమంది నివసిస్తున్నారు. ఆ లెక్కన భావి మురికివాడల జనసాంద్రత ఇంకెంత భారీగా ఉంటుందో, దానివల్ల వచ్చే సమస్యల తీవ్రత ఏమిటో ఇట్టే ఊహించవచ్చు. కరోనా వైరస్‌ భావి నగర దృశ్యాన్ని మార్చివేయనుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. నేడు ప్రపంచమంతటా ఎక్కువ రెడ్‌ జోన్లు నగరాల్లో, ముఖ్యంగా జనసమ్మర్దంతో కిటకిటలాడే పేటల్లో మురికివాడల్లో ఉన్నాయి. ఉదాహరణకు ముంబయిలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో 30 శాతం మురికివాడల్లోనే ఉండగా, వాటిలో 70 శాతాన్ని రెడ్‌ జోన్లుగా వర్గీకరించారు.

మౌలిక వసతులూ లేని దుస్థితి

అల్పాదాయ వర్గాలైన పేదలకు, దిగువ మధ్యతరగతివారికి అందుబాటు ధరల్లో నివాస వసతి కల్పిస్తామంటూ ప్రభుత్వాలు పలు గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టకపోలేదు. కానీ, అవి బడుగు ప్రజల గృహావసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. పేదలు మురికివాడల్లోని రేకులషెడ్లలో, ప్రభుత్వ సమ్మతి లేని అనధికార బస్తీలు, వాడల్లో బతుకులు వెళ్లబుచ్చాల్సి వస్తోంది. ఆ ఇరుకిరుకు వాడల్లో భౌతిక దూరం పాటించడం చాలా కష్టం. తాగునీరు, విద్యుత్‌, మురికినీటి పారుదల సౌకర్యాలూ అంతంతమాత్రమే. నీటికి ఎప్పుడూ కటకటే. కరోనా బారి నుంచి రక్షించుకోవడానికి పదేపదే చేతులు శుభ్రపరచుకోవడం, స్నానాలు చేయడం ఆ వాడల్లో తేలిక కాదు. అక్కడ మరుగుదొడ్డి సౌకర్యాలను పదిమందీ వాడుకోవలసిన దుస్థితి తప్పదు. కొవిడ్‌ దెబ్బకు ఈ లోపాలే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.

గుజరాత్​, ఒడిశాల అనుభవంతో..

2011 జనగణన ప్రకారం దేశంలో 6.5 కోట్లమంది మురికివాడల్లో నివసిస్తుండగా, వారిలో మూడోవంతు ప్రభుత్వ రికార్డుల్లో లేని మురికివాడల్లో నివసిస్తున్నారు. బెంగళూరులో మురికివాడల సంఖ్య 600 అని ప్రభుత్వ రికార్డులు చెబుతుంటే, దిల్లీ విశ్వవిద్యాలయం ఉపగ్రహ చిత్రాలతో జరిపిన అధ్యయనంలో అవి 2,000గా లెక్కతేలాయి. ప్రభుత్వ లెక్కలకు ఎక్కనివన్నీ అనధికార నివాస ప్రాంతాలేనన్నమాట. వీటిని పురపాలక అధికారులు అక్రమ నిర్మాణాలుగా పరిగణిస్తారు కాబట్టి, ప్రభుత్వం అక్కడ మౌలిక వసతులు కల్పించడం లేదు. వాటిని సొంతంగా అమర్చుకునే తాహతు అక్కడి పేదలకు లేదు. ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణాలకు అధికార గుర్తింపు ఇచ్చి, మౌలిక వసతులు కల్పించడం ఎంత ముఖ్యమో కొవిడ్‌ మహమ్మారి వల్ల తెలిసివస్తోంది. ఈ బృహత్కార్యంలో ప్రభుత్వం మురికివాడవాసులను, స్వచ్ఛంద సంస్థలను (ఎన్జీఓలను) కలుపుకొనివెళితే, గణనీయ ఫలితాలు సిద్ధిస్తాయని గుజరాత్‌, ఒడిశాల అనుభవం చాటుతోంది.

పారిశుద్ధ్యానికి పెద్దపీట

కరోనా మహమ్మారి కేవలం మురికివాడలకే పరిమితం కాదు. నగరాలు, పట్టణాల్లో మార్కెట్లు, వీధులు, కార్యాలయాలు జనంతో కిటకిటలాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తికి అనువుగా ఉంటున్నాయి. మహమ్మారులు నగరాలను రూపాంతరం చెందించిన ఘటనలు చరిత్రలో అనేకం. 19వ శతాబ్దంలో కలరా విరుచుకుపడినప్పటి నుంచి ఐరోపాలోని నగరాలు ఆధునిక పారిశుద్ధ్య వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వసాగాయి. 1800 సంవత్సరంలో ప్లేగు వ్యాధి వచ్చిన తరవాత నుంచి నగరాల్లో గృహాల మధ్య ఎడం ఉండేట్లు, రోడ్డుకు అటూఇటూ ఇళ్లు కట్టేట్లు నగర ప్లానింగ్‌ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా కొవిడ్‌ విరుచుకుపడిన దృష్ట్యా కార్యాలయాలు, వీధులను కొత్త ఆకృతిలో నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే, వీధుల్లో రవాణా రద్దీని, జనసమ్మర్దాన్ని తగ్గించాల్సిందిగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. జనసమ్మర్ధాన్ని నివారించడానికి పది లక్షలకు పైబడి జనాభా ఉన్న ప్రతి పట్టణంలో కనీసం మూడు మార్కెట్‌ ప్రాంతాలను, అంతకు తక్కువ జనాభా గల పట్టణాల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసి పాదచారులు, సైకిళ్లపై వెళ్లేవారికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.

మార్కెట్​లపై దృష్టి..

విపణి ప్రాంతాల రూపురేఖలనూ మార్చాలని, ఫుట్‌పాత్‌ల వెడల్పు పెంచాలని కోరింది. జులై 31 కల్లా మార్కెట్‌ ప్రాంతాన్ని వినియోగించుకునే విక్రేతలు, వినియోగదారుల సర్వేను పూర్తిచేసి, సెప్టెంబరు 30 కల్లా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధంచేసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. మార్కెట్‌ ముఖద్వారాలను బారికేడ్‌ చేయడం, వాహనాల రాకపోకలను బంద్‌ చేయడం వంటి తాత్కాలిక చర్యలను అక్టోబరు మొదటి వారంలో పూర్తిచేసి, వాటి ప్రభావాన్ని నవంబరులో తుది అంచనా వేస్తారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జాగా పథకం కింద మురికివాడవాసుల సంఘాలతో, టాటా ట్రస్ట్‌, నార్మన్‌ ఫోస్టర్‌ ఫౌండేషన్‌ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి రెండు లక్షల కుటుంబాలకు పట్టాలిచ్చి, గృహ వసతి కల్పించింది. పారిశుద్ధ్య, తాగునీరు, పక్కారోడ్లు, వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాలు వేగం పుంజుకొన్నాయి. 2019 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి నుంచి ప్రపంచ హ్యాబిటాట్‌ అవార్డు అందుకున్న జాగా పథకం 2023కల్లా పూర్తవుతుంది. కొవిడ్‌ వ్యాధి సామాజికంగా వ్యాపించకుండా ఉండాలంటే నగరాలు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాలే కాదు- మురికివాడలూ పరిశుభ్రంగా ఉండాలి. జాగా పథకం ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తోంది.

అహ్మదాబాద్‌ ఆదర్శం

Ahmedabad
అహ్మదాాబాద్​

ఉన్నపళాన బుల్‌డోజర్లు వచ్చి తమ గూళ్లను కూల్చివేయవన్న భరోసా ఉంటే మురికివాడల ప్రజలు కనీస సౌకర్యాలతో పక్కా ఇళ్లు కట్టుకోవాలనుకుంటారు. 1995లో అహ్మదాబాద్‌ నగరంలో ప్రారంభమైన మురికివాడల నెట్‌ వర్కింగ్‌ పథకం (ఎస్‌ఎన్‌పీ) పేదలకు స్థిర నివాసానికి భరోసా ఇవ్వడంతో పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. తాగునీరు, ఇంటింటికీ మరుగుదొడ్డి, పక్కా రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, మురుగు, వరద నీటి పారుదల సౌకర్యాల కల్పనకు ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేయీచేయీ కలిపి కృషిచేశారు. మురికివాడలో ఆరోగ్య, విద్యా వసతులను ఏర్పరచుకున్నారు. దీనికైన ఖర్చులో 80 శాతాన్ని నగర పాలిక భరిస్తే, మిగతా 20 శాతాన్ని స్థానిక ప్రజలు భరించారు. ఇంటికి వెయ్యి రూపాయల చొప్పున ప్రజల వాటాను సేకరించి, ప్రభుత్వానికి జమచేసే బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు నెరవేర్చాయి. 2025కల్లా అహ్మదాబాద్‌లో మురికివాడలే ఉండవని నగరపాలిక ప్రకటించింది. అహ్మదాబాద్‌లో సాధించిన విజయాల స్ఫూర్తితో రాష్ట్రమంతటా మురికివాడవాసుల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి సరికొత్త విధానం రూపుదిద్దుకుంది. కొవిడ్‌ను నివారించాలంటే మన నగరాల రూపురేఖలు మారాలన్న చైతన్యం ఎస్‌ఎన్‌పీ పథకంలో అంతర్లీనంగా ఉంది.

- కైజర్‌ అడపా, రచయిత

ఇదీ చదవండి: నేడు 'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్​గార్ యోజన' ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.