ETV Bharat / opinion

కరోనా వైరస్‌ జీవ ఆయుధంగా మారితే! - కోవిడ్- 19 జీవాయుధం

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఆర్థికంగా, సామాజికంగా అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్‌లు దీర్ఘకాలం కొనసాగితే అస్థిర పరిస్థితులు ఏర్పడి ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉంది. రకరకాల భావజాలాలకు చెందిన ఉగ్రవాదులు కొవిడ్‌ మాటున సామాజిక అశాంతిని సృష్టించి, హింసాకాండకు దిగితే కరోనా వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టం. ప్రభుత్వాలు కొవిడ్‌ కట్టడికి సతమతమవుతుంటే ఉగ్రవాదులు దాన్ని వాటంగా తీసుకుని దాడులకు తెగబడవచ్చు.

CORONA BIOWAR
కరోనా వైరస్‌ జీవ ఆయుధం
author img

By

Published : May 16, 2020, 8:15 AM IST

కరోనా వైరస్‌ ప్రపంచాధిపత్యం కోసం చైనా సృష్టించిన జీవాయుధమని ఓ కుట్ర సిద్ధాంతం వ్యాప్తిలో ఉంది. ఈ వైరస్‌ వుహాన్‌ ప్రయోగశాల నుంచి బయటపడిన వైనాన్ని చైనా ప్రభుత్వం కప్పిపెట్టడం వల్ల ప్రపంచానికి ఉపద్రవం దాపురించిందని అమెరికా పాలకులు చేస్తున్న ఆరోపణ కుట్ర సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది.

కానీ, గూఢచారి వర్గాలతోపాటు శాస్త్రవేత్తలు కూడా అమెరికా ఆరోపణ నిరాధారమని ఖండిస్తున్నారు. ఈ వైరస్‌ కృత్రిమంగా సృష్టించినది కాదనీ, జంతువుల నుంచి మానవులకు పాకిందని తేల్చిచెబుతున్నారు. కరోనాను అడ్డుకోవడంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే అమెరికా నేతలు చైనాపై నిందలు మోపుతున్నారని దుమారం రేగుతోంది.

అమెరికా, ఫ్రాన్స్​ సహకారంతో..

అంతేకాదు, ఫ్రాన్స్‌ సహకారంతో చైనా నిర్మించిన వుహాన్‌ ప్రయోగశాలకు అమెరికా ప్రభుత్వం 37 లక్షల డాలర్ల ఆర్థిక సహాయం అందించిందనే వాస్తవమూ వెలుగులోకి వచ్చింది. 2002-2003 మధ్య కాలంలో చైనా, ఇతర ఆసియా దేశాలపై సార్స్‌ వైరస్‌ విరుచుకుపడినప్పుడు ల్యాబ్ ఏర్పాటుకు సిద్ధమయింది.

భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను అడ్డుకోవాలంటే అధునాతన ప్రయోగాలు చేయాలని చైనా ప్రభుత్వం వుహాన్‌ ప్రయోగశాలను నెలకొల్పింది. వ్యాక్సిన్లు, యాంటీ వైరల్‌ మందుల తయారీకి ఆ ప్రయోగాలు తోడ్పడతాయని ఆశించింది. అంతేతప్ప ఆ ప్రయోగశాలలో చైనా పనిగట్టుకుని కరోనా వైరస్‌ను జీవాయుధంగా అభివృద్ధి చేసిందనడానికి ఆధారాలు లేవని పలు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

మూడంచెల వ్యూహం

ఉగ్రవాద బృందాలు తమలో కరోనా సోకినవారిని జనంలోకి పంపి, అందరికీ అంటించే ప్రమాదం ఉందని అమెరికా గూఢచారి సంస్థలు నిర్ధరించాయి. శ్వేత జాత్యహంకారులు మొదలుకొని ఇస్లామీయ ఉగ్రవాదుల వరకు రకరకాల భావజాలాలు ఉన్నవారు ఇలాంటి పనులకు ఒడిగట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఉగ్రవాదులు ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టిన దాఖలాలు ఉన్నాయని అమెరికన్‌ గూఢచారి వర్గాల భోగట్టా.

ఉగ్రవాదుల వల్ల ఒక్కపెట్టున కరోనా కేసులు పెరిగితే, ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థపై విపరీతంగా భారం పడి ప్రభుత్వం తమను రక్షించలేకపోతోందని పౌరుల్లో అపనమ్మకం ఏర్పడుతుంది. ఉగ్రవాదుల నుంచి ముప్పును నివారించడానికి ప్రభుత్వాలు మూడంచెల వ్యూహాన్ని చేపట్టాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

మూడు అంచెల్లో..

మొదటి అంచెలో సామాజిక మాధ్యమాలు, ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌లలో; అంతర్జాల చాట్‌రూమ్‌లు, మెసేజ్‌ బోర్డుల్లో ఉగ్రవాద భావాలున్నవారి సంభాషణలను ఆలకిస్తూ, దాడి ప్రమాదాన్ని ముందే పసిగట్టాలి. ఇలాంటి భావజాలం ఉన్నవారు సంచరించే ప్రాంతాలపైన, అక్కడి జన వర్గాల మీద నిఘా పెట్టాలి. రాజకీయ, సైద్దాంతిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అంటు వ్యాధులను అస్త్రాలుగా ఉపయోగించుకోవడాన్ని బయోటెర్రరిజంగా పరిగణించి శిక్షించాలి.

ఇందుకు చట్టాల్లో తగు మార్పులు చేయడమో లేక కొత్త చట్టాలు తీసుకురావడమో తక్షణం జరగాలి. బయోటెర్రరిజానికి మరణ శిక్ష వంటి తీవ్ర శిక్షలు విధించాలి. రెండో అంచెలో కరోనా వైరస్‌ను ఉద్దేశపూర్వకంగా వ్యాపింపజేసేవారిని కనిపెట్టి నిరోధించాలి. వైరస్‌ ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు సోకింది, ఎవరి నుంచి ఎవరెవరికి ఎలా పాకిందో కనిపెట్టడాన్ని ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌’ అంటారు. తొలి దశల్లో ఈ పద్ధతి పనిచేసినా- వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నప్పుడు ఫలానా వారి నుంచి వ్యాధి సోకిందంటూ తేల్చడం కష్టం.

భిన్న రకమైన వ్యాప్తితో..

అలాంటప్పుడు ఉగ్రవాదులు వైరస్‌ను వ్యాపింపజేశారని నిర్ధారించడమెలా? దీనికి అంటువ్యాధుల నియంత్రణ శాస్తం వద్ద సమాధానాలు ఉన్నాయి. ఒక భౌగోళిక ప్రదేశంలో వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రకాలకు భిన్నమైన రకమేదైనా హఠాత్తుగా రంగ ప్రవేశం చేస్తే దాన్ని ఎవరో పనిగట్టుకుని ప్రవేశపెట్టినట్లు పరిగణించవచ్చు.

భారతదేశంలోకి చైనా నుంచీ, ఇటలీ నుంచీ కరోనా వైరస్‌ వచ్చిందని మొదట్లో నిర్ధరణ అయింది. అలాగే అమెరికాలోకి చైనా కన్నా ఐరోపా దేశాల నుంచే ఎక్కువగా కరోనా ప్రవేశించింది. ఇలా వైరస్‌ రకాల్లో తేడాలు, పోలికలను బట్టి అవి ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టవచ్ఛు మూడో అంచె కింద ముమ్మరంగా లాక్‌డౌన్‌, టెస్టింగ్‌, క్వారంటైన్‌, ఐసోలేషన్‌ల సాయంతో స్థానిక జనాభాకు విదేశీ వైరస్‌ రకాల నుంచి రక్షణ కల్పించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

సైనిక దళాల కీలక పాత్ర

పాకిస్థాన్‌ నుంచి జమ్ముకశ్మీర్‌ మీదుగా ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడి కరోనాను వ్యాపింపజేసే ప్రమాదం పెరుగుతోంది. భారత సైనికులకూ కరోనా అంటించడానికి ఉగ్రవాదులు ప్రయత్నించవచ్చు. ఈమధ్య భారత సాయుధ దళాలు తమ స్థావరాల్లో భౌతిక దూరం పాటించడం, సైనికులను స్వీయ నిర్బంధంలో ఉంచడం ద్వారా కరోనాను నిరోధించాలని చూస్తున్నాయి. దీన్ని భంగం చేయడానికి టెర్రరిస్టులు సరిహద్దుల్లో చీటికిమాటికి కాల్పులకు, చొరబాట్లకు దిగుతున్నారు. సైన్యం తన జాగ్రత్తలో తానుంటూనే ఉగ్రవాదుల భరతం పడుతోంది.

మరోవైపు పౌరుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో సర్కారుకు తోడ్పడుతోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల్లో కరోనా అనుమానితుల కోసం సైన్యం మనేసర్‌లో కేవలం 48 గంటల్లో క్వారంటైన్‌ కేంద్రం నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత మరో 14 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మన వాయు, నౌకా సేనలు విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నాయి.

రంగంలోకి సైన్యం..

భారత సైన్యానికి 13,000 మంది వైద్యులు, నిపుణులు, నర్సింగ్‌ అధికారులు ఉన్నారు. ఇంకా లక్షమంది వరకు వైద్య సహాయక సిబ్బంది ఉన్నారు. ఈ సైనిక వైద్య బలగంలో మూడో వంతును సైన్య అవసరాలకు అట్టిపెట్టి మిగిలినవారిని దేశంలో కరోనాపై పోరాటానికి నియోగించవచ్చునని ఒక మాజీ సైన్యాధికారి సూచించారు. రిటైర్డ్‌ సైనిక వైద్యాధికారులూ రంగంలోకి దిగడానికి సిద్ధమే.

మన త్రివిధ సాయుధ బలగాలకు 130 ఆస్పత్రులు ఉన్నాయి. అవసరమైతే 100 క్షేత్ర స్థాయి ఆస్పత్రులను వేగంగా ఏర్పాటుచేయవచ్ఛు సైన్యంలోని ఇంజినీర్లు పౌర భవనాలను, ఫ్యాక్టరీలు, షెడ్డులను కరోనా చికిత్సా కేంద్రాలుగా మార్చగలరు. కొవిడ్‌ జనసామాన్యంలోకి మరింత విస్తృతంగా చొచ్చుకుపోతే, జనాన్ని స్వీయ నిర్బంధంలో ఉండేలా చూడటానికి సైన్యం రంగప్రవేశం చేయవచ్చు. ప్రజలకు నిత్యావసరాలు అందించే పనినీ సైన్యం సమర్థంగా నిర్వహించగలదు. ఉగ్రవాదుల వల్ల కానీ, దానంతట అదే కానీ కొవిడ్‌ వ్యాపిస్తే దాని కట్టడి కోసం ప్రభుత్వానికి సైన్యం అవసరం బాగా పెరగవచ్చు.

మహమ్మారి సృష్టించిన కలకలం

ఉగ్రవాదులు కరోనా వైరస్‌నో లేక కరోనా పీడితులనో జీవాస్త్రాలుగా ఉపయోగించే ప్రమాదం కొట్టిపారేయలేనిది. ఈ వైరస్‌లో అత్యంత ప్రమాదకర రకాలను (స్టెయ్రిన్స్‌ను) టెర్రరిస్టులు దొరకబుచ్చుకుంటే ప్రపంచంలో విలయం సంభవిస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

కరోనా వైరస్‌వల్ల జనించిన కొవిడ్‌ వ్యాధి ప్రపంచ దేశాలను ఆర్థికంగా, సామాజికంగా అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్‌లు దీర్ఘకాలం కొనసాగితే అస్థిర పరిస్థితులు ఏర్పడి ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చునని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ హెచ్చరించారు. రకరకాల భావజాలాలకు చెందిన ఉగ్రవాదులు కొవిడ్‌ మాటున సామాజిక అశాంతిని సృష్టించి, హింసాకాండకు దిగితే కరోనా వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైపోతుందని గుటెర్రెస్‌ అన్నారు. ప్రభుత్వాలు కొవిడ్‌ కట్టడికి సతమతమవుతుంటే ఉగ్రవాదులు దాన్ని వాటంగా తీసుకుని దాడులకు తెగబడవచ్చు.

(రచయిత- ఏఏవీ ప్రసాద్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.