ETV Bharat / opinion

ఆహారంతోనే ఆరోగ్య భద్రత

శ్వాసవ్యవస్థపై దాడిచేసే ఇన్‌ఫ్లుయెంజా, సార్స్‌, మెర్స్‌వంటి వైరస్‌లు దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తున్నాయి. వైరస్‌ల జన్యునిర్మాణంలోని సంక్లిష్టతలు, తరచూ జన్యుమార్పిడికి లోనవుతుండటం- టీకా అభివృద్ధికి అవరోధకాలవుతున్నాయి. మరోవైపు భారతీయ జీవనశైలిలోనే వ్యాధినిరోధకతను పెంచే అంశాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉండటం సానుకూలాంశం. ఆయుర్వేద గ్రంథమైన చరక సంహిత- వ్యాధి నిరోధకత 12 అంశాలపైన ఆధారపడి ఉంటుందని చెబుతుంది.

HEALTH DEPENDS ON FOOD DIET
ఆహారంతోనే ఆరోగ్య భద్రత
author img

By

Published : May 5, 2020, 7:44 AM IST

కొవిడ్‌ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేందుకు అందరూ టీకా కనిపెట్టడం, వ్యాధి నిరోధకతను పెంచుకోవడం గురించి మాట్లాడుతున్నారు. మొదటిది జీవసాంకేతికత ముడివడిన అంశం. శ్వాసవ్యవస్థపై దాడిచేసే ఇన్‌ఫ్లుయెంజా, సార్స్‌, మెర్స్‌వంటి వైరస్‌లు దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తున్నాయి. వీటిలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ తక్కువ ప్రమాదకారి. సార్స్‌, మెర్స్‌లు మధ్యంతరం. కరోనా అత్యంత ప్రమాదకరం. ఈ వైరస్‌ మానవ శరీరంలోని ఏసీఈ-2 అనే గ్రాహకాలను తన కొమ్ముల ద్వారా అంటిపెట్టుకొని కణాలలోకి ప్రవేశిస్తుంది. గ్రాహకాల పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల అవయవాల పనితీరు మందగిస్తుంది. ఇది వృద్ధుల్లో వ్యాధి తీవ్రతను పెంచుతుంది.

మాయదారి వైరస్​లు

అనేక సంవత్సరాలుగా వైరస్‌లు దాడి చేస్తున్నా, వాటిని సమూలంగా నిర్మూలించే టీకా అభివృద్ధి ఇప్పటివరకూ జరగలేదు. వైరస్‌ల జన్యునిర్మాణంలోని సంక్లిష్టతలు, తరచూ జన్యుమార్పిడికి లోనవుతుండటం- టీకా అభివృద్ధికి అవరోధకాలవుతున్నాయి. టీకాల ధరలూ అధికంగా ఉంటాయి. పల్స్‌ పోలియో మాదిరిగా కరోనాకూ ఉచిత టీకా పథకం ప్రవేశపెట్టడానికి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్థితిగతులు సహకరిస్తాయా అన్నదీ సందేహమే. మరోవైపు భారతీయ జీవనశైలిలోనే వ్యాధినిరోధకతను పెంచే అంశాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉండటం సానుకూలాంశం. ఆయుర్వేద గ్రంథమైన చరక సంహిత- వ్యాధి నిరోధకత 12 అంశాలపైన ఆధారపడి ఉంటుందని చెబుతుంది. మొదటిది సూర్యరశ్మి. భౌగోళిక స్వరూపం వల్ల భారతదేశంలో సంవత్సరం పొడుగునా సూర్యరశ్మి ఉంటుంది. భారతీయ జీవన శైలిలో సూర్య నమస్కారాలు ఓ భాగం. దీనివల్ల శరీరంలో విటమిన్‌-డి, మెలనిన్‌ అనే పదార్థం ఉత్పత్తి కావడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. రెండో అంశం పుట్టిన సమయం. శిశిర, హేమంత రుతువుల్లో పుట్టిన శిశువులకు వ్యాధి నిరోధకత ఎక్కువ. అందువల్లే పెళ్ళి శుభముహూర్తాలకు శ్రావణ, మాఘ మాసాలు అనువైనవిగా నిర్ణయించారు. మూడో అంశం యుక్తవయసు. పాతికేళ్ల వయసులో సంతాన వృద్ధి వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. వీటిని ఆచరణలో పెడుతుండటం వల్ల జన్యురూపేణా బలమైన వ్యాధి నిరోధక శక్తి మనకు అందుతుంది. యోగ ప్రక్రియలోని ప్రాణాయామ, యోగాసనాల ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తోందని గుర్తించారు. పూర్వీకుల ఆహార నియమాలు, ఆచార వ్యవహారాలు వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండేందుకు దోహదపడుతున్నాయి. పండగలు, ఏకాదశి రోజుల్లో ఆచరించే ఒక్కపొద్దు (లంఖణం)వల్ల వ్యాధి నిరోధక శక్తి, ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్‌ పరిమాణాలు వెయ్యి రెట్లు పెరుగుతాయి. దీని మీద పరిశోధనలకు 2016లో యొస్సినోరి యొసుమి(జపాన్‌)కి నోబెల్‌ బహుమతి లభించింది. చద్దన్నం-పెరుగు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, తాజా పచ్చళ్ల వల్ల మేలు చేసే (ప్రొ బయోటిక్‌) బ్యాక్టీరియా వృద్ధి చెంది, పేగుల్లో వ్యాధి నిరోధక శక్తి (గట్‌ ఇమ్యూనిటీ)ని పెంపొందింపజేసి పలు రకాల జీర్ణాశయ వ్యాధుల బారినుంచి రక్షిస్తాయి. స్కర్వీ వ్యాధిపై ‘జేమ్స్‌ లిండ్‌’ అనే వైద్యుడు పరిశోధనలు నిర్వహించి- శాకాహారం, తాజా ఆహారం తినకపోవడమే అన్ని జబ్బులకు మూలకారణమని తేల్చారు.

చాదస్తాలు కాదు...

పిండి ముగ్గులు, రుబ్బురోళ్ళు, తిరగలి వాడకం వల్ల మహిళల గర్భాశయానికి రక్త ప్రసరణ సాఫీగా జరిగి, సక్రమంగా అండం విడుదలవుతుంది. అండం జీవ నాణ్యత మెరుగై తరవాతి తరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలంగా ఏర్పడుతుంది. సహజ ప్రసవాలకు బదులు ‘సిజేరియన్‌’ సంస్కృతి ప్రబలిన రోజులివి. దీనివల్ల ప్రారంభ దశలోనే జీర్ణాశయ వ్యవస్థకు మేలు చేసే సూక్ష్మజీవులను శిశువులు కోల్పోతున్నారు. ఫలితంగా పేగుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోందని అనేక శాస్త్రీయ పరిశోధనలు పేర్కొంటున్నాయి. పోలేరమ్మ, తలుపులమ్మ, శీతలమ్మ వంటి గ్రామ దేవతల కొలువుల్లో పసుపు నీటితో అభిషేకం జరిపి, వేపాకులతో అలంకరించడం మన సంప్రదాయం. ఇంటిముందు తులసి కోట పూజ అనాదిగా వస్తున్న ఆచారం. పసుపు, వేప, తులసి వంటివి వైరస్‌తో పాటు ఇతర బాక్టీరియానూ నిర్వీర్యం చేస్తాయన్నది నవీన పరిశోధనల సారాంశం. భారతీయ వంటకాల్లో ఉపయోగించే మిరియాలు, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, అల్లం, జీలకర్ర వంటివీ వైరస్‌లను దూరం చేస్తాయని నిరూపితమైంది. జాతరలు, ఉత్సవాల్లోనూ నిగూఢమైన ఆచారాలు వ్యాధి నిరోధకత పెంచి కలరా, మశూచి, ఆటలమ్మ తదితర అంటువ్యాధులు ప్రబలకుండా చేసిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌, డీప్‌ లెర్నింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ లాంటి సరికొత్త సాంకేతికతను ఎంత ఉపయోగించినా, అంటువ్యాధులు వ్యాప్తించే విధానాన్ని కనుక్కోగలమేమో కాని నివారించలేం. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ విధించి ఆదిలోనే వ్యాధి వ్యాప్తి నిలుపుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, ఈ తరహా వ్యాధుల నివారణకు రోగ నిరోధకతకు తోడ్పడిన పూర్వీకుల జీవనశైలి, నాగరికతలే మనకు ఆచరణీయాలు!

--- డా. కమ్మ శ్రీనివాసులు(జీవసాంకేతిక విభాగంలో ఆచార్యులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.