ETV Bharat / opinion

చదువులకు చీడ వదిలించేలా.. నూతన విద్యావిధానం - Eenadu Editorial page

దేశంలో విద్యలో సమూల మార్పునకు నూతన జాతీయ విద్యావిధానం రూపంలో ఓ సదావకాశం లభించింది. కొత్త విధానాన్ని సరైనరీతిలో అమలు చేసేందుకు అత్యున్నతాధికారాలు కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బలమైన రాజకీయ సంకల్పంతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం ఉండాలి. కొత్త జాతీయ విద్యావిధానాన్ని సమర్థంగా అమలు చేయడం ద్వారా- దేశ యువత భవితను బంగారంలా తీర్చిదిద్దుకునే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి.

GREAT OPPORTUNITY TO CHNAGE EDUCATION SYSTEM WITH NEW EDUCATION POLICY
చదువులకు చీడ వదిలించేలా...
author img

By

Published : Oct 29, 2020, 9:00 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం-2020 ఇరవై ఒకటో శతాబ్దంలోనే మొదటిది. ఆర్థిక, సామాజిక నేపథ్యాలతో సంబంధం లేకుండా అందరికీ అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యావకాశాలు సమానంగా అందుబాటులో ఉండే విద్యావ్యవస్థను-2040 నాటికి సాకారం చేయాలనే విస్తృత లక్ష్యాన్ని ఈ విద్యావిధానం దేశం ముందుంచింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చీఫ్‌ కె.కస్తూరిరంగన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రూపొందించిన ముసాయిదా ఆధారంగా కొత్త విధానాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం కమిటీ అన్ని స్థాయుల్లో సంబంధిత భాగస్వాములందరితో విస్తృత రీతిలో సంప్రదింపులు జరిపింది.

భారత్‌ను ప్రపంచ విజ్ఞాన శక్తిగా తీర్చిదిద్దడం, 2040నాటికి అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేలా చూడటం, 2035నాటికి ఉన్నత విద్యాసంస్థల్లో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌)ని 50శాతం (2018లో 26.3 శాతం) చేయడం వంటి లక్ష్యాలతో విధాన పత్రం రూపొందించారు. అత్యున్నత నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్న నేపథ్యంలో యువతను నిపుణులుగా, ఉద్యోగాలకు అర్హులుగా, ఉత్పాదక వనరులుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వం చేపట్టిన ‘భారత్‌లో తయారీ’, ‘నైపుణ్య భారత్‌’ వంటి కార్యక్రమాలకు అనుగుణంగా యువతను సంసిద్ధం చేయాలి.

'ప్రాథమిక’ పునాదులు బలహీనం

చదవడం, రాయడం, అంకెలు, ప్రాథమిక లెక్కల పరిజ్ఞానం వంటివి బడికెళ్లేందుకైనా, జీవితకాల అభ్యసనానికైనా తప్పనిసరిగా వంటబట్టాల్సిన నైపుణ్యాలు. చాలా సర్వేలు స్పష్టం చేసిన దాని ప్రకారం ప్రస్తుతం మనం అభ్యసన సంక్షోభంలో ఉన్నాం. దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉన్న అయిదు కోట్ల మందికిపైగా విద్యార్థుల్లో చాలామందికి కనీస స్థాయి అక్షరాలను చదవడం రాదని, అర్థం చేసుకునే సామర్థ్యం కొరవడిందని, చిన్న అంకెలతో కూడికలు, తీసివేతలు చేయడం సైతం రావడం లేదని వెల్లడైంది. ఒకటో తరగతిలో 16శాతంమంది చిన్నారులు మాత్రమే తమ పాఠ్యపుస్తకాన్ని చదవగలుగుతుండగా, మూడో తరగతిలో రెండు శాతం విద్యార్థులు రెండంకెల సంఖ్యల్ని గుర్తించలేకపోయినట్లు 2020 వార్షిక విద్యాస్థితి నివేదిక (అసెర్‌) వెల్లడించింది. ఇటీవల పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటన మేరకు- దేశంలోని అన్ని స్థాయుల్లో 10.84 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 17శాతం మేర 10.60 లక్షల (61.84 లక్షలు) ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 35వేలు (14శాతం), తెలంగాణలో 18వేల (13శాతం) టీచర్‌ పోస్టులను భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ ఖాళీలను సాధ్యమైనంత త్వరగా నిర్దిష్ట కాలవ్యవధితో భర్తీ చేయాలని కొత్త విద్యావిధాన పత్రం పేర్కొంది.

2030నాటికి విద్యాపరంగా నిష్ణాతులైన, బహుళరంగ ఉపాధ్యాయ విద్యా కోర్సులే అమల్లో ఉండాలని సూచించింది. అయితే, ఈ విధాన నిర్ణయాన్ని అమలు చేయడానికి పదేళ్ల గడువు సూచించడం చాలా ఎక్కువ సమయమేనని చెప్పొచ్చు. ఈలోపు సరైన ప్రమాణాలు లేని ఉపాధ్యాయ అభ్యర్థులు పెద్దయెత్తున బయటికొచ్చే అవకాశాలున్నాయి. నాలుగేళ్ల వ్యవధిని ఇస్తూ 2024 గడువుగా సూచించడం సమంజసంగా ఉంటుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధ్వర్యంలో నడిచే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో గత మూడు దశాబ్దాలుగా బోధకులను నియమించడాన్ని విస్మరించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు సైతం చాలా విభాగాల్లో ముగ్గురు నలుగురు ప్రొఫెసర్లతో గడిపేస్తున్నాయి. ఇది బోధన, అభ్యసన ప్రక్రియను, నాణ్యమైన పరిశోధనను దెబ్బతీస్తోంది. నాణ్యత లేని ఫ్యాకల్టీ, పీహెచ్‌డీలు, పరిశోధనలకు పరిశ్రమవైపు నుంచి నిధులు లేకపోవడం వంటి సమస్యలు చాలా వర్సిటీల్లో పరిశోధనల్ని నాశనం చేశాయి. చాలామేర రాష్ట్రస్థాయి వర్సిటీల్లో ఫ్యాకల్టీ ఎంపికలో భారీ అవినీతి చోటుచేసుకుంటుండటం వ్యవస్థను దెబ్బతీస్తోంది.

కొడిగడుతున్న ప్రమాణాలు

దురదృష్టవశాత్తూ మనదేశంలో విద్యపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో ఆరు శాతానికి చేరువవ్వడం లేదు. ప్రస్తుతం ఈ వ్యయం జీడీపీలో 4.43 శాతంగా ఉంటోంది. ఇది అత్యంత అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకన్నా మరీ తక్కువ. విద్యపై తక్కువస్థాయిలో సమకూరుతున్న నిధుల వ్యయం జిల్లా, విద్యాసంస్థల స్థాయిలో సరైనరీతిలో జరగడం లేదని విధాన పత్రం గుర్తించింది. ఉన్నత విద్యలో ఉత్సాహవంతులైన, సామర్థ్యం కలిగిన ఫ్యాకల్టీ ఉంటే, నూతన విద్యావిధానం సాకారమవుతుందని పేర్కొంది. కొత్త విధానాన్ని సరైనరీతిలో అమలు చేసేందుకు అత్యున్నతాధికారాలు కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బలమైన రాజకీయ సంకల్పంతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం ఉండాలి. కొత్త జాతీయ విద్యావిధానాన్ని సమర్థంగా అమలు చేయడం ద్వారా- దేశ యువత భవితను బంగారంలా తీర్చిదిద్దుకునే ఈ సువర్ణావకాశాన్ని జారవిడవరాదు.

- డా.ఎన్‌.వి.ఆర్‌.జ్యోతికుమార్‌, రచయిత - మిజోరం కేంద్ర విశ్వవిద్యాలయంలో వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి

ఇదీ చదవండి- 61.8 % మంది చిన్నారుల ఇళ్లలో స్మార్ట్​ఫోన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.