ETV Bharat / opinion

గ్రీన్​ హైడ్రోజన్​తో కాలుష్యానికి చెక్​ పెట్టొచ్చా?

కరోనా అందరికీ నష్టం కలిగించింది. మరో కోణంలో చూస్తే.. కొందరిని ఆలోచింపజేసిందని చెప్పొచ్చు. ఊపిరితిత్తులపైనే వైరస్​ అధికంగా ప్రభావం చూపడం వల్ల అందరి దృష్టి స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ వైపే మళ్లిందని చెప్పొచ్చు. దీంతో కర్బన ఉద్గారాలను విడుదల చేసే శిలాజ ఇంధనాలకు స్వస్తి పలికి... హరిత ఉదజని(గ్రీన్​ హైడ్రోజన్​)పై పలు దేశాల దృష్టిసారించాయి. మరి దీంతో కాలుష్యానికి చెక్​ పెట్టొచ్చా?

Fighting pollution with green hydrogen
గ్రీన్​ హైడ్రోజన్​తో కాలుష్యానికి చెక్​ పెట్టొచ్చా?
author img

By

Published : Jan 11, 2021, 7:55 AM IST

కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో స్వచ్ఛత మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ కాలుష్య నివారణ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు దృష్టి సారించాయి. వైరస్‌ల ప్రభావంతో ముందుగా దెబ్బతినేది ఊపిరితిత్తులే. శరీరం వైరస్‌ల నుంచి సమర్థంగా రక్షణ పొందాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండి తీరాలి. అంటే, మనం పీల్చే గాలి కాలుష్యరహితంగా ఉండాలి. ఈ క్రమంలో కర్బన ఉద్గారాలకు తావివ్వని స్వచ్ఛమైన ఇంధనాల తయారీకి నూతన మార్గాలను అన్వేషిస్తూ ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. స్వచ్ఛమైన శక్తి వనరుల జాబితాలో తాజాగా చేరిన హరిత ఉదజని (గ్రీన్‌ హైడ్రోజన్‌)- ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. నీటి నుంచి ఈ ఇంధన వనరును అపార పరిమాణంలో ఉత్పత్తి చేసే వీలుంది. ఉదజని ఇంధనం ఆమ్లజనితో కలిసి మండినప్పుడు కర్బన వాయువులు వెలువడవు. అందుకే దీన్ని 'జీరో కార్బన్‌ ఫ్యూయల్‌'గా వ్యహరిస్తున్నారు.

కాలుష్యం తక్కువ!

ఈ నూతన ఇంధనంతో కాలుష్యానికి ఆస్కారం తక్కువ. ఇప్పటి వరకూ ప్రయోగశాలకే పరిమితమైన హరిత ఉదజని ఇప్పుడు వాణిజ్య స్థాయి వినియోగానికి సిద్ధమైంది. ఐరోపా దేశాలు ఈ దిశగా ముందడుగు వేస్తున్నాయి. అంతరిక్ష నౌకల్లో చోదకశక్తి కోసం కూడా ఉపయోగిస్తున్నారు. విద్యుత్తు మాదిరిగా ఉదజని కూడా శక్తివాహకం. అయితే, దీని వాణిజ్యస్థాయి ఉత్పత్తి కోసం ప్రాథమికంగా మరొక ఇంధనం కావలసి వస్తుంది. ఉదజని సంగ్రహణ ప్రక్రియలో భాగంగా విద్యుత్తు శక్తిని నీటి ద్వారా ప్రసరింపజేస్తారు. దీంతో నీరు ఉదజని, ఆమ్లజని పరమాణువులుగా విడిపోతుంది. హరిత ఉదజని ఉత్పత్తికి ఇది చవకైన మార్గం.

శిలాజ ఇంధనలకు స్వస్తి!

ప్రపంచంలో ఈ తరహా ఉదజని శక్తి కేంద్రం జపాన్‌లోని ఫుకుషిమాలో గత ఏడాది మార్చిలో ప్రారంభమైంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 10 మెగావాట్లు. ఐరోపా నుంచి వెలువడుతున్న పలు శాస్త్ర పరిశోధనల నివేదికలను పరిశీలిస్తే.. హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్లు, లిథియం అయాన్‌ బ్యాటరీలు మానవాళి భవిష్యత్తును ఊహకు అందని రీతిలో మార్చివేయబోతున్నాయి. దాదాపు 75 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించే బృహత్‌ పథకానికి ఐరోపా శ్రీకారం చుట్టింది. చవకైన శుద్ధమైన ఇలాంటి ఇంధనాల అభివృద్ధిపై ఐరోపా దేశాలు దృష్టి సారించాయి. ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లోనూ శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ, సంప్రదాయేతర హరిత ఇంధనాల తయారీకి మేలైన మార్గాలను అన్వేషిస్తున్నారు. శిలాజ ఇంధనాలకు సంపూర్ణంగా స్వస్తి పలకడమే అంతిమ ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ దిశగా హరిత ఉదజని ఇంధనం కీలకం కానుందని గుర్తించాయి. దీనిని వాణిజ్య స్థాయిలో చవకగా తయారు చేయగలిగితే రవాణా, పారిశ్రామిక రంగాలే కాకుండా పరోక్షంగా ప్రపంచ ఆర్థికరంగం యావత్తూ అభివృద్ధి చెందుతుంది.

అత్యుత్తమ మార్గం

పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు వంటి అనేక పెట్రోలియం ఉత్పత్తుల నుంచి కర్బన కాలుష్యాలను విడదీసి వాటిని కృత్రిమంగా శుద్ధి చేయడం కంటే సులభమైన చవకైన మార్గం కోసం ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. హరిత ఉదజని ఇంధనం- అలాంటి అత్యుత్తమ మార్గం. ఈ స్వచ్ఛమైన ఉదజని శక్తితో ఇంధన రంగంలో, తద్వారా వాతావరణ పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం సాధ్యమవుతుందన్న ఆశ రోజురోజుకూ బలపడుతోంది. పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి హరిత గృహ వాయువుల అవశేషాలనూ ఈ వినూత్న ఇంధన శక్తి విడుదల చేయదు. ఈ ఇంధనం ఉత్పత్తికి కావలసిన హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైట్స్‌, వీటితో పాటు లిథియం-అయాన్‌ బ్యాటరీలు రెండూ కలిసి మానవాళి చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. ఈ కలను సాకారం చేసేందుకే 'యూరోపియన్‌ గ్రీన్‌ డీల్‌' పథకం రూపుదిద్దుకుంది.

భారీస్థాయిలో ఉదజని ఇంధనం ఉత్పత్తి కోసం... జర్మనీ, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌ తదితర ఐరోపా ఆర్థిక సమాజం (ఈఈసీ) సభ్య దేశాలు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాయి. ఉదజని ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు భారీగా వ్యయం చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. హరిత ఇంధన వ్యూహాల కోసం పలు దేశాలు భారీ మొత్తాలను కేటాయించాయి. వచ్చే అయిదేళ్లలో 500 మెగావాట్ల గ్రీన్‌ ఎలక్ట్రోలైజర్స్‌ ఉత్పత్తి సామర్థ్యంతో హైడ్రోజన్‌ ప్లాంట్లు నెలకొల్పాలని పోర్చుగల్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు నిర్ణయించాయి. ఈ పరిణామాలతో పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు శిలాజ ఇంధనాల చరిత్ర ముగిసే రోజు సమీపంలోనే ఉంది. ఈ కాలుష్య పోరాటంలో హైడ్రోజన్‌ ఇంధనం అగ్రభాగాన నిలుస్తుంది.

రచయిత- ఆర్‌.పి.నైల్వాల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.